You Are Here: Home » ఇతర » గూగుల్‌ కంప్యూటర్‌ వచ్చేస్తుంది

గూగుల్‌ కంప్యూటర్‌ వచ్చేస్తుంది

googleసెర్చ్‌ ఇంజన్‌ జెయింట్‌ గూగుల్‌99 నెక్సస్‌ టాబ్లెట్‌ను రూపొందిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. ప్రముఖ టెక్‌ డెైలీ డిగీటైమ్స్‌ ఈ టాబ్లెట్‌ కంప్యూటర్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. సేకరించిన సమాచారం మేరకు ఈ టాబ్లెట్‌ 800 మెగాెహడ్జ్‌ క్లాక్‌ వేగాన్ని కలిగిన సింగిల్‌ కోర్‌ ప్రాసెసర్‌పెై రన్‌ అవుతుంది. ఈ ప్రాసెసర్‌లను చెైనాకు చెందిన వండర్‌ మీడియా టెక్నాలజీస్‌ తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే టాబ్లెట్‌ స్క్రీన్‌ 7 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. తెైవాన్‌కు చెందిన హాన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్‌ ఈ టీఎన్‌ ప్యానళ్లను సమకూర్చినట్లు డిగీ టైమ్స్‌ తెలిపింది.

తెైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్‌ ద్వారా ఈ టాబ్లెట్‌ల ఉత్పత్తి జరగనుంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఈ టాబ్లెట్‌ను అక్టోబర్‌ 29న జరిగే కార్యక్రమంలో గూగుల్‌ ఆవిష్కరించనుంది. గూగుల్‌ తొలి నెక్సస్‌ టాబ్లెట్‌ను ఆసన్‌ ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. 8 జీబి, 16 జీబి వర్షన్‌లలో మాత్రమే ఈ టాబ్లెట్‌ లభ్యమవుతుంది. 32 జీబి వర్షన్‌ను గూగుల్‌ త్వరలో అందుబాటులోకి తేనుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top