You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » గాయక మౌలి నాగరాజప్రసాద్‌

గాయక మౌలి నాగరాజప్రసాద్‌

గాయక మౌలి నాగరాజప్రసాద్‌

 

ఎంతో ఆదరణ పొందుతూ బుల్లితెర ప్రేక్షకులనందరినీ కట్టిపడేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తీర్చిదిద్దిన ‘పాడుతా తీయగా’ ఎందరో అజ్ఞాత గాయకులను తెలుగు తెరకు పరిచయం చేసింది. వాళ్లలో మరుగున పడివున్న టాలెంట్‌ను వెలికితీరుుంచింది ఆ ప్రోగ్రావ్గు. ఇటీవల చిన్నారులతో నిర్వహించిన పోటీ కూడా రసజ్ఞులైన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో టైటిల్‌ విన్నర్‌గా ఫైనల్‌ రౌండ్గలో గెలిచి నిలిచిన సారుురమ్య, అంతకు ముందు నిర్వహించిన పోటీలో టైటిల్‌ విజేతగా నిలిచిన లక్ష్మీమేఘనలను టీవీ వీక్షకులు మర్చిపోలేరు. వారి గాన పారవశ్యానికి పరవశించనివారు ఉండరు. మరి ఇలాంటి టైటిల్‌ విన్నర్స్‌ని తీర్చిదిద్దే గురువు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరు చిన్నారుల అజరామర కృషి వెనక వారిని తీర్చిదిద్దిన గురుతుల్యులు గాయకమౌళి నాగరాజ ప్రసాద్‌ గురించి తెలుసుకుందామా…
nagarajaఆయన వృత్తి భారతీయ స్టేట్‌బ్యాంకులో బ్రాంచ్‌ మేనేజర్‌గా చేస్తూ ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని తనకు ఇష్టమైన సంగీత కళామతల్లి సేవలో అనునిత్యం పునీతులవుతున్నారు…ఆయనే గానగంధర్వ నాగరాజ ప్రసాద్‌. నేడు ఎందరో ఔత్సాహిక గాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలబడి వారి ఔన్నత్యానికి తోడ్పడుతున్నారు. తన జీవితం మొత్తం సంగీత సాగరంలోనే మునిగి తేలాలని సంసార బంధాన్ని కూడా దూరం చేసుకున్నారు. పుట్టింది బెంగళూరులోనే అయినా పెరిగిందంతా ఆదోని. తండ్రి రాజారామారావు, తల్లి సుశీలాభాయి ఒక అక్క ఉండేవారు. తండ్రి రేడియాలజిస్ట్‌గా పనిచేస్తుండేవారు. తల్లి సుశీలాభాయి కర్ణాటక సంగీత విద్వాంసురాలు.

తన తల్లే తనకు తొలి గురువు అంటారు నాగరాజ ప్రసాద్‌. చిన్నతనంలో తన అక్కయ్య సంగీతం నేర్చుకునేటప్పుడే తాను కూడా సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న నాగరాజుప్రసాద్‌ తన తల్లి వద్దే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 11 సంవత్సరాల వయసులో తొలిసారి ఒక షష్టిపూర్తి మహోత్సవంలో జరిపించే కార్యక్రమాలలో ఏర్పాటు చేసిన స్టేజ్‌ షోలో తన గళం వినిపించారు నాగరాజ ప్రసాద్‌. ఒకసారి కడప ఆల్‌ఇండియా రేడియోలో ప్రసాద్‌ పాటలు విన్న ప్రముఖ సంగీత విద్వాంసుడు…వైలనిస్ట్‌ కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మ స్వయంగా నాగరాజ ప్రసాద్‌కి సంగీతం నేర్పించడానికి పూనుకున్నారు. అది తన జీవితంలో ఎంతో అదృష్టంగా భావించానంటారు. 1975 సంవత్సరంలో ఎస్‌.బి.ఐ.లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగరీత్యా ఏ ప్రాంతానికి వెళ్లినా రెండుపూట్లా సంగీత సాధన మాత్రం చేస్తునే ఉండేవారు.

nagaraja1
బ్యాంకు తరపున జరిగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో తాను సొంతంగా రాసుకుని కంపోజ్‌ చేసిన పాటలను వినిపించడం ఆయనకు అలవాటు. కొంతకాలం పాటు బ్యాంకు ఉన్నతాధికారిగా ఉద్యోగం చేసినా సంతృప్తి చెందక ఇంకా సంగీతం నేర్చుకోవాలనే తపనతో చెనై్న వెళ్లి అక్కడ ప్రముఖ వైలనిస్ట్‌ ఎం.ఏ.సుందరేశ్వరన్‌ వద్ద సంగీత సాధన చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి తన తల్లి సి.ఆర్‌.సుశీలాదేవి పేరిట మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ కళాశాలను స్థాపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో ఒక సదాశయంతో స్థాపించిన ఈ కళాశాల అనతికాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది.

