You Are Here: Home » ఇతర » క్రీడా సంగ్రామంలో…అందాల భామలు

క్రీడా సంగ్రామంలో…అందాల భామలు

ఇప్పుడు ఆటంటే ఆట మాత్రమే కాదు. అదొక అందమైన బాట. క్రీడాకారిణులు పతకాల వేటను పూర్తిచేయడానికి ఎంత ఇష్ట పడతారో అందరికీ తెలిసిందే. కానీ నేడు పరిస్థితి మారింది. ేకవలం ఆటవరకు మాత్రమే పరిమితం కాకుండా కొంచెం బ్యూటి కాన్షియస్‌గా మారుతున్నారు నేటి క్రీడాకారిణులు. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీల నుంచి ప్రకటనల కాంట్రాక్ట్‌లతో పాటు ఫ్యాషన్‌ షో ర్యాంప్‌పై వాక్‌ చేసే అవకాశం లభిస్తోంది. ఆటతో క్రీడాభిమానులను. .అందంతో కొత్త అభిమానులను ఆకట్టుకుంటున్నారు వీరు. వారిలో కొందరి గురించి ధీర ప్రత్యేక కథనం…

సానియా మిర్జా
saniaసానియా మిర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే దేమో? ఇప్పుడంటే పెళ్లవడంవల్ల పాపులారిటీ (ఫ్యాన్‌ ఫాలోయింగ్‌)లో కొంత మార్పు వచ్చినా .. ఒకప్పుడే సానియా అంటే విపరీతమైన యూత్‌ ఫాలోయింగ్‌ ఉండేది. నేటికీ చాలా మంది ఆమె అందాన్ని మెచ్చుకోలేక ఉండలేరు. 15 నవంబర్‌ 1986న జన్మించిన సానియా మిర్జా తన బాల్యం విద్యాభ్యాసాన్నంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. 2003లో కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. డబ్ల్యూటిఎలో టాప్‌ 30 లో స్థానం సంపాదించిన తొలి భారతీయ వనిత సానియా. డబుల్స్‌లో టాప్‌ 10లో కూడా చోటు సాధించింది.

జ్వాలా గుత్తా
jwalaఇటీవలే ఒలింపి్‌ అర్హత సాధించిన జ్వాలా గుత్తా పతకాలు సాధించేందుకు ఓ రేంజ్‌లో సాధన చేస్తుంది. ఆమె అభిమానులు మాత్రం ఆమె దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని వేచి చూస్తున్నారు. జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముపె్పైసార్లు విజయం సాధించిన క్రీడాకారిణి జ్వాలా . ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యుత్తమ డబుల్స్‌ క్రీడాకారిణులలో ఆమె ఒకరు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌, గోల్డ్‌ పతకాలను సాధించడంతో పాటు. 2011 బ్యాడ్మింటన్‌ ప్రపంచకప్‌లో బ్రోంజ్‌ పతకాన్ని సాధించింది.

దీపికా
చెనై్నలో జన్మించిన దీపికాకు స్క్వాష్‌ క్రీడాకారిణిగా ఎంత గుర్తింపు ఉందో.. అందాల భామగా కూడా అలాంటి గుర్తింపే ఉంది.ఆరవ తరగతిలోనే తొలి అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న దీపికా జూనియర్‌ స్క్వాష్‌ పోటీలో జర్మన్‌ ఒపెన్‌, ఫ్రెంచ్‌, డచ్‌, ఆస్ట్రేలియన్‌ స్కాటిష్‌