You Are Here: Home » సినిమా » పాటలు » గ ణేష్ (1998)- రాజహంసవో రాత్రిహింసవో

గ ణేష్ (1998)- రాజహంసవో రాత్రిహింసవో

పల్లవి :

రాజహంసవో రాత్రిహింసవో
రాచిలకా రావే ఓ రసరంభారావే
చంటి మన్మథా జంట తుమ్మెదా
సరసానికి రారా ఈ వరసే రుచిలేరా
వయ్యారి గోదారి నీ ఒళ్లోనే ఈదేస్తా
అందాల గంధాలన్నీ
మెళ్లోనే పూసేస్తా
సరి పద మరి నీదే ఆలస్యం
సరి గమ పద నీకే ఆహ్వానం

చరణం : 1

శ్రీ చిలకమ్మ కులుకు
సింగారాలే చిలుకు
ఊహల్లోనే ఉలుకు
తొలి మోహంలోనే పలుకు
విరహాల వీణనే సరసంగా మీటనా
అధరాల తేనెతో మురిపాలు పంచనా
సిగ్గే మొగ్గలై విచ్చెనులే
నీ బుగ్గ నిగ్గులే తేలేనులే
అన్నీ నీవని వచ్చానుగా
నా కన్నెమనసునే ఇచ్చానుగా

చరణం : 2

వరకట్నంగా వయసు
అది ముట్టిందంటే అలుసు
ఇచ్చేశా నా మనసు
ఇక రానేరాదని తెలుసు
వయసమ్మ వాంఛలు
వలలెన్నో వేయగా
కౌగిళ్ల కంచెలు కసి ఈడుమేయగా
ముద్దుముచ్చట ఈ రాతిరి
సరిహద్దే లేనిదే నీ అల్లరి
ఎన్నాళ్లాగునమ్మా ఈ కోరిక
మన తాంబూలాలకే తయారుగా

చిత్రం : గ ణేష్ (1998)
రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ
గానం : హరిహరన్, సుజాత

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top