You Are Here: Home » ఇతర » ‘గాడి’ద జలపాతం

‘గాడి’ద జలపాతం

గోదావరి నదికి అవతలి జిల్లా అదిలాబాద్‌, ఇవతలి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రాష్ర్టంలోనే అందమైన అడవులున్నారుు. గోదావరి లోయలో ఉన్న అడవులను తెలంగాణా గ్రీన్‌ వ్యాలీ అంటారు. ఈ గ్రీన్‌ వ్యాలీ అందం అదిలాబాద్‌ జిల్లాలో మరీ ఎక్కువ. అలాంటి అరుదైన, అందమైన అడవుల్లో మరింత అందమైన, అత్యంత ఎతైన జలపాతం ఉందని ఆ ప్రాంతం లోని ఒక్కరికి కూడా తెలియకపోవడం దురదృష్టకరం. అది తెలుసుకుందామనే నేను, నా మిుత్రలు బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌, దేవేందర్‌ త్రిపాఠి కలిసి అక్కడికి వెళ్ళాము.

అలసట కలగకుండానే, ఏ ప్రయత్నమూ చేయకుండానే ఎంతో అద్భుతమైన దృశ్యం కనిపించినా మనకు అంత ఆనందం అనిపించదు. అదే దాని అందాన్ని మనం వెతికి పట్టుకునే ప్రయత్నం కొంత చేసి సఫలీకృతమైనప్పుడు కలిగే ఆనందం ఒక మధుర సృతి అవుతుంది. మాకు ఈ గ్రీన్‌ వ్యాలీలోని ‘గాడి’ద గుండాన్ని చేరుకుని చూసినప్పుడు మిగిలింది ఈ మధర సృతి. అంటే గాడిద గుండం దర్శనం ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్నిచ్చి అదొక మధురస్మృతిగా మిగిలేందుకు దోహదం చేసింది.

గ్రీన్‌ వ్యాలీలో ట్రెక్కింగ్‌
gaaDaహైదరాబాద్‌ నుండి నిర్మల్‌, నేరేడిగొండ, తర్నం లేదా దేవల్‌నాయక్‌ తండల మీదుగా ప్రయాణిస్తే 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గాడిదగుండం జలపాతం. దీన్ని చేరడానికి పచ్చని అడవులు, గుట్టలు, లోయల్లో మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కడెంనది ఒక్కోసారి వరద ఎక్కువై దాటనివ్వదు. మాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకని మేము దేవల్‌ నాయక్‌తండా దాటి, సమీప గ్రామస్థుడు కిషన్‌ను తీసుకుని ఈ జలపాతం దగ్గరికి వెళ్ళాం. ఐతే ఇక్కడికి నిర్మల్‌, ఇచ్చోడ, సిరిచెల్మ, పట్టణం, గుండిబాగ్‌ల మీదుగా వాహనంలో కూడా రావ చ్చునట. ఈ ప్రాంతంలో మరాఠీలు, లంబాడీలు, గోండులు, ఆంధ్‌లు, ముస్లింలు మ్త్రామే కాకుండా గిరిజనేతరులు కూడా ఉన్నారు.

అంటే ఈ ప్రాంతంలో విభిన్న జాతుల సమ్మేళనాన్ని, వైవిధ్య సంస్కృతులను…భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడవచ్చు. కొందరు ఈ జలపాతాన్ని ముక్కిడి గుండం అని పిలిస్తే, మరి కొందరు గాడిద జలపాతం అంటారు. నిజానికి స్థానిక ప్రజలు ఈ జలపాతానికి మొక్కుతారు. అందుకే దీన్ని ‘మొక్కుడు గుండం’ అని, ఇది ‘గాడి’లో నుంచి దుముకుతుంది కాబట్టి ‘గాడి’ద గుండం అని పేర్లు వచ్చాయి.

పర్యాటకులు ఈ ప్రాంతీయులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు మధ్య నుండి నడచిపోవాల్సి ఉంటుంది. మన చుట్టూ ఎత్తు పల్లాల్లో గుట్టలు, చెట్ల మధ్య అటవీ ప్రదేశాన్ని చదును చేసు కుంటూ వివిధ రకాల మెట్ట పంటలను సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులు కనిపిస్తారు. సౌంద ర్యమే కాకుండా పచ్చని లోయల్లోని నల్లని నేలల్లో పరుచుకున్న పచ్చని పైరుల సోయగాలను కూడా చూడొచ్చు.

అక్కడక్కడా గుట్టబోర్లు, ఎతైన గుట్టలు, అడవులు, లోతైన లోయలు, ఇరు కైన దారి, ఎడ్లబళ్ళ చక్రాల గాడులు, పచ్చని చెట్ల మధ్య చిన్న, చిన్న కుంటలు, వాటి నీటిని తాగడానికి వచ్చిన జంతువుల కాళ్ళ డెక్కల గుర్తులు, జల జలా పారుతూ మనకు అడ్డంగా వచ్చే ఏరులు, పచ్చిక బయళ్ళు మేస్తున్న పశువులు, వాటిని కాపలా కాసే గోండులు, ఆంధ్‌లు, అటవీ మార్గంలో ఎలుగుబంట్లు, అడవిపందులు ఎదురవుతాయేమోనన్న భయం. వీటిల్లో ప్రతి ఒక్కటీ మన మనోఫలకంపై ముద్రించుకుపోయే మధుర స్మృతులను మిగుల్చుతాయి.

