You Are Here: Home » ఇతర » గోదాదేవికి ప్రియ సఖుడు

గోదాదేవికి ప్రియ సఖుడు

అళిమళై క్కణ్ణా! ఒన్ఱు నీకై కరవేల్‌
ఆళియుల్‌ పుక్కు ముగన్దుకొడార్‌త్తేఱి
ఊళి ముదల్వ నురువమ్‌ పోల్‌ మెయ్‌కఱుత్తు
పాళియన్దోళుడై ప్పఱ్పనాబన్‌ కైయిల్‌
అళిపోల్‌ మిన్ని వలమ్బురిపోల్‌ నిన్ఱదిర్‌న్దు
తాళాదే శార్‌ఙ్గ ముదైత్త శరమళై పోల్‌
వాళ వులగినిల్‌ పెయ్‌దిడాయ్‌ నాఙ్గళుమ్‌
మార్‌గళి నీరాడ మగిళ్‌న్దేలో రెమ్బావాయ్‌

tirupaగంభీర స్వభావం కలవాడవై, వర్షము కురియునట్టి ఓ మేఘదైవతమా! నీవు వర్షజలమును అను గ్రహించు దాతృత్వములో ఏ మాత్రం సంకోచము చూప వద్దు. గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి యాకాశము వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగ వంతుని సుందర విశాల దీర్ఘబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెర యుచు, ఎడమచేతి యందలి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శార్ఘ మను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షధారలు లోకమునంతను సుఖింపజే యునట్లును మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లును వర్షింపుము.

అని ఆండాళ్‌ ఈ పాశరము లో ప్రార్ధించుచున్నది. వర్షము లేక పాడిపంటలు శూన్యమైన సమయంలో సస్యసమృద్దికి పుష్కలంగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్దిగా నుండుటకు పెద్దల యనుమతితో ఈ వ్రతము ఆరంభించిరి కావున ఈ విధముగా గోదాదేవి ప్రార్ధించెను.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top