You Are Here: Home » ఇతర » గోదాలో దిగితే మేమూ యోదులమే

గోదాలో దిగితే మేమూ యోదులమే

కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. పడితే సుమోతోనే తలపడాలి. భారీ శరీరాలతో, ేకజీల బరువుతో ఉండే సుమో యోధులు నిన్నమెున్నటి వరకూ మనం పురుషూల్లోనే చూడగలిగాం. వారు చేసే మల్లయుద్ధం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరుుతే ఏరంగంలోనైనా మేము సిద్ధమే అంటున్న మహిళలు ఈ మల్లయుద్ధ క్రీడలో కూడా దెబ్బకి ప్రత్యర్ధిని మట్టికరిపిస్తూ శెహభాష్‌ అనిపించుకుంటున్నారు. అరుుతే ఈ క్రీడ మన భారతదేశంలో మాత్రం అంత ప్రాచుర్యంలేదు. ఇప్పటి వరకూ ఈ క్రీడమీద మనదేశ క్రీడా రంగంలో కూడా పెద్దగా అభిలాష కూడా లేకపోవడంతో ఇక్కడ దీనికి ఆదరణ కరువరుు్యంది. సాధారణంగా ఇద్దరు తలబడి కొట్టుకోవడం ఒక క్రీడగా మన దేశంలో ఎక్కువగా ఆదరించరు.

sharan-aleader-sumo-and-amaఅయినా నేటి యువతీ, యువకుల్ని ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో ఈ క్రీడని 20వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా ఆ కమిటీవారు ఏర్పాటుచేసారు. అయితే గత సంవత్సరమే ఈ ఎగ్జిబిషన్‌ కమిటీవారు పురుష సుమోల మల్లయుద్ధ ప్రదర్శనని ఇక్కడ పరిచయం చేసినా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 నుండి 14 వరకూ జరిగే ఈ సుమోల క్రీడలో ఈ సారి మహిళా సుమోలకి ప్రాధాన్యతనిచ్చారు. ఇదే మన దేశంలో తొలి మహిళా సుమోల రిజలింగ్‌ ప్రదర్శన. ఇందులో పాల్గొనడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇద్దరు మహిళా సుమో చాంపియన్లు షరన్‌ అలగ్జాండర్‌, యునైటెడ్‌ కింగ్‌డం నుంచీ, అంతర్జాతీయ మహిళా సుమో రిజలర్‌ అమందా విల్‌కాక్స్‌, అస్సాంలోని గౌహతీకి చేరుకున్నారు.

సుమో క్రీడకి మూలం…
జపాన్‌లో భారీ శరీరం కలిగిన మల్లయోధుల్ని సుమోలు అంటారు. జపనీ భాషలో అయితే రిషికీలు అని పిలుస్తారు. జపనీయుల్లో వీరికి ఎంతో జ్‌ ఉన్న కారణంగా నేటికీ ఎంతో ఆదరణ లభిస్తోంది. జపనీయుల పురాణ గాధలో కూడా వీరి ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తుంది. జపాన్‌ ద్వీపాలు నావల్ల పుట్టాయంటే, నావల్లపుట్టాయని ఇద్దరు దేవతలు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. జుచి, నత అనే ఆ ఇద్దరూ, మహాకాయులై ఒకరినొకరు తలపడ్డంతో ఈ క్రీడ పుట్టుకొచ్చి నట్టు ఇప్పటికీ జపనీయుల విశ్వాసం. అందుకే ఈ క్రీడ పట్ల వారికి ఒక ప్రత్యేక అభిమానం. అదే సంప్రదాయంగా మారిం ది. పూర్వకాలంలో పంటలు బాగా పండాలని, అందుకు దేవత ల అనుగ్రహం కావాలన్న నేపధ్యంలో ఉత్సవాలు నిర్వహించే వారు. ఆ ఉత్సవాల్లో ఈ పోటీని నిర్వహించడం జపనీ యుల సంప్రదాయం. క్రీ.శ 8వ శతాబ్ధం నుంచీ ఈ క్రీడ వారికి వాడుకలో ఉంది. ఆ తరువాత17వ శతాబ్ధం వచ్చేనాటికి ఇదో వినోద క్రీడగా మారి, జాతీయ క్రీడగా రూపాంతరం చెంది దీనికంటూ కొన్ని నియమ నిబంధనలు ఏర్పడ్డాయి.

