You Are Here: Home » చిన్నారి » కథలు » గమ్యం చేరని ఉత్తరం..!

గమ్యం చేరని ఉత్తరం..!

kathaఈ ఉత్తరం కొన్ని దృఢ నమ్మకాలది, కొన్ని విశ్వాసాలది, అమ్మలది, అమ్మలగన్న అమ్మలది, స్నేహితులది, అందరిదీ… వెరసి వారి ప్రేమను సిరాలో వడపోసి వ్రాసినది!! ఎన్నో జ్ఞాపకాల సిరాతో వ్రాస్తున్న ఈ ఉత్త రం అనుక్షణం కొడుకు కోసం ఆరాటపడుతు న్న అమ్మకోసం. కొడుకు రాకకై చూసీ చూసీ అలసిన అమ్మ కళ్ళల్లో మెరిసే విశ్వాస సారాం శం ఈ ఉత్తరం. ఈ ఉత్తరం మా అమ్మకు ఓ ఓదార్పు, నిట్టూర్పు, ఆత్మీయ స్పర్శ… అనంత విశ్వం యొక్క సంతోషాలను కొన్ని క్షణాల్లోనే అన్వయించి, ఆపాదించుకొని రాసింది.

శిశిరపు ఆకుల చప్పుడుదీ ఈ ఉత్తరంలోని అక్షరాల సవ్వడి! అలసిన చెవుల కర్ణభేరీల కొండచరియల్ని చీల్చేసే ఒక సెగలాంటి స్పర్శ. వసంతపు ప చ్చని కొమ్మలని ఊయలూపే గాలి తెమ్మలది. మేఘాలు గర్జించినప్పుడు మనసు మనసు లో లేక ఒంటరిగా మూగాలాపన చేస్తున్న గోడలతో ముచ్చటిస్తుంది. అమ్మ మనసు కడు భారపు చింత నుండి నిశ్చింతకు వచ్చేది. కొడుకు రాకతో ఆ తల్లి మనసు తెప్పరిల్లి, తేజోవంతమై వెలుగుతుంది!! ఆ ఉత్తరమే…,

దేవతలాంటి అమ్మకి ప్రణామములు. నీ చరణదాసుడై నీ కొడుకు లెఫ్టినెంట్‌ విజయ్‌ భార్గవ్‌ వ్రాయునది ఏమనగా..! అమ్మా… నీ ఆశీర్వాదబలంతో ఈ సైనికబల గంలో తారాజువ్వలా ముందుకెళ్తున్నాను.
ఎప్పుడూ కొడుకు సుఖసంతోషాలే కోరుకునే అమ్మా… నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను.
నీ కుశలమే నన్ను నా అంతరాత్మ నిలదీస్తుంది. అమ్మా… నీవు ప్రతీక్షణం నాకు గుర్తుకొస్తావు. నీవెప్పుడూ ఒంటరినంటావు కదా… ఈసారి వచ్చినప్పుడు నీ కోరిక మేర కు నా నుదుట పెళ్లి బాసిగం కట్టుకుంటాను. నీ ఒంటరితనాన్ని దూరం చేస్తాను. అమ్మా… నువ్వు నా గురించేం దిగులు చెం దకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.

ఫెళఫెళలాడే ఈ కొండలమీద మంచుబిందు వుల్లా నా వ్రేలు రైఫిల్‌ ట్రిగ్గర్‌ మీద పడిన క్షణం నీవు రాల్చిన కన్నీటి క్షణాలు గుర్తుకొస్తా యి. అప్పుడే నా గుండెలో తూటా దిగినంత బాధ కలుగుతుంది. అమ్మా… ఆ క్షణమే గుం డె నిండా ధైర్యం నిండివున్న నీ కొడుకు మన సు భయంతో విలవిలలాడుతుంది. ఉగ్రవాదు లకు బహుమతిగా వెళ్లే గుండు భయావహ చప్పుడుకన్నా నీ జ్ఞాపకాలే నన్ను భయభ్రాం తులకు గురి చేసి నన్ను నిలువునా కలిచివేస్తాయి!? అమ్మా… మేమింతవరకెన్నో యుద్ధాలు గెలి చాం. సరిహద్దు రేఖపై విజయబావుటా ఎగుర వేస్తూ మునుముందుకెళుతున్నాం. అప్పు డప్పుడూ… శత్రువుల శవాల గుట్టలు చూస్తే విచిత్రమనిపిస్తుంది.

