You Are Here: Home » చిన్నారి » గోరులో ఏయే భాగాలు ఉంటాయి?

గోరులో ఏయే భాగాలు ఉంటాయి?

‘మన గోరు పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. గోరే అంత చిన్నదైతే, ఇంకా దాంట్లో భాగాలు ఉంటాయా!’ అని ఆశ్చర్యపోకండి. గోరులో నెయిల్ మాట్రిక్స్, నెయిల్ ప్లేట్, లునులా, నెయిల్ బెడ్, నెయిల్ రూట్ మొదలైనవి. గోరు కణాలను ఉత్పత్తి చేసే కణజాలాన్ని నెయిల్ మాట్రిక్స్ అంటారు. ఈ కణజాలం లేకపోతే గోళ్లు అభివృద్ధి చెందవు.

నెయిల్ ప్లేట్ అంటే మనకు కనిపించే గోరు భాగం. మనం గోరు అనేది ఈ భాగాన్నే. లునులా అంటే గోరు మొదట్లో నెలవంక ఆకారంలో తెల్లగా ఉండే భాగం. దీన్ని మూన్ (చందమామ) అని కూడా అంటారు. గోరు కింద ఉండే చర్మాన్ని నెయిల్ బెడ్ అంటారు.గోరు మొదలయ్యే భాగాన్ని నెయిల్‌రూట్ అంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top