తన జీవితాశయానికి సహకరిస్తూ అక్కయ్య జయశ్రీ తనకు కొండంత అండగా నిలబడి సహాయసహకారాలు అందజేస్తున్నారంటారు నాగరాజ ప్రసాద్‌. ఎంకాం సాహిత్యరత్న చేసిన జయశ్రీ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతిగారి రచనలను అనువాదం చేసి పుస్తకరూపంలో అందించారు ఆమె. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషలలో రచనలు చేసి మంచి రచయితగా పేరుగాంచారు ఆమె. ఒక మంచి ఆశయం కోసం తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఎటువంటి లాభాపేఓ లేకుండా ఈనాటికీ ఆయన సంగీత సమరం చేస్తునే ఉన్నారు. 2006లో హైదరాబాద్‌కు వచ్చి సుస్వర మ్యూజిక్‌ అకాడమీ స్థాపించారు.

nagaraja2ఇప్పటిదాకా రేడియో…వివిధ మీడియాలలో సంగీత దర్శకునిగా, గాయకునిగా, కర్ణాటక సంగీతం పాడుతూ అసంఖ్యాక లలిత సంగీత గీతాలకు బాణీలు సమకూర్చారు. ఇప్పటిదాకా 500కు పైచిలుకు ప్రదర్శనలు చేశారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన సుస్వర మ్యూజిక్‌ అకాడమీలో శిష్యులుగా ఉన్న ఎందరో విద్యార్థులు వివిధ టివి ఛానల్స్‌ నిర్వహించే సంగీత పోటీలలో విజేతలుగా నిలబడి తమ గురువుగారి పేరు ఇనుమడింపజేస్తున్నారు. 1995 సంవత్సరం నుండి ‘పాడతా తీయగా’ కార్యక్రమంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం చెబుతున్న విషయాలను, విశేషాలను, పిల్లలకు చెబుతున్న మెలకువలను, ఉచ్ఛారణ లోపాలను జాగ్రత్తగా గమనిస్తూ ప్రత్యేకంగా ఒక నోడ్స్‌ కూడా తయారుచేసుకుంటున్నానంటారు నాగరాజప్రసాద్‌.

సంగీతరంగం కోసం తన జీవితాన్ని అంకితం చేసి వివాహం కూడా చేసుకోకుండా శ్రీమన్నారాయణ అనే తన అత్యంత సన్నిహితుడైన స్టూడెంట్‌ని తన కుమారుడిగా భావించి తనవద్ద చేరదీసి ఆయనతోనే ఉంచుకుంటున్నారు. శ్రీమన్నారాయణ కూడా నాగరాజప్రసాద్‌ ఆశయాలకు అనుగుణంగా తన విధి నిర్వహణ సాగిస్తూ చిన్నారులకు తన సంగీత సాధన ద్వారా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. కేవలం సంగీతాన్ని కమర్షియల్‌ గా నేర్చుకోవడానికి ఒక వారంలోనో లేక నెలరోజుల వ్యవధిలోనో నేర్చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికో లేక పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకోవడానికో అయితే అటువంటి సాధనలో జీవం ఉండదంటారు నాగరాజప్రసాద్‌.

పవిత్రమైన సంగీత సాధన కార్యక్రమాన్ని అంతే క్రమశిక్షణతో, పట్టుదలతో ఆరాధనా భావంతో కఠోరసాధన చేయాలి. అందుకు నేటి తరం వారికి వారి తల్లిదండ్రులు కూడా తగినవిధంగా ప్రోత్సాహం అందజేయాలి అంటారు నాగరాజప్రసాద్‌. ఆయన ఆశయాలు ఫలించాలని ఆ దేవుని మనసారా కోరుకుందాం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top