ఎందుకంటే ఆ శవాల ఆవాసాలే మా ఆవా సాలు అవుతాయి గనుక?! ఏమిటిది? ఎలాంటిదిది?? ఎప్పటిదీ శత్రుత్వం అనుపిస్తుంది??? మనవాళ్ళతో వేరై మనవాళ్ళకోసమే యుద్ధం చేయడం ఎలాంటి రాజకీయమిది?? దీనికి ముగింపు లేదా??? మన రక్షణకై మనదేశం కోసం కొందరు వీరమరణం పొంది అమరు లైతే… ఇంకొందరు వాళ్ళు వాళ్ళ గడ్డకోసం అమరులవుతున్నారు!? ఈ చల్లని శీతల వాతావరణంలో శత్రువుల తుపాకుల చప్పుళ్ళు విని వెంటనే జాగరూకతతో యుద్ధానికి సిద్ధమవుతాం.
ఇలా… యుద్ధం మీద యుద్ధం, యుద్ధం – యుద్ధం… అంతం లేని, విరామమే ఎరుగని, అలుపులేని అనంత యుద్ధం???

ఈ ఎడతెరిపి లేని యుద్ధాల్లో నిత్యం ప్రాణా లకి ఒడ్డి పోరాడుతూ, బ్రతుకు తీపిని కాలరాసి జ్ఞాపకాల సంకెళ్ళు వేసుకుంటూం మా మనసులకి? బరువైన మా మనసుల్లో నిదిరిస్తున్న మాటల మూటలు విప్పుకొని ఒకరికొకరం చెప్పుకొని మా మనసుల భారం దించుకుంటాం. లేదంటే అదే మాకు మోయలేని భారమవుతుంది!? కొందరి అమ్మలో, కొందరి భార్యలో, పిల్లలో మా రాకకోసం ఎదురు చూస్తూ నిమిషాలని లెక్కిస్తుంటారు. ఆ వృద్ధ, నిస్సహాయ తల్లిదం డ్రులు ఈ ఎదురుచూపుల్లో పడి విసిగి వేసారి పోతున్నారు. ఈ ఎడతెగని యుద్ధాలు ముగు స్తాయనే భ్రమలో… ఒకరు నా చెల్లి పెళ్లి ఘనంగా చేయ్యాలనే న మ్మకంతో, ఇంకొకరు తన పిల్లల భవితవ్యం కోసం ఏం చేస్తే బావుంటుందోననే భవిష్యత్‌ ప్రణాళికల గురించి కూలంకషంగా చర్చించు కొని ఒకరి భారాన్ని ఒకరం దించుకుంటాం!

నువ్వు నమ్ముతానంటే ఓ నిజం చెబుతానమ్మా… ఈ ఉత్తరాన్ని గత మూడు రోజులుగా వ్రాస్తు న్నా. రేపు మేం యుద్ధంలో గెలవబోయే ‘టైగ ర్‌ హిల్‌’ యొక్క విజయాన్ని కాంక్షించి ఈ ఉత్తరంలో ముగింపుగా రాస్తాను. కానీ… నాకేం తెలుసు ఈ ఉత్తరం ముగింపు ఇలా వుంటుందని? అది నన్నే శాసిస్తుందని?? టైగర్‌ హిల్‌ యుద్ధంలో పోరాడి తుదకు మేమే గెలిచాం. ఈ విజయం చేజారిపోవద్దని శత్రువు గురిపెట్టే తుపాకీ గుండుకి నా గుండె ను అడ్డం పెట్టి అమరుడ్ని అవక తప్పలేదు? యుద్ధ సమయంలో శత్రు జాడలు వెదుకు తూవున్నాం. అప్పుడే ఎక్కడినుండి దూసు కొచ్చిందో ఆ శత్రువుల గుండు నా ఎదపై మరణ తిలకం దిద్ది వెళ్లింది…మరి… ఈ విజయ్‌భార్గవ్‌ ఉత్తరం గమ్యం చేరకుండానే ఈ సరిహద్దుల్లో రెపరెపలాడు తూ ఉండిపోయింది??? జీవితకాలం పాటు అమ్మ నిరీక్షణ అలాగే కొనసాగుతోంది!????

– హిందీ మూలం: భూమేశ్‌ సంగం,
అనువాదం: హుమాయూన్‌ సంఘీర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top