You Are Here: Home » ఇతర » గూగుల్‌ నెక్సస్‌ 10

గూగుల్‌ నెక్సస్‌ 10

nexus గూగుల్‌ ఆండ్రాయిడ్‌ అభిమానులకు శుభవార్త. సామ్‌సంగ్‌ రూపొందించిన గూగుల్‌ బ్రాండెడ్‌ ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌ టాబ్లెట్‌ నెక్సస్‌ 10 ఇప్పుడు ఇండియన్‌ ఆన్‌లైన్‌ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఈబై.ఇన్‌, నెక్సస్‌10. .. 32జీబి వేరియంట్‌ ధరను రూ.47,091గా తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. గూగుల్‌ నెక్సస్‌ 10 స్పెసిఫికేషన్‌లు 10.1 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.7 గిగాహెడ్జ్‌ ఏ15 డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 5 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా, 1.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఇంటర్నల్‌ స్టోరేజ్‌ విషయానికి వస్తే 16,32 జీబీ, బ్లూటూత్‌, వై6ఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్‌ డిఎమ్‌ఐ, డ్యూయల్‌ సైడ్‌ నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌, జీపీఎస్‌ గ్లోనాస్‌ కనెక్టువిటీ ఉన్నాయి.

ఇక మన దేశంలో ఆన్‌లైన్‌ డీల్స్‌ విషయానికి వేస్తే … టాప్‌ 3 ఆన్‌ లైన్‌ రిటైలర్స్‌ ఇలా ఉన్నాయి. ప్రము ఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఇండియాటైమ్స్‌ డాట్‌ కామ్‌ నెక్సస్‌ 10, 16జీబి ఇంకా 32 జీబి వేరియంట్‌లను ఆఫర్‌ చేస్తోం ది. 16జీబి రూ.34,721, 32జీబి 42,861లు (ఫ్రీ షిప్పింగ్‌, నెలసరి వాయిదా చెల్లింపు ఉన్నాయి) ఇక మరో ఆన్‌లైన్‌ సైట్‌ అయిన ట్రేడస్‌ డాట్‌ కామ్‌ 16జీబి వేరియంట్‌ గూగుల్‌ నెక్సస్‌ 10ను రూ.32,800లుగా పేర్కొంది. అలాగే ఆమోజన్స్‌ జంగ్లీ 32జీబి వర్షన్‌ నెక్సస్‌ 10 ట్యాబ్లెట్‌ను రూ.31వేలుగా పేర్కొంది. తక్కిన రిటైలర్లతో పోలిస్తే ఈ ధర మరింత తక్కువ.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top