You Are Here: Home » చిన్నారి » గ్రహానికి నక్షత్రానికి తేడా ఏమిటి?

గ్రహానికి నక్షత్రానికి తేడా ఏమిటి?

భూమి గ్రహం. సూర్యుడు నక్షత్రం. అయితే నక్షత్రానికి, గ్రహానికి తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం. నక్షత్రం అంటే అనేక వాయువులతో మండే ఒక అగ్నిగోళం. అన్ని నక్షత్రాల్లోనూ హైడ్రోజన్, హీలియం వాయువులు మండు తూ, వెలుగునిస్తూ ఉంటాయి. దానికి కారణం నక్షత్రాల కేంద్రం నుంచి పుట్టే అపరిమితమైన వేడి. కాబట్టి నక్షత్రం స్వయంగా ప్రకాశిస్తుంది. అందుకే వాటిని స్వయంప్రకాశకాలు అంటారు.

నక్షత్రం కంటే చిన్నగా, ఘనరూపంలో ఉండే ఒక గోళం గ్రహం. గ్రహాలు స్వయంప్రకాశకాలు కావు. నక్షత్రాలకు ఉండే వేడి గ్రహాలకు ఉండదు. గ్రహాలకు దగ్గరగా ఉండే నక్షత్రాల వల్ల కొన్ని గ్రహాలు వెలుగుతు న్నట్లు కనిపిస్తాయి. అందుచేత సూర్యుడికి సమీపంలో ఉండే గ్రహాలు వెలుగుతూ కనిపిస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top