You Are Here: Home » ఇతర » గ‘మ్మత్తు’

గ‘మ్మత్తు’

29filleaమందు ప్రియులకి కూడా అప్పుడప్పుడు ఏదో అద్భుతం చేసి చూపిస్తూవుంటే, మత్తునించి తేరుకుని ఔరా..! అనుకుంటారు. ఆ తరువాత గమత్తుగా మందు సీసా వెంట పడతారు. ఇక్కడ 4 అడుగుల 9 అంగుళాల ఎత్తులో ఉండే విస్కీ సీసాని చూస్తే ఎవరైనా సరే దాని మత్తులో పడిపోక తప్పదు. అందులోను, 6 అడుగుల ఎత్తున్న సుందరాంగి, ఆ కంపెనీ బ్రాండ్‌ అంబా సిడర్‌ స్టెల్లా సీసా పక్కన ఇలా నిలబడితే చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఈ మధ్యనే టామిన్‌టోల్‌ కంపెనీ అతిపెద్ద సీసాని తయారుచేసింది. ఈ సీసా ఎత్తు 4’ 9 అడుగులు. అంటే మామూలు సీసాలు ఒకదాని మీద ఒకటి నిలబెడితే 150 సీసాల ఎత్తు. అయితే ఇదేదో షో కోసం పెట్టారనుకుంటే, పొరపాటే, దీని ఖరీదు అక్షరాలా 5000 పౌండ్లు.

అంటే మన కరెన్సీలో సుమారుగా 4 లక్షల పైచిలుకు. ఎంతో ఆకర్షిణీయంగా తయారు చేసిన ఈ సీసా మరింత ఆకర్షించడానికి ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ స్టెల్లా తన వంతు సహకారాన్ని అందించి అమ్మకాలు మరింత బాగా రాణించేలా కృషిచేస్తానందిట. అందుకే ఏమాత్రం డిమాండ్‌ చేయకుండా ఉచితంగా ఈ సీసాతో ఫోజు ఇచ్చింది. ఇంకేముందీ.. ఈపాటికి సీసా అమ్ముడైపోయి ఉంటుంది కదూ..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top