సుమోలు ఎలా తయారవుతారు..
Samantha-Jane2సుమోలుగా మారడం అంత తేలికైన పనికాదు. అందుకు చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాలి. అతి చిన్న వయ సు నుంచే ఈ శిక్షణ ప్రారంభించవలసి ఉంటుంది. ఈ శిక్షణా కేంద్రాల్ని స్టేబుల్స్‌ అని వ్యవహరిస్తారు. ఇందులో శిక్షకులు కూడా రిటైర్‌ అయిన సుమోలే. సుమోగా మారేంతకాలం వారు అక్కడే నివాసం ఉండాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాధన మొదలు పెట్టి, మధ్యాహ్నం వరకూ కరకరా ఆకలి వేసేదేకా శిక్షణలోనే ఉంటారు. ఇక మంచి ఆకలి కడుపుతో ఎంత ఎక్కు వ తినగలిగితే అంత ఎక్కువ తినాలి. అది కూడా నియమం ప్రకారం రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి. ఇక వారు తినే తిండి సామాన్యమానువుడు తినే దానికి సుమారుగా 10 రెట్లు ఉంటుంది. క్రమ క్రమంగా ఆహారాన్ని ఎక్కువగా తినడం అల వాటు చేసుకుంటూ భారీ కాయాన్ని పెంచుకుంటారు. అలా మెల్లమెల్లగా పరిమాణాన్ని పెంచుకుంటూ సుమోలుగా మారు తారు. లావు అవ్వడానికి వీళ్ళకో పద్దతుంది. పొట్ట, పిరుదల దగ్గర ఎక్కువ లావవ్వాల్సి ఉంటుంది . ఎందుకంటే ఆటలో కిందపడకుండా ఈ కొవ్వు ఆపుతుంది. పడినా అది పరుపులా ఉండి శరీరానికి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. తిన్న వెంట నే మూడు నాలుగు గంటలపాటు నిద్ర. ఫలితంగా క్యాలరీలు కరిగిపోకుండా కొవ్వు రూపంలో పేరుకుంటాయి. కండరాలు పెరుగుతాయి. సుమోలు ఎంత బరువుండాలి అన్న నిబంధన ఏమీలేదు. 200 పౌన్ల బరువున్న వారు 400, ఆపై బరువు వారితో కూడా తలబడవచ్చు. ఈ విధంగా సుమోలు తయారవుతారు.

ఇబ్బందులు…
Samantha-Jane-Staceyఇక ఇలా భారీ కాయంతో తయారైన సుమోలకి వారి లావే వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. నిజం చెప్పా లంటే వీరి ఆయుష్షు కేవలం 60 నుండి 65 సంవత్సరాల వర కే. చాలామంది పదవి నుంచి తప్పుకోగానే 4-5 ఏళ్ళలో సామాన్య బరువుకి వచ్చేస్తారు. కానీ వీరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హైబీపీ, షుగర్‌ వంటి అనేక రకాల వ్యాధులు శరీరంలో ప్రవేశించి నరక యాతన అనుభవిస్తూవుంటారు. ఒకోసారి వారు సంపాదించినదంతా పూర్తిగా వైద్యానికి ఖర్చయిపోయి ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఇక ఈ సమస్యల్నించి బయట పడటం అనేది ఊహాతీతంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మహిళా సుమోల గురించి చెప్పుకో వలసివస్తే, మొన్న మనదేశానికి వచ్చిన ఇద్దర్నీ ముందుగా చెప్పుకోవచ్చు. వారి పట్టుదల, కృషి అనితరసాధ్యా లన్నది వాస్త వం. అంతర్జాతీయ చాంపియన్‌ షిప్‌ గెలుచుకుని మహిళా లోకంలో వారికంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న ఈ మహిళా సుమోల కథాకమామిషు ఏమిటో చూస్తే…

