You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » గీతమకరందం

గీతమకరందం

గీతమకరందం

 

మన మత తత్త్వాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక్క భగవద్గీతను చదివితే చాలని అంటారు. ఒక్క గీతలోనే హిందూతత్త్వపు పునాదులన్నీ ఉన్నారుు. శ్రీమద్భగవద్గీత భగవానుడైన శ్రీకృష్ణూని దివ్యవాణి. అనంత మహిమోపేతమైన భగవద్గీతను వర్ణించడానికి సహస్ర ముఖుడైన ఆదిశేషూనికి కూడ సాధ్యం కాదని అంటారు. భగవద్గీత సమస్త వేదాలసారం. పరమ రహస్యవిషయ సమన్వితనిధి. ఇందులోని లక్ష్యం అతి నిగూఢం. ఇందులో భగవంతుని గుణ ప్రభావస్వరూపం చెప్పబడింది. తత్త్వరహస్యాలు, భక్తి కర్మ జ్ఞానాది పలు విధ రహస్య విషయాలను వివరించడం జరిగింది.

Geeta1అందువల్లనే గీత సర్వశాస్త్ర సంశోభితం. భగవద్గీత శ్రీమహావి ష్ణువు యొక్క ముఖ కమలం నుండి వెలువడింది. అందుకే వ్యాసభగవానుడు గీతప్రాశస్త్యాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు.

గీతా సుగీత కర్తవ్యా కిమనై్యః శాస్త్ర సంగ్రహైః
యా స్వయం పద్మ నాభస్య ముఖపద్మాత్‌ వినిఃస్మృత

ప్రతి వ్యక్తి భగవద్గీతను ఆరు విధాలుగా సేవించాలి. అవి శ్రవణం, కీర్తనం, పఠనం, పాఠనం, మననం, ధారణం అనేవి. అలా చేస్తే శ్రీకృష్ణభగవానుని పాదారవిందాలను సేవించినట్లే అవుతుంది.గీత అనే అనంతరత్నాకరంలో ప్రవేశించి, పరిశోధిస్తే అమూల్య మైన జ్ఞాన రత్నాలు లభిస్తాయన్నది నిజం.

తద్వారా సదరు వ్యక్తి అపరిమితమైన జ్ఞానానందాన్ని అనుభవించడానికి వీలవుతుంది. ఈ
సంసారమనే సాగరంలో అజ్ఞానమనే సముద్రంలో మునిగి తేలుతున్న జీవులను ఉద్ధరించి, భగవత్ప్రాప్తి కలిగించగలిగేది ‘గీత’ మాత్రమేనన్నది స్పష్టం. గీతాపఠనం వలన జ్ఞాననిష్ఠ తో, కర్మ నిష్ఠతో ప్రవర్తించి మోక్షసిద్ధిని పొందవచ్చు.

భగవద్గీత అవతరణం…
ఆదిలో కౌరవ పాండవులు సఖ్యభావంతోనే ఉండేవారు. కానీ, కాలక్రమంలో దుర్యోధనుని మనస్సులో అసూయ అనే వేరుపురుగు ప్రవేశించింది. అది క్రమంగా అతని మనస్సును కలుషితం చేసి, వివేకాన్ని నాశనం చేసింది. దీనికి తోడు కర్ణుడు, శకుని వం టివారు అగ్నికి ఆజ్యం పోసినట్లు చేసారు. ఫలితంగా దుర్యోధను డు అనేక వక్రమార్గాల ద్వారా పాండవులను రాజ్యభ్రష్టులను చేయడానికి నిర్ణయించి, మాయా జూదంలో వారిని ఓడించి, ఒక సంవత్సరం అజ్ఞాత వాసాన్ని చేయించాడు. అనంతరం ధర్మ బద్ధంగా వారికి ఇవ్వవలసిన అర్థరాజ్యాన్ని కూడ ఇవ్వకుండా నానా బాధలకు గురి చేసాడు. సంజయుడువంటి వారెందరో చెప్పినప్పటికీ, వాళ్ళ మాటలనన్నింటినీ దుర్యోధనుడు పెడ చెవిన పెట్టాడు. పాండవులకు అర్థ రాజ్యం కాదు గదా, సూదిమొన అం త భూభాగాన్ని కూడ ఇవ్వనని చెప్పాడు. అనంతరం శ్రీకృష్ణరాయ బారం కూడ జరిగింది. కానీ, ఫలితం శూన్యం.

