You Are Here: Home » ఇతర » గ్రాన్యులేటెడ్‌ ఇసుకను ఉపయోగిద్దాం

గ్రాన్యులేటెడ్‌ ఇసుకను ఉపయోగిద్దాం

నిర్మాణ రంగానికి ఇప్పుడు ఎదురెైన అతిపెద్ద సమస్య ఇసుక కొరత. స్థిరాస్తి రంగంలో భాగంగా కట్టడాల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నదుల ఇసుకను ఉపయోగించడంపెై పర్యావరణవేత్తల ఆందోళన ఒకపక్క మరోపక్క న్యాయస్థానాల కఠిన నియంత్రణల నేపథ్యంలో స్ల్యాగ్‌ సాండ్‌ (గ్రాన్యులేటెడ్‌ ఇసుక) ప్రస్తావన తెరపెైకి వచ్చింది.

Sand-(1)ఈ క్రమంలో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కాంట్రాక్టర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ (సిడిఐ) ప్రస్తుత పరిణామంపెై ‘ఇసుకకు ప్రత్యామ్నాయ వనరుగా గ్రాన్యులేటెడ్‌ స్ల్యాగ్‌’ పేరిట జాతీయ సదస్సును నిర్వహించి లోహాన్ని వేరు చేయగా మిగలే చిట్టెం. సదస్సులో పాల్గొన్న నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌ అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ (ఎన్‌సిసిబి ఎం) మాజీ జాయింట్‌ డెైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌హెచ్‌రావు, సిడిఐ ఛెైర్మెన్‌ సచ్చిదానందరెడ్డి, డెైరెక్టర్‌ పురుషోత్తంరెడ్డి, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ చాప్టర్‌ చెైర్మెన్‌ సుధాకర్‌, జెఎన్‌టియు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎన్‌వి రమణరావు తదితరులంతా గ్రాన్యులేటెడ్‌ ఇసుక ప్రాధాన్యతను నొక్కి చెప్పారుఉ. జపాన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో ఇప్పటికే గడిచిన 20 ఏళ్లుగా మామూలు ఇసుకకు బదులు గ్రాన్యులేటెడ్‌ స్ల్యాగ్‌ను ఉపయోగిస్తున్న విషయాన్ని సదస్సులో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినెలా సుమారు 30 లక్షల టన్నుల ఇసుకను నిర్మాణ రంగం కోసం ఉపయోగిస్తున్నారని ఒక అంచనాగా తెలిపిన వక్తలు, ప్రస్తుతమున్న నిషేధం కారణంగా ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

Sandమనదేశంలోని స్టీల్‌ పరిశ్రమ నుంచి ప్రతి సంవత్సరం 41 మిలియన్‌ టన్నుల స్ల్యాగ్‌ వెలువడుతుండగా 2020 నాటికి ఇది 90 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందన్నారు. దీనిని సిమెంట్‌ తయారీకి సైతం ఉపయోగిస్తూ హరిత భవనాల నిర్మాణంలోను ఉపయోగిస్తూ వివరించారు. స్టీల్‌ ఉత్పత్తిలో ఉపయోగించి ముడిసరుకులో సుమారు 30 శాతం స్ల్యాగ్‌ రూపాన్ని సంతరించుకుంటున్నదని చెప్పారు.నాణ్యత, మన్నికలో సాధారణ ఇసుక కంటే ఈ స్ల్యాగ్‌ మరింత మేలెైనదన్న నిపుణులు నేడు ఉపయోగిస్తున్న రాక్‌ స్యాండ్‌ వల్ల మున్నుందు పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ తరుణంలో ప్రజలకు స్ల్యాగ్‌ వాడకంపెై అవగాహన కల్పించాల్సిన అవసరమునమ్నదని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షులు శీనయ్య అన్నారు. స్టీల్‌ పరిశ్రమమ సమీపాన టన్ను స్ల్యాగ్‌ ధర రూ.500 నుంచి రూ.600 ఉండగా, ఇతర ప్రాంతాలకు తరలింపు క్రమంలో రవాణా వ్యయం చేరి ఈ ధర కాస్త ఎక్కువయ్యే అవకాశముంది. నిర్మాణ రంగంలో స్ల్యాగ్‌ వినియోగం సురక్షితమేనని పరీక్షల ద్వారా స్పష్టమైందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని వక్తలన్నారు.

స్టీల్‌ ఉత్పత్తిలో భాగంగా ఉపయోగించే మెటీరియల్‌ను సుమారు 1,500 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ట్రీట్‌ చేసుఎ్తన్నందువల్ల ఈ స్థాయి ఉష్ణోగ్రత వద్ద రసాయనాలన్నీ స్తబ్దమై వినియోగానికి అనుగుణంగా స్ల్యాగ్‌ ఉంటుందని నొక్కి చెప్పారు.అయితే, స్లాగ్‌ను సిమెంట్‌ తయారీ కంపెనీలకు అధిక ధరకు విక్రయించే పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో స్ల్యాగ్‌ ఇసుక తయారీ పట్ల స్టీల్‌ ఉత్పత్తి సంస్థలు ఏ మేరకు ఆసక్తిని కనబరుస్తాయన్నది ఒక ప్రశ్నగా మారింది. ఈ స్ల్యాగ్‌ అందుబాటు ధరలో ఉన్నప్పుడే బిల్డర్లు సైతం దీనిని ఉపయోగించేందుకు ముందకొస్తారని సదస్సు అభిప్రాయపడింది.

నిర్మాణ రంగంలో స్ల్యాగ్‌ వినియోగం సురక్షితమేనని పరీక్షల ద్వారా స్పష్టమైందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని వక్తలన్నారు. స్టీల్‌ ఉత్పత్తిలో భాగంగా ఉపయోగించే మెటీరియల్‌ను సుమారు 1,500 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ట్రీట్‌ చేసుఎ్తన్నందువల్ల ఈ స్థాయి ఉష్ణోగ్రత వద్ద రసాయనాలన్నీ స్తబ్దమై వినియోగానికి అనుగుణంగా స్ల్యాగ్‌ ఉంటుందని నొక్కి చెప్పారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top