You Are Here: Home » ఇతర » గాంధీ ఓ జ్ఞాపకం ‘మోహనదాసు’డి మనోతరంగం

గాంధీ ఓ జ్ఞాపకం ‘మోహనదాసు’డి మనోతరంగం

సత్యం, అహింసలు గాంధీ కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన పూజా సామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ప్రజలు గుర్తించారు. కొల్లారుు గట్టి, చేత కర్రపట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సాధించిన అగ్రగణ్యుడు. భరతమాత తల రాతను మార్చిన విధాత గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలు మీ కోసం.

అహింస ఆచరణ…
బైబిల్‌లోని ‘‘సెర్మన్‌ ఆన్‌ ద మౌంట్‌’’ గాంధీని బాగా ఆకట్టుకుంది. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమని, అందర్నీ ప్రేమించాలని, తోటివారికి ఉపకారం చెయ్యాలన్న క్రీస్తు బోధనలు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహమ్మద్‌ ప్రవక్త జీవితంపై కూడా అధ్యయనం చేశారు. ప్రవక్తలోని ధైర్యం, గొప్పదనం, నిరాడంబరత గాంధీకి నచ్చాయి. యువగాంధీకి అన్ని మతాల సారాన్ని ఆచరణలోకి తేవాలన్న కోర్కె బలపడింది.

జర్నలిస్టుగా…
1901లో మొదటిసారి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గాంధీ భారతదేశాన్ని సందర్శిం చారు. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సభలకు హాజరయ్యారు. 1904లో ‘‘ఇండియన్‌ ఒపీనియన్‌’’ పత్రిక బాధ్యతను స్వీకరించి తమ ఉద్యమం కోసం దాన్ని మలుచుకున్న గాంధీ భారతీయుల పోరాట విధానానికి మంచి పేరు చూచించమని పాఠకులను కోరుతూ ప్రకటన చేశారు. గాంధీ బంధువు ‘‘సదాగ్రహ’’ అనే పేరు సూచించారు. గాంధీ దాన్ని కొద్దిగా మార్పు చేసి ‘‘సత్యాగ్రహం’’ అని నామకరణం చేశారు.

అరుదైన ప్రసంగం రికార్డింగ్‌
1deజాతిపిత మహాత్మాగాంధీ ఇంగ్లీషూలో మాట్లాడిన అరుదైన ప్రసంగం రికార్డు వాషింగ్టన్‌ డిసిలో ఉంది. 1948లో తన హత్య జరగడానికి కొంతకాలం ముందు గాంధీ విదేశీ పత్రికా విలేఖరికి ఇచ్చిన అరుదైన ఉపన్యాసం ఇదేనంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక పేర్కొంది. 1947 లో విదేశీ పాత్రికేయుడు ఆల్ఫ్రెడ్‌ వాగ్‌ ఈ అరుదైన గాంధీజీ ఉపన్యాసాన్ని రికార్డు చేశారు. నాలుగు 78 ఆర్‌పిఎం ఎల్పీలలో నిల్వచేసిన జాతిపిత ఉపన్యాసం గత 60 సంవత్స రాలుగా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయింది. ఈ రికార్డు కాపీని ఆల్ఫ్రెడ్‌ వాగ్‌ వాషింగ్టన్‌లోని నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు జాన్‌ కాస్‌ గ్రోవ్‌కు ఇచ్చారు. ఈ అరుదైన ఆంగ్ల ఉపన్యాసంలో అణ్వాయుధాల బీభత్సం గురించి, తూర్పు దేశాల విజ్ఞానం గురించి, అసృ్పశ్యత, భారతీయ గ్రామాల గురించి గాంధీజీ ప్రసంగించడం విశేషం.

మహాత్ముడిగా పేరు
1920 డిసెంబర్‌లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశం సహాయ నిరాకరణ ఉద్యమానికి అంగీకారం తెలిపింది. భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ యుగం ప్రారంభమయ్యింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గాంధీని మహాత్ముడుగా సంబోధించాడు. 1930 ఫిబ్రవరి 15న అహ్మదాబాద్‌లో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. గాంధీజి మాన వతా పదం, ఓర్పు, శాంతి, అహింసా సిద్ధాంతాల గురించి ప్రపంచమంతా ప్రచారమ యింది. ఏ రాజకీయ నాయకుడూ అవలంబించని ‘‘అహింసా వాదం’’ ప్రపంచంలోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. తను నమ్ముకున్న బాట అయిన ‘‘అహింస’’ ప్రజల ను మంత్రముగ్ధుల్ని చేసి ‘‘మహాత్ముడిగా’’ గుర్తింపు తీసుకువచ్చింది.

ఇష్టమైన కారు
andhaమహాత్మా గాంధీకి 1928లో స్థాపించిన కుమార్‌ టాక్సీస్‌తో మంచి అనుబంధం ఉంది. ఎస్‌.కృష్ణన్‌, కె.బి.కుమరన్‌ ఈ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీకి బాపూజీ కూడా ఓ కస్టమరే. గాంధీజీ ‘‘ఓవర్‌ల్యాండ్‌ విప్పెట్‌’’ అనే కారులోనూ, 1936లో ఓ ఫోర్డ్‌ టి సిరీస్‌ కారులోనూ ప్రయా ణించారు. అప్పట్లో ‘ఓవర్‌ ల్యాండ్‌ విప్పెట్‌’ కారు ధర ఎంతో తెలుసా… కేవలం రూ. 825. అప్పట్లో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర 15 పైసలు. గాంధీ ప్రయాణించే కారుకు ఎప్పుడూ ‘‘జోసెఫ్‌ మిరాండా’’ అనే కారు డ్రైవర్‌ ఉండేవారు. బాపూజీ 1927లో ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి సెం్టల్‌ జైలు నుంచి ఓ ఫోర్డ్‌ టి సిరీస్‌ కారులో ప్రయాణం చేశారు.

ఆ కారు ఇప్పుడు పుణెలోన అబ్బాస్‌ జందన్‌వాలా అనే వ్యక్తి దగ్గర ఉంది. బాపూజీ ప్రయాణించిన కార్లలో చెప్పుకోదగిన మరొక కారు రాజ్‌కోట్‌ మహారాజుకు చెందిన ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పురాతన రోల్స్‌ రాయిస్‌ కారు. ఈ కారులోనే గాంధీ, ఇంగ్లాండ్‌ రాణి ప్రయాణించారని చెప్పుకుంటారు.

గాంధీజీ ఫేవరైట్‌ డిష్‌
మహాత్మాగాంధీ ఒక సాధారణ వ్యక్తి. తను శాకాహారం మాత్రం ఎక్కువగా ఇష్టపడేవారు. తీసుకునేవారు కూడా. శాకాహారంలో అయనకు ఇష్టమైన ఆహారం ఆలూ దమ్‌. ఆలూ దమ్‌ ఇండియన్‌ ఫుడ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆలూ దమ్‌ను బేబీ పొటాటో, పచ్చి బఠానీలతో తయారు చేస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top