అలా పాండవుల కనీసపు కోరికలను కూడ నిరాకరించిన దుర్యోధను డు కురురాజు, భీష్మ, ద్రోణా దుల హితవాక్యాలను కూడ పెడ చెవిన పెట్టాడు. ఫలి తంగా యుద్ధం అనివార్య మైంది. ఇక, పాండవులు ధర్మయుద్ధానికి సిద్ధమ య్యారు. ధర్మ సంస్థాపనా చార్యుడైన శ్రీకృష్ణుడు పాండ వుల పక్షాన నిలబడ్డాడు. ఇరుప క్షాల వారు యుద్ధానికి సన్నద్ధమ య్యారు. చతురంగబలాలతో రణరంగం లో నిలిచారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో ఉభయ సేనా సమూహాలు బారులుతీరి నిలబడ్డాయి. యుద్ధభేరీలు మిన్నంటాయి.

Geeta2దశదిశల నుండి శంఖనాదాలు ప్రతిధ్వనించాయి. యోధులు తమ తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో పార్థుని కోరి కననుసరించి శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఉభయ సైన్యాల నడుమకు తీసుకెళ్ళి నిలబెట్టాడు. అర్జునుడు సైన్యంలో వీరు లను తేరిపార చూసాడు. అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, గురువులు, హితులు, సన్నిహితులు, మిత్రులు, మొదలైనవారంతా ఎదురుగా ఉన్నారు. వారిని చూడగానే అతని హృదయం చలించింది. ‘యుద్ధంలో స్వజనులను ఎలా సంహరించడం బంధువులను, గురువులను, స్నేహితులను వధించి, జయించిన రాజ్యాన్ని ఏలుకోవడం కంటే బిచ్చ మెత్తుకోవడం మేలు కదా!’ అని రకరకాలుగా ఆలచించి తన గాండీవాన్ని చేతిలో నుండి వదిలేసాడు. చివరకు ఏమి చేయడమో తెలియక శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించాడు.

‘ఓ కృష్ణా! నా మన సంతా కల్లోలిత సాగరంలా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. నిన్ను శరణు కోరుతున్నాను. నా కర్తవ్య మేమిటో చెప్పి, నన్ను రక్షించు’.

ఆ మరుక్షణమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశాన్ని చేసి, పాండవుల మధ్యముని అంతరంగంలో నెలకొనివున్న అహంకారాన్ని, మోహాన్ని, అధైర్యాన్ని, విషాదాన్ని తొలగించి యుద్ధోన్ముఖుని చేసాడు. ఈ విధంగా భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ముఖకమలం నుండి ఆవిర్భవించింది. అది సమస్త మానవాళికి మహాప్రసాదమై మోక్షాన్ని అనుగ్రహించే దివ్య జ్ఞానజ్యోతియై ఉంది. దానిని వ్యాస భగవానుడు 701 శ్లోకా లతో, 18 అధ్యాయాలుగా మానవాళికి అందించాడు. మనకు ఎంతో ఉపకారాన్ని చేశాడు. భగవంతుని బోధనలను చదివి ఆకళింపు చేసుకునే అపూర్వమయిన అవకాశం మనకు లభించింది.

గీతాగృహం
భగవద్గీత ఒక ఇంటితో సమానం. గీత తన యొక్క పరమ పవిత్ర మందిరమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అలా చూసినప్పుడు మూడంతస్తులతో కూడిన ఆ ‘గీత’ భవనంలో, మొదటి అంతస్తులో 1వ అధ్యాయం నుండి 6 అధ్యాయం వరకు ఉన్నాయి. (అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞానయోగం, కర్మసన్య్నాస యోగం, ఆత్మ సంయమన యోగం) ఈ ఆరు అధ్యాయాలను కర్మ షట్నం అని అంటారు.

రెండవ అంతస్తు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నాయి. (విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం). ఈ ఆరు అధ్యాయాలను భక్తిషట్కము అని అంటారు.

మూడవ అంతస్తులో 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యా యం వరకు ఉన్నాయి. (క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణ త్రయ విభాగ యోగం, పురుషోత్తమప్రాప్తి యోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్షస న్యాస యోగం). ఈ ఆరు అధ్యాయాలు జ్ఞానషట్కం.

Geetaఈ గీతాభవనం సువిశాలమైన, అత్యంత సుందరమై విరాజి ల్లుతుంటుంది. అందులో అమూల్యమైన వస్తు సముదా యా లుంటాయి. అవి ఎవరికైనా అనుభవయోగ్యాలే. అందు లో ఎవరైనా ప్రవేశించి అనుభవించవచ్చు. ఆ భవన ద్వారం అన్ని వేళల్లో తెరచే ఉంటుంది. ఎవరికైనప్పటికీ స్వాగతం పలుకు తుంటుంది. వయో నిబంధనం లేదు. ప్రవేశరుసుము లేదు. అందులోని గీతామకరందాన్ని గ్రోలడానికి అందరూ అర్హులే. అందులోని మధురామృతం ఎంత గ్రోలినా తరగనిది. కాబట్టి అందరూ ఆ భవనాన్ని దర్శించి, అందులో ప్రవేశించి, అందు లోని ఆనందాన్ని అనుభవించి ధన్యులై, శ్రీకృష్ణభగవానుని అనుగ్రహాన్ని పొంది జీవితాలను ధన్యం చేసుకోవచ్చు.

