You Are Here: Home » ఇతర » గోరంత ‘చిత్రం’

గోరంత ‘చిత్రం’

బాడీ పెయింటింగ్‌ సరే, టాటూ ఇప్పుడు మరింత చొచ్చుకుపోయింది. దానికి తగ్గట్టే నెయిల్‌ ఆర్‌‌ట కూడా రంగులు మారింది. ఇప్పుడు రంగురంగుల బొమ్మల్ని గోళ్ళ మీద వేసుకుని మరింత ముచ్చట పడుతోంది నేటి యువతి. గోళ్లకు ఉంగరాలు, రాళ్లుకంటే గోళ్లపై ఆర్‌‌ట శోభాయమానంగా వుంటుంది. గోళ్ల ఫ్యాషన్‌కు తొలిసారితగా శ్రీకారం చుట్టినది ఆఫ్రికాలోని గిరిజన వాసులే. గోళ్లపై ఆర్‌‌ట గోరింటాకు వేసుకోవడం లాంటిదే. పింక్‌, పర్పుల్‌ రంగులతో వివిధ పుష్పాలను గోళ్లపై అలంకరించుకోవచ్చు. లేక కార్టూన్స్‌ వేసుకోవచ్చు. సందర్భానుసారం నెయిల్‌ ఆర్‌‌టను మార్చుకోవచ్చు.

1fillaబర్‌‌తడే, వెడింగ్‌డే, కల్యాణం, పార్టీ ఇలా పలురకాల సందర్భా లను బట్టి నెయిల్‌ ఆర్‌‌టను ఎంపిక చేసుకోవచ్చు. గోళ్లపై ఆర్‌‌టను ఎవరికి వారే స్వయంగా ఇంటిలో చేసుకోవచ్చు. వివిధ సైజుల బ్రష్‌లు, ఎక్రిలిక్‌ రంగులు, నెయిల్‌ పెయింట్స్‌ కావాలి. ముందుగా మేని క్యూర్‌‌డ గోళ్లపై రెండు వరసల పాలిష్‌ వేయాలి. అభిరుచిని బట్టి రంగులతో డిజైన్‌ వేయాలి. నెయిల్‌ ఆర్‌‌టకి బజారులో ప్రత్యేకంగా పెన్నిళ్లు, పెన్నులూ, లభిస్తాయి. స్టికర్లు, మెరుపులు, కెంపులు, పుష్పాలు ఇలా అభిరుచిని అనుసరించి ఎంపిక చేయాలి.నెయిల్‌ ఆర్‌‌టలో అంతగా రాణించ లేకపోతే రెడీమెడ్‌ డిజైన్లతో నెయిల్స్‌ మార్కెట్‌లో లభిస్తాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. స్పెస్‌ నెయిల్స్‌ అధినేత నీనాబాల్‌ నెయిల్‌ ఆర్‌‌టలో సిద్ధహస్తురాలు.

ఎలక్ట్రిక్‌, యానిమల్‌ ప్రింట్స్‌ నిర్వహిస్తారు. ఫెర్గీ, రిహాన్నా, కర్దార్శియన్‌ నెయిల్‌ ఆర్‌‌టలో ఫేమస్‌. కొందరు బోల్‌‌డ షేడ్స్‌ ఇష్టపడతారు. ఇప్పుడు ట్రెండ్స్‌ మారుతున్నాయి. లైట్‌ బ్లూ, సీగ్రీన్‌, గ్రేమ్‌ కింగ్‌ షేడ్స్‌. కొందరు ఇష్టపడుచున్నారు. ఫ్లోరల్‌ డిజైన్స్‌కు కాలం చెల్లుతుంది. లేడీగాగా, బేవన్స్‌ ఎసిమ్మెట్రిక్‌, జామెట్రిక్‌ డిజైన్లను ఇష్టపడతారు. ఫ్రెంచ్‌ మేనిక్యూర్‌ ఆదరణ పొందింది. యానిమల్‌ ప్రింట్స్‌ జీబ్రా, చిరుత, జిరాఫీలను వారి నఖాలపై చిత్రీకరించుకుం టున్నారు. నఖ సౌందర్యం నేడు సర్వసాధారణమె పోయింది. ముఖ్యంగా పార్టీలకు, ఫంక్షన్లకు నెయిల్‌ ఆర్‌‌టను నగరాలలో ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు వేేయించుకుంటున్నారు. క్రమంగా ఈఅలవాటు మధ్యతరగతి మహిళలకూ అలవడింది. నఖాల ఆరోగ్యానికి నేటి మహిళలు ప్రాధాన్యత నిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top