You Are Here: Home » ఇతర » గుడ్ బూట్ గూఫీ – లైఫ్ అంత ఫన్నీ

గుడ్ బూట్ గూఫీ – లైఫ్ అంత ఫన్నీ

సాంకేతిక వివరాలు
Untit69

దర్శకత్వం :  కెవిన్‌ లీమా
నిర్మాత : డాన్‌ రౌండ్స్‌
రచన : జిమ్‌ మాగోన్‌
నటీనటులు : జేసన్‌ మార్స్‌డెన్‌
బిల్‌ ఫార్మర్‌
రాబ్‌ పాల్సన్‌
స్టూడియో : వాల్ట్‌ డిస్నీ
పంపిణి : వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌
విడుదల : 1995

ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే… అప్పట్లో డక్‌టేల్స్‌, డోనాల్డ్‌ డక్‌, మిక్కీ మౌజ్‌, చిప్‌ అండ్‌ డేల్‌, హీ మ్యాన్‌ వంటి యానిమేటెడ్‌ చిత్రాలు నాటి పిల్లలను ఎంతగానో అలరించాయి. నేడు బెన్‌ టెన్‌, డోరేమాన్‌,షిన్‌చాన్‌లు వచ్చినా నాటి కార్టున్స్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఎవర్‌గ్రీన్‌ యానిమేషన్‌ క్యారక్టర్లలో గూఫీ ఒకటి. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న గూఫీ ఎప్పుడు జాలీగా జీవితాన్ని గడపాలనుకుంటాడు. కష్టాలు- నష్టాలు అతనికి అయిష్టాలు. కానీ అతని కుటుంబ సభ్యులకు మాత్రం గూఫీ వల్ల అవి తప్పవు. గూఫీ ఆధారంగా అనేక చిత్రాలు తెరకెక్కి పిల్లలతో పాటు పెద్దలను అలరించాయి. అందులో ‘ అ గూఫీ మూవీ’ మరింత ్రపత్యేం.

Untaకథ : గూఫీ గూఫ్‌ ఒకే ఒక సంతానం 14 ఏళ్ల మాక్స్‌ గూఫ్‌. స్కూల్‌ చదువు పూర్తి కావడంతో మాక్స్‌ స్కూల్‌లో ఫేర్‌వెల్‌ పార్టీ జరుతూ ఉంటుంది. అందులో స్కూల్‌ ప్రిన్సిపల్‌ మాజుర్‌ స్పీచ్‌ ఇస్తుం డగా మాక్స్‌ తన మిత్రులైన పీచర్‌, రాబర్ట్‌ బాబీల సహా యంతో స్టేజ్‌పైకి వెళ్లి ప్రిన్సిపల్‌ స్పీచ్‌ను అడ్డుకుం డాడు. తనకు ఎంతో ఇష్టమైన పాప్‌ సింగర్‌ పవర్‌లైన్‌‌‌ డ్రెస్‌‚ ధరించి పాటలు పాడి ప్రోగ్రామ్‌ను హిట్‌ చేస్తాడు. దీంతో అక్కడున్న పిల్లలు పెద్దలు మాక్స్‌ ఫ్యాన్‌గా మారుతాడు. మాక్స్‌ ఒక సెలబ్రిటీ హోదాను సంపాదిస్తాడు. ఆ కార్యక్రమం జరుగుతున్న సమ యంలో అక్కడున్న రోక్సాన్‌ ( మాక్స్‌ అభిమానించే అమ్మాయి)మాక్స్‌తో లాస్‌ యాంజిలస్‌లో జరగనున్న పవర్‌లైన్‌ లైవ్‌షోకి వెళ్లడానికి సిద్ధం అవుతుంది. అంతలోనే మాక్స్‌ ప్రపర్తన వల్ల ప్రిన్సిపల్‌కు పీక ల్దాకా కోపం వస్తుంది. శిక్ష తప్పదని మాక్స్‌ తండ్రి గూఫీకు కబురంపుతాడు ప్రిన్సిపల్‌.

వద్దు డాడీ..! ఆ విషయం తెలుసుకున్న గూఫీ తన కొడుకుని మార్చాలని నిర్ణయించుకొని ఇదాహో అనే ప్రాంతానికి ఒక టూర్‌ ప్లాన్‌ చేస్తాడు. కానీ మాక్స్‌కు మాత్రం రోక్సాన్‌తో పవర్‌లైన్‌ షోకి వెళ్లాలని ఉంటుంది.టూర్‌ ప్రారంభం కాగానే కార్‌ను రోక్సాన్‌ ఇంటి ముందు ఆపి ఆమెను షోకి వెళ్లడానికి ఆహ్వాని స్తాడు. కానీ వేరే వ్యక్తులతో వెళ్లాల నుకుంటున్నాను అని చెప్పడంతో మాక్స్‌ వెంటనే తను ఎలాగైనా ప్రోగ్రామ్‌కు రానున్నానని చెబుతాడు.కానీ గూఫీ మాత్రం మాక్స్‌కు ఇష్టాన్ని పట్టించుకోకుండా అతన్ని తీసుకుని లాస్‌ యాంజిలస్‌ టూర్‌కు బయల్దేరుతాడు. మాక్స్‌ దిగులుగా ఉండటం భరించలేని గూఫీ తాపీగా ఫిషింగ్‌ చేయడానికి తీసుకెళ్లి చేపలను పట్టడం నేర్పిస్తాడు.

Untiaప్లాన్‌ చేంజ్‌ :నది ఒడ్డునే క్యాంప్‌ వేసుకోవడంతో గూఫీ కాసేపు కాగానే అలసి పోయి పడుకుంటాడు. దీంతో అదే మంచి సమయమని భావించి మాక్స్‌ గూఫీ టూర్‌ మ్యాప్‌ను మార్చేసి కాలిఫోర్నియాకు లింక్‌ పెడ తాడు. ఈ విషయం తన ఫ్రెండ్‌ పీటె ద్వారా తెలుసు కున్న గూఫీ బలవంతంగా మాక్స్‌ను కార్‌లో కూర్చో బెట్టి లాస్‌ యాంజిలస్‌ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇలా కొంత దూరం ప్రయాణించాక ఇదాహో- కాలిఫోర్నియా మార్గాలు విడిపోయే సర్కిల్‌ వస్తుంది. కాలి ఫోర్నియా షోకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించు కున్న మాక్స్‌ తండ్రిని ఎలాగోలా కన్విన్స్‌ చేస్తాడు. కానీ ప్రోగ్రామ్‌కు వెళ్లేదారిలో చిన్న ప్రమాదం జరగడం వల్ల కార్యక్రమానికి లేట్‌గా వెళ్తారు. రోక్సాన్‌ వెళ్లిపో యిందని తెలుసుకున్న మాక్స్‌ .. గూఫీతో ఆమె ఇంటికి వెళ్తాడు. చివరికి రోక్సాన్‌..మాక్స్‌ ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంటుంది. ఇంతలోనే గూఫీ ఇంటి పైభాగం నుంచి జారి పడి వారి ముందు వాలుతాడు. ఇతనే మా డ్యాడి గూఫి. ఈయన కొంచెం నాటీ అని తండ్రిని రోక్సాన్‌కు పరిచయం చేస్తాడు.

– సేకరణ: యం.జి.కిషోర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top