షర్రన్‌ అలగ్జాండర్‌
sumo1ఈమె బ్రిటీష్‌ సుమో ఫెడరేషన్‌ వారి గుర్తింపు పొందిన మహిళా సుమోల్లో ఒకరు. అదీకాక ఫెడరేషన్‌లో సెకండ్‌ క్యూ గ్రేడ్‌ సాధించి, నాలుగు బంగారు పథకాలు సొంతం చేసుకున్న యోధురాలు. 2013 గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌‌సలో అత్యంత బరువున్న క్రీడా కారిణిగా స్థానాన్ని దక్కించుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ పోటీల్లో పాల్గొంటున్న మహిళా సుమో ఈ అలగ్జాండర్‌. ఈమె వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది. కానీ, అక్కడి వార్తా కథనాల ప్రకారం 8 సంవత్సరాల క్రితమే ఈమె విడాకులు తీసుకుని, తనని ప్రేమించే వ్యక్తికోసం అన్వేషణలో పడింది. ఈ సుమో రిజలింగ్‌తో ఈమె తిరిగి ధైర్యాన్ని పుంజుకుంది.
వ్యక్తిగత వివరాలు
పుట్టిన తేదీ : 1966
పుట్టిన ఊరు : మైదావాలి, లండన్‌
ఎత్తు : 6 అడుగులు
బరువు : 203.2 కేజీలు
ఆహారం : రోజుకు 5000 కేలరీలు
వ్యాయామం : వాకింగ్‌, స్విమ్మింగ్‌

హెతల్‌ దవే…
sumo2భారత దేశంలో 23ఏళ్ళ వయసున్న హెతల్‌ దవే ఏకైక మహిళా సుమో క్రీడాకారిణి. ఈమె ముంబాయిలో నివాసం ఉంటున్న హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి. ఈమె కుటుంబంలో అందరి ఆడవారి కన్నా భిన్నంగా పెరిగింది. ఈమె తల్లీ, అమ్మమ్మ వారి 20, 23 సంవత్సరాల్లోనే సంప్రదాయబద్ధంగా వివాహాలు చేసుకున్నారు. కానీ, హెతల్‌ మాత్రం ఇంకా పెళ్ళిచేసుకోలేదు. కాలేజీలో చదువుతోంది. ఈమె కుటుంబీకులు పండితులు, విద్యాధికులు, అంతేకానీ యుద్ధవీరులు కాదు. కానీ హెతల్‌ తండ్రి ఈమె 6వ ఏటనే మార్షల్‌ ఆర్ట్‌‌సలో ప్రవీణురాల్ని చేయాలని అందువల్ల శారీరకంగా మానసికంగా ఎంతో బలంగా తయారవుతుందని భావించి జుడో తరగతిలో చేర్పించాడు.
ఇప్పుడు హెతల్‌ 23 ఏళ్ళ క్రీడాకారిణిగా రూపుదా ల్చింది. అయినప్పటికీ సుమో కుస్తీపోటీల వృత్తి క్రీడాకారిణి మాత్రం కాదు. అయినా ఈమె గమనం అటు నడవడం కాకతాళీయం అని చెప్పవచ్చు.
వ్యక్తిగత వివరాలు
పేరు : హెతల్‌ దవే
నివాసం : ముంబాయి
ఎత్తు : 5 అడుగుల 7 అంగుళాలు
బరువు : 165 పౌన్లు
కుటుంబం : హిందూ బ్రాహ్మణ పండితులు, విద్యావేత్తలు
సమంతా జనే స్టస్సీ
ఈమె ఆస్ట్రేలియాకు చెందిన తొలి యువ సుమో క్రీడాకారిణి. వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఆస్ట్రేలియా నుంచి పోటీచేసిన ధీరవనిత. స్టెస్సీకి స్వతసిద్ధంగా చాలా బరువైన శరీరం. అదే ఈమెకి మంచి అవకాశంగా మారింది. కానీ, ఈమె ఊబకాయంగా అనిపించేది కాదు. ఎందుకంటే, మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తూవుండేది. ఈ క్రీడ అప్పుడప్పుడు మగవారిదే అనిపించినా, సుమో ఆడవారికి సరైన క్రీడ ఎందుకంటే, శారీరకంగా, మానసికంగా ఎంతో ఎదుగుదలకు దోహదపడుతుంది అనఇంటుంది స్టెస్సీ. ఈమె కూడా ఒక సుమోకు పుట్టిన యువతి. ఈమె 14వ ఏటకే సుమారుగా 127 కేజీల బరువు ఉండేది. ప్రపంచ సుమో చాంపియన్‌ కుస్తీ పోటీల్లో పాల్గొన్న అతి చిన్న వయసున్న తొలి ఆస్ట్రేలియన్‌ యువతి స్టెస్సీనే. ఆ విధంగా కూడా కొత్త రికార్డ్‌ సృష్టించింది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top