ఎతైన, లోతైన జలపాతం
గాడిదగుండం జలపాతం పరిసరాలే మనల్ని పరవశానికి గురిచేస్తాయి. చుట్టూ గిరిగీసినట్లుండే ఎతైన పచ్చని కొండల మధ్య వంపు తిరిగిన వ్యాసంలా ఒక వాగు ప్రవహిస్తుంది. అదీ ఒక ఇరుకైన గాడిలో. చిక్కని ఎతైన చెట్ల మధ్యలో, గుండిబాగ్‌ అనే అంధలగూడెం సరిహద్దుల్లో పచ్చని చెట్ల మధ్య నుండి తెల్లని వాగు వడివడిగా ప్రవహిస్తుండటం చూసి పరవశించిపోతాం. అంత కంటే పరవశించే దృశ్యం అల్లంత దూరంలోనే కనిపిస్తుంది. అదే అసలైన అందమైన జలపాతం. అలాగని దాని అందం అంత సులభంగా కనిపించదు. వినిపిస్తుంది. 200 అడుగల ఎత్తు నుండి దూకే శబ్దం. ఇది మనరాష్ర్టంలోనే ఎతైన జలపాతాల్లో ఒకటి.

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమవుతుంది . తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన ఆసక్తికరమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపిం చింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం.

సుందరమైన లోయ
jalapaaaగాడిదగుండం జలపాతం ప్రాంత దృశ్యం కాశ్శీర్‌ లోయను మరిపిస్తుంది. ఈ జలపాతం చుట్టూ 500 అడుగుల ఎతైన కొనదేలిన కొండల వరుసలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ముసురుకు న్నాయి. ఈ కొండల మధ్య తూర్పు సగభాగం ఎతైన పీఠ భూమి, పశ్చిమ సగభాగం ఏటవాలు లోయ. ఎంతో అందంగా కనిపిస్తుంది. పీఠభూమిని ఈశా న్యం కొండల మధ్య సన్నని చీలక నుండి, దక్షిణపు కొండల గుండిబాగ్‌ ఏటవాళ్ల నుండి చేరుకో వాలి. లోయనైతే పశ్చిమపు కొండలు (మాదా రం) దిగి చేరుకోవాలి. వర్షాలు ఉధృతంగా లేన ప్పుడు కడెం నది మనల్ని దాటనిస్తుంది.

అప్పుడు ఈ లోయ లోని తర్నం, దేవల్‌నాయక్‌తండా పొలి మేరల నుండి కాలినడకన చేరుకోవచ్చు. ఇలా వచ్చిన ప్పుడు జలపాతం కింద ఉన్న లోయ లోకి చేరుకుంటాం. జలపాతం ఎత్తు, అందాన్ని సంపూర్ణంగా చూసి ఆనందిచవచ్చు. పీఠభూమిపై నుండి వస్తే దాని ఎత్తు సగమే కనిపిస్తుంది. 500 అడుగుల ఎత్తున్న పచ్చని కొండల మధ్య ప్రవహిస్తూ, 200ల అడుగుల ఎత్తు నుండి తూర్పు నుండి పశ్చిమం వైపు దూకుతూ, 100 అడుగుల ఎతైన నల్లని రాళ్ల మధ్య కనుమరగయిన తెల్లని జలపాతం మళ్ళీ ఉత్తర వాయువ్యంలో కొండ అడ్డు రావడంతో వంపు తిరిగి పశ్చిమం మీదుగా నైరుతి వైపు అర్థచంద్రాకారంలో నీలిమేఘాలను ప్రతిఫలిస్తూ ఒయ్యారంగా సోయగాలు పోతు ప్రవహించే దృశ్యాన్ని ప్రతిఒక్కరూ చూసి తరించాల్సిందే.

మాదారం నుంచి గాని, తర్నందేవల్‌ నాయక్‌ తండా మీది నుంచి గానీ వచ్చేవారు జలపాతం కిందుగా పారే వాగు ప్రవాహం వెంట సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పచ్చని చెట్ల మీద చేస్తున్న పక్షుల కిలకిల రావాలను వింటూ నడక సాగిచడం మన జీవితంలో మరిచిపోలేని మధురానిభూతిని మిగులుస్తుంది. ఇక్కడ రోప్‌వే నిర్మిస్తే ఇదొక అద్భుతమైన ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ కాగలదు. జాతీయ రహదారి నెం.44కు దగ్గరగా ఉండటం వల్ల పర్యాటకులతో కిటకిటలాడే అవకాశమూ ఉంది.

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమ వుతుంది. తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం.

డా. ద్యావనపల్లి సత్యనారాయణ, 9440687250

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top