You Are Here: Home » చిన్నారి » గుర్రాలు కిందపడుకొని ఎందుకు నిద్రపోవు?

గుర్రాలు కిందపడుకొని ఎందుకు నిద్రపోవు?

ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనీ గుర్రాలు నిలబడే నిద్రపోతాయి. ఎప్పుడైనా పగటిపూట కాళ్లకు విశ్రాంతినివ్వటం కోసం మాత్రమే కింద పడుకొని చిన్న కునుకు తీస్తాయి. కానీ రాత్రులు మాత్రం ఖచ్చితంగా నిలబడే నిద్రపోతాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. గుర్రాల శరీర నిర్మాణం అవి కింద పడుకొని వెంటనే లేవటానికి అనుకూలంగా ఉండదు. వాటి వెనుకభాగం తిన్నగా ఉండటం వలన కింది నుంచి త్వరగా లేవలేవు.

పులి, సింహం వంటి జంతువులు గుర్రాలను చంపి తినటానికి వచ్చినప్పుడు గుర్రాలు కనుక కింద పడుకొని ఉంటే తప్పించుకోలేవు. వాటికి ఆహారం అయిపోతాయి. మరోకారణం గుర్రాలకి నిలబడి నిద్రపోవటం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొక కారణం గుర్రాలకు పెద్ద శరీరం ఉండడం మూలంగా ఎక్కువసేపు కింద పడుకొని ఉంటే వాటి శరీరంలోని కింది భాగం ఒత్తిడికి గురవుతుంది. దానివలన అక్కడ ఉండే కణాలు దెబ్బతింటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top