You Are Here: Home » ఇతర » ‘గుర్రు’ గా చూడకండి

‘గుర్రు’ గా చూడకండి

చాలా మంది నిద్రలో విపరీతంగా గుర్రు పెడతారు. శ్వాసకోసలోపాల వల్ల ఒక విధమైన శబ్ధం వస్తూ వుంటుంది. దానినే గుర్రు అంటారు. ఒకప్పుడు మిహళల్లో ఈ గుర్రుపెట్టే అలవాటు చాలా తక్కువ మందిలోనే ఉండేది. ఇప్పుడు చాలామందిలో ఇది సర్వసాధారనం అయిపోయింది. అయితే గుర్రు పెట్టేవారికి ఈ సంగతి తెలియదు.

snozingఅలాగే నిద్రలో పలవరించడంలో కూడా మహిళలే ముందుంటున్నారట. వీటన్నిటికీ కారణం మానసి క వత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనా ధోరణే అం టున్నారు పరిశోధకులు. అదీకాక సమయా నుకూలం గా సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం కూడా ఇందుకు మరో ముఖ్యకారణం అంటున్నారు. కార్పొరేట్‌ ఉద్యోగి నుల్లో మరింత ఎక్కువ శాతం ఉంటోందని వీరి సర్వేలో వెల్లడయ్యింది. దీనికి ప్రాధమిక చికిత్సగా రోజూ పడు కునే ముందు గుప్పెడు పచ్చి అటుకులు తింటే, గుర్రు రాకుండా ఉంటుంది. ఎక్కువగా పలవరించేవారు తల గడ కింద పటిక పెట్టుకుని నిద్రపోతే మంచి సుఖ నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు కూడా అంటు న్నారు. గుర్రు పెట్టి ఇతరుల్ని ఇబ్బంది పెట్టే కన్నా ఈ చిట్కాలతో హాయిగా సుఖనిద్రలోకి జారుకోవచ్చు కదా..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top