You Are Here: Home » ఇతర » ‘గట్టు’ ప్రయాణానికి తోడుగా స్మైల్‌ ఫౌండేషన్‌

‘గట్టు’ ప్రయాణానికి తోడుగా స్మైల్‌ ఫౌండేషన్‌

GATTUa అది ఓ చిన్న పిల్లల సినిమా అని కొందరు అంటారు. అయినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా అన్ని వయ స్సుల వారిని తన అభిమానులుగా చేసుకుంది. అదే గట్టు సినిమా. చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఇండియా (సీఎఫ్‌ఎస్‌ఐ) దీన్ని నిర్మించింది. రాజన్‌ ఖోసా దీనికి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులెై 20న భారత్‌లో విడుదలెైంది. దీనికి స్మైల్‌ ఫౌండేషన్‌ అవుట్‌రీచ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరి స్తోంది.అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఐ యామ్‌ కలామ్‌’తో స్మైల్‌ ఫౌండే షన్‌, బడికి పోవాలన్న ప్రతి చిన్నారి కలగురించి ప్రతీ ఒక్క రిలో కదలిక తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. గట్టు సినిమా తో ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. వివిధ సామాజిక అంశాలపెై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వారు స్పందించేలా చేసేందుకు సినిమాలను కూడా ఉపయోగించు కోవాలనే ఉద్దేశంతో స్మైల్‌ ఫౌండేషన్‌ ఉంది.

విద్యార్థుల సంక్షే మం, అభివృద్ధిలపెై ప్రత్యేక దృష్టితోఈ ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. ఇక సినిమా కథలోకి వెళ్తే… ఆకాశంలో ఉన్న ఓ అంతు చిక్కని గాలిపటాన్ని గెలిచేందుకు ఓ కురవ్రాడు చేసిన ప్రయత్నమే ‘గట్టు’. ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుం ది. వీటిలో ప్రతిష్టా త్మక బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కూడా ఉంది. లాస్‌ఏంజెల్స్‌, న్యూయార్క్‌ ఫిలిం ఫెస్టివ ల్స్‌లో ఆడియన్స్‌ అవార్డు, బెస్ట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ యాక్టర్‌ అవార్డులను ఇది గెలుచుకుంది. బీజింగ్‌, కాన్స్‌, టొరంటో, ఎడిన్‌బరో లాంటి ఫిలిం ఫెస్టివల్స్‌ అన్నింటినీ చుట్టేసి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారత్‌లోనూ విడుదలెైంది.

సీఎఫ్‌ఎస్‌ఐ చెైర్‌పర్సన్‌ నందితా దాస్‌ ఈ సందర్భంగా మాట్లా డుతూ, ‘‘గట్టు ఓ వినోదాత్మక సినిమా. అంతా సినిమాటిక్‌గా, సాహసాలతో ఉంటుంది. తన కలను నిజం చేసుకోవాలనుకు న్న గట్టు కోరిక అటు చిన్నారులతో, ఇటు పెద్దలతో ఒకే విధంగా సంభాషిస్తుంది. పిల్లల కోసం వినోదా త్మకంగా ఉండే సందే శాత్మక సినిమా తీయాలన్న మన కోరికను ఈ సినిమా ప్రతి ఫలిస్తుంది. అదే సమయంలో అది భారతీయతను సంతరించు కున్నప్పటికీ, సార్వజనీక సత్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ సినిమా విడుదల ద్వారా, తన కల కంటే కూడా పెద్దదెైన ఓ సత్యాన్ని కను గొన్న అనాథ బాలుడి ప్రయాణాన్ని భారతదేశం లోని లక్షలాది మంది చిన్నారులతో పంచుకోగల మని భావిస్తు న్నాం. నేను నా కలను అనుసరించే ధెైర్యాన్ని కూడా ‘గట్టు’ నాకు అందిస్తుంది.

ఆ పిల్లవాడే ఆ పని చేయగలిగితే, నేనెందుకు ఆ పని చేయలేను అని భావిస్తాను. సినిమా చూసిన వారెవరెైనా అలాగే అనుకుంటారు. ఈ చిత్రం విశిష్టత అదే’’ అని సీఎఫ్‌ ఎస్‌ఐ చెైర్‌ పర్సన్‌ నందితా దాస్‌ అన్నారు. రాజశ్రీ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను విడుదల చేసింది. చిన్నారి ప్రేక్షకులను చేరుకునేం దుకు చిత్ర నిర్మాతలు, సినిమా పంపిణిదారులు కొత్త పంథాను ఎంచుకు న్నారు. దేశవ్యాప్తంగా స్కూల్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా, స్కూల్‌ ప్రిన్సిపా ల్స్‌కు ప్రత్యే క ప్రద ర్శనలు నిర్వహిం చడం ద్వారా తమ ప్రేక్షకులకు దగ్గర కాగలుగుతు న్నారు. ‘‘వ్యక్తిగతంగా ఆ సినిమాతో పాటు నేను కూడా ప్రయాణిం చాను. దాన్ని టీచర్లకు, ప్రిన్సిపాల్స్‌కు, విద్యార్థులకు ప్రదర్శిం చాను. ప్రతి చోట కూడా దానికి అపూర్వ స్పందన లభించింది.

సినిమా చూసిన తరువాత, మళ్ళీ తమను తిరిగి ఆ సినిమాను చూసేందుకు థియేటర్‌కు తీసుకె ళ్ళాల్సిం దిగా విద్యార్థులు తమ ప్రిన్సిపాల్స్‌ను కోరుతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయించాలని ఆయా ప్రిన్సిపాల్స్‌ కోరుతు న్నారు. గట్టు సందేశాన్ని నలుదిశలా చాటేందుకు ఎంతోమంది భాగస్వాములు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని నందితా దాస్‌ పేర్కొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top