You Are Here: Home » ఇతర » గిన్నిస్‌ రికార్డుల దినాజ్‌

గిన్నిస్‌ రికార్డుల దినాజ్‌

s33aగిన్నిస్‌ రికార్డులకు భాగ్యనగరం వేదికగా మారు తోంది. ప్రముఖ ఫిట్‌నెస్‌ శిక్షకురాలు దినాజ్‌ వెర్వత్‌వాలా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకు న్నారు. హైద రాబాద్‌లో ఒకేరోజు రెండు గిన్నిస్‌ రికార్డులు నమోదయ్యాయి. దినాజ్‌ నేతృత్వంలో ఈ రెండు రికార్డులు మన రాష్ట్రానికి లభించాయి. ఇప్పటికే మెక్సికో పేరిట ఉన్న జుంబర్‌ క్లాస్‌, బాలీ వుడ్‌ క్లాస్‌ రికార్డులపెై గురి పెట్టిన దినాజ్‌ బృందం ఈ రికార్డులను అవలీలగా అధిగమించింది. గతంలో మెక్సికోలో 3వేల876మంది ఒకేసారి జుంబా క్లాస్‌ నృత్యం చేశారు. ఈ రికార్డును 11వేలమందితో దినాజ్‌ బృందం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో 30 నిముషాల పాటు నిర్వహించి బ్రేక్‌ చేసింది. ఫ్లోరిడాకు చెందిన జుంబా నృత్యాన్ని తిలకించేందుకు ఆ దేశానికి చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు.

బాలీవుడ్‌ క్లాసిక్‌ నృత్యాన్ని 4,500మందితో గతం లో నిర్వహించిన రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికా ర్డును సైతం 11వేలకు పెైగా వచ్చిన నృత్యకారులతో 16 నిముషాల పాటు నిర్వహించి బ్రేక్‌ చేసినట్లు దినాజ్‌ తెలిపారు. ఈ రికార్డు విన్యాసాన్ని గుర్తిం చేందుకు గిన్నిస్‌ ప్రతినిధులు వచ్చినట్లు చెప్పారు. నృత్యం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్ధులు, వెైద్యులు, వ్యాపారవేత్తలతోపాటు వివిధ రంగా లకు చెందిన ప్రముఖులు ఈ రికార్డు నృత్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. కిమ్స్‌ హాస్పి టల్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ సీడ్స్‌, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌, గోల్కొండ హోటల్స్‌ ఈ ప్రయత్నానికి సహకారాన్ని అందించాయి.

వరల్డ్‌ ‘గిన్నిస్‌’ రికార్డు కోసం ఏరోబిక్స్‌…
ప్రముఖ ఏరోబిక్స్‌ నిపుణురాలు దినాజ్‌ మరో రికా ర్డును తన ఖాతాలో వేసుకుకున్నారు. ఇప్పటికే 24 గంటలు ఏరోబిక్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించిన దినాజ్‌.. 1600 మంది చిన్నారులతో మూడు నిమి షాల్లో రెండు రికార్డులను సొంతం చేసుకున్నారు. జంప్‌ జాక్‌, స్టార్‌ స్వ్వాట్స్‌ నృత్యా లతో రికార్డులు నెలకొల్పారు. ఏరోబిక్‌ నృత్యంలో భారత్‌ను ప్రపం చంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తన లక్ష్యమని దినాజ్‌ వివరించారు. నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ప్లాజాలో సెప్టెంబర్‌ 15న వరల్డ్‌‌స లార్జెస్ట్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ క్లాస్‌ను నిర్వహించి గిన్నిస్‌రికార్డు సొంతం చేసుకున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top