You Are Here: Home » ఇతర » ఘన తంత్రం

ఘన తంత్రం

27Colదేశం మనది… జెండా మనది… అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. భారత రాష్టప్రతి ఎరక్రోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్సవాలకు అతిథిగా వచ్చిన భూటాన్‌ రాజు జగ్మి ేకసర్‌ నావ్గుగెల్‌ వాంగ్‌చుక్‌ ఆసక్తిగా విన్యాసాలను తిలకించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధానుల్లో పరేడ్గ గ్రౌండ్లలో సైన్యం మన ఆయుధ సంపత్తితో అద్భుత విన్యాసాలను ప్రదర్శించింది. అగ్ని-5 క్షిపణి పరేడ్గ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిసారిలాగానే ఈ సారి కూడా రాషాట్రల శకటాలు తమ రాష్ట్ర ప్రత్యేకతను చాటుకునేలా రూపుదిద్దుకుని ప్రదర్శనకు వచ్చారుు.

వివిధ రాషాట్రల శకటాలు దేదీప్యమానంగా ప్రదర్శింపబడుతుంటే ఆంధ్రప్రదేశ్‌ శకటం మాత్రం కానరాలేదు. మన రాష్ట్ర శకటం ఎంపికకాకపోవడం వరుసగా ఇది నాల్గవసారి. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిన మనవారు అవమానంగా భావించాల్సి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇండియా గేట్‌ వద్ద అమరులైన సైనికులకు నివాళులర్పించారు. అమర జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. వివిధ రాషాట్రల్లో గవర్నర్లు జెండా ఎగురువేశారు. దేశంలోని వాడవాడలా జెండా రెపరెపలాడింది. పలుచోట్ల చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచారుు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top