You Are Here: Home » ఇతర » గజల్స్‌ గాన కళానిధి

గజల్స్‌ గాన కళానిధి

గాంధీరుుజం మీద 125 ప్రపంచ భాషల్లో పాటలుపాడి అరుదైన లిమ్కాబుక్‌ రికార్డును సొంతం చేసుకున్నారు ఇటీవలే గజల్స్‌ గాన కళానిధి శ్రీనివాస్‌. అంతకు ముందు రెండుసార్లు గిన్నిస్‌బుక్‌లో ఎక్కి భారతదేశానిేక గర్వకారణమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన మధుర గాయకుడు శ్రీనివాస్‌. అలాగంటే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ..యావత్‌ ప్రపంచాన్నే తన గజల్స్‌తో ఉర్రూతలూగిస్తూ ఆ గజల్స్‌నే ఇంటిపేరుగా మలుచుకున్న గజల్‌ శ్రీనివాస్‌ అంటే చాలు ఆరేళ్ల పాపడు నుంచి అరవై ఏళ్ల వృద్ధులదాకా నాగస్వరం విన్న నాగపాములవుతారు.తన ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. తెలుగుకి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు.

Uawశ్రీనివాస్‌ అసలు పేరు కేసిరాజు శ్రీనివాస్‌. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలోనైనా…పెరిగింది అంతా పశ్చిమగోదా వరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలోనే… తండ్రి నరసింహరావు, తల్లి రత్నవల్లి. బాల్యం చదువులు పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లులోనే సాగాయి. ఆంధ్రావిశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్‌ శాస్త్రంలో బి.ఏ.చేసి ఆ తర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ ద్వారా లైబ్రేరియన్‌ కోర్సు పూర్తిచేశారు. జీవనోపాధికోసం ఓ పదిసంవత్సరాలపాటు భీమవరం, కోరుకొండ విద్యాలయాలలో లైబ్రేరియన్‌గా పనిచేశారు. ఆదినుంచీ శ్రీనివాస్‌కు మన సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణం. అందునా గాంధీ సిద్ధాంతాలకు పూర్తిగా దాసానుదాసుడు. అందుకే తను సొంతంగా సమకూర్చుకున్న పాటల్లో ఎక్కువగా మన సంస్కృతి, సాంప్రదాయం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే దేశవిదేశాలలో కలిపి ఆరువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చివుంటారు. 1986లో తన అమూల్యమైన గళంతో కెరీర్‌ను ఆరంభించారు. కంజీరాను చేతపట్టుకుని సొగసుగా దాన్ని ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో తన పాటలకు లయబద్దంగా దరువేస్తుంటే శ్రోతలు మైమరచిపోయేవారు. ఎన్నో పాటల క్యాసెట్లకు తానే సొంతంగా బాణీలు సమకూర్చి దేశవిదేశాలలో పంపిణీ చేశారు. గజల్స్‌ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పి అందులో ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నారు ఈ గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌.ఆయన కత్తికి అన్నివైపులా పదునే…

గజల్‌ శ్రీనివాస్‌ నిజానికి ఒక వేటగాడు. వెంటాడి, వెంటాడి జంతువులను బంధించే వాడ్ని వేటగాడు అని కాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్స్‌తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది… కాదంటారా? అని. ఆ లెక్కకొస్తే ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే.

Unaగజల్స్‌ శ్రీనివాస్‌ మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు ఎవరుంటారు చెప్పండి!… ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రంలో ఏం విన్నా మనకు శ్రావ్యంగానే ఉంటాయి…చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. అందుకే శ్రీనివాస్‌గారి దృష్ట్టిలో పాట అంటే స్వరాలు, అను స్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటా రాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్‌సేన్‌లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు.

ఆ మాటలు బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని వారికి కూడా ఆయన భావం అర్ధమవుతుంది. పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అంటారు శ్రీనివాస్‌. ఆయన వారసురాలి పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు.మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అది కూడా ఆయన ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తన జీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానా నికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్‌తో, అమ్మని అమ్మగా ప్రతీ తెలుగువానికీ పరిచయం చేసేదాకా నిదురపోలేదు.

నాన్న గజల్‌తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది గజల్‌తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధి రోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు.జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన వారిని కూడా విడిచి పెట్టలేదు ఒక్క సారి ఊరుపోయిరా అన్న గజల్‌తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో, జీవన విధానంలో ఆయన గజల్‌ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు.

తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేక పోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీ పుత్రుడిని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి.

తెలుగుదండు : ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి అరుదైన ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తన ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. తెలుగుకి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు.
వరించిన గిన్నిస్‌ రికార్డు :తొలినాళ్లలో కళాకారుడు గజల్‌ శ్రీనివాస్‌ను గిన్నిస్‌ రికార్డు వరించింది. గాంధీజీ తత్త్వంపై ఏకంగా 100 భాషల్లో పాటలు పాడిన శ్రీనివాస్‌ ప్రతిభను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్‌‌డ రికార్‌‌డ్స గుర్తించింది. దాంతో శ్రీనివాస్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఓ సందేశం పంపింది.అలాగే మరో సందర్భంలో జాతిపిత మహాత్మాగాంధీకి వినూత్న రీతిలో నివాళులర్పించే దిశగా గజల్‌ శ్రీనివాస్‌ ఓ పాటను నూట యాభై భాషల్లో ఆలపించే సాహసకౄఎ త్యానికి విజయవాడ వేదికైంది.

బాపూజీ సిద్ధాంతాలపై తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 56 భారతీయ భాషల్లోనూ, 44 విదేశీ భాషల్లోనూ అదే గేయాన్ని, అదే స్వరంతో గానం చేసే యజ్ఞాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రికార్డు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్‌‌డ రికార్డుకు కూడా పంపారు.సుమారు ఐదు నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం తీవ్రంగా కృషి చేసిన గజల్‌ శ్రీనివాస్‌ ఒక్కొక్క భాషలో ప్రముఖు లైన గేయ రచయితల చేత ఈ గేయాన్ని రాయించుకుని ఆ భాషకు గల సహజత్వం కోల్పోకుండా, అర్థం మారకుండా, అన్నింటినీ ఒకే స్వరంలో పాడి చూపించారు శ్రీనివాస్‌..

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top