వ్యాసమునీంద్రుని అనుగ్రహం వల్ల గీతాబోధనము సంజ యుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. తాను విన్నది విన్నట్లుగానే సంజయుడు లోకానికి అందించాడు. ఇంకా అర్జునుడు, వ్యా సుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఉన్న ఆంజనేయుడు. శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేస్తుండగా విన్నారు. ఇది ద్వాపర యుగాంతంలో, కలియుగ ప్రారంభానికి ముందు సు మారు 38 సంవత్సరాల ముందు జరిగింది. ప్రపంచంలోని గ్రంథాలన్నీ మానవమాత్రులచే వెలువరించబడగా, ఒక్క ‘గీత’ మాత్రమే భగవంతుని ముఖతః వెలువడింది.

ఇక, గంగ శ్రీమహావిష్ణువు పాదపద్మల నుండి ఉద్భవించింది. ‘గీత’ అనే గంగ భగవానుని ముఖ కమలం నుండి వెలువడింది.

గంగలో మునిగినవారి పాంచభౌతిక దేహం మాత్రం ఆ పవిత్ర జలాలలో మునిగిపోతోంది. జ్ఞాన గంగయైన గీతలో మునిగినవారు పరమాత్ముని వలన ఉద్ధరింపబడి మోక్షార్హు లవుతున్నారు.

ఈ సందర్భంగా మహత్తర భగవత్‌ గీతను మనమంతా ప్రార్థించుకుందాం.
భగవంతునిచే స్వయంగా బోధింపబడి, వేదవ్యాస మహర్షు లచే మహాభారత మధ్యలో చేర్చబడి, అదె్వైత జ్ఞానమనే అమృత వర్షాన్ని వర్షిస్తూ, పద్దెనిమిది అధ్యాయాలతో, సమస్త సంసార బంధాల నుండి విముక్తిని కలిగించే ఓ జననీ, భగవద్గీతా! నిన్ను నేను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించగలవు. నా జీవితాన్ని ధన్యం చేసి ఆ మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయగలవు.

‘గీత’కు ‘మకరందం’తోనే ఎందుకు పోలిక?!
భగవద్గీత తేనెవలె సుమధురంగా ఉంటుంది కాబట్టి. దానిని ‘మకరందము’ అని అన్నారు. తేనెకు రోగనిరోధక శక్తి అధికమని అంటారు. అందుకే దానిని మందులలో ఎక్కువగ వాడుతుంటారు. అలాగే ‘గీత’ అనే మకరందాన్ని సేవించిన వారికి భవరోగమనే సంసారబాధ సంపూర్ణంగా తొలగిపోతుంది. తేనెటీగ పువ్వుల నుండి తేనెను సేకరించినట్లుగా, శ్రీకృష్ణపరమాత్మ ఉపనిషత్తులనే పువ్వుల నుండి ‘గీత’ అనే తేనెను బయటకు తీసి లోకానికి అందించాడు. అందుకే భగవద్గీతకు తేనెతో పోలిక!

మనిషి తలరాతను గురించి చెప్పేటప్పుడు… ‘గీత’ బాగుంటే ‘రాత’ బాగుంటుందని అంటుంటారు. అది బ్రహ్మ రాసే రాతకు సంకేతం. ఈ గీతే కాకుండా మన బతుకులలో మార్పు తెచ్చే మరో గీత కూడ ఉంది. అదే ‘భగవద్గీత’.

భగవద్గీత – 18 సంఖ్య

‘గీత’లోరి 18 పర్వాలను మానవ జీవితంలోని 18 దశలకు సంకేతాలు.
భగవద్గీతలోని అధ్యాయాలు		 18
మహాభారత పర్వాలు			 18
మహాభారత యుద్ధం జరిగిన రోజుల సంఖ్య	 18
భారత యుద్ధంలోని సైనిక సంఖ్య		 18 
(అక్షౌపిణులు)
అక్షౌపిణి వివరాలు...
గజబలం	21870 = 2+1+8+7+0 = 	 18
రథబలం	21870 = 2+1+8+7+0 = 	 18
అశ్వబలం	65610 = 6+5+6+1+0 = 	 18
కాల్బలము	109350 = 1+0+9+3+5+0 =   18
మోక్షసాధనకు సోపానాలు		 18
దృశ్యం 		- 1
దేహం		- 1
పంచజ్ఞానేంద్రియాలు	- 5
పంచకర్మేంద్రియాలు	- 5
పంచప్రాణాలు	- 5
అంతఃకరణం	- 1
		 18
దుర్గాదేవిమాత భుజాలు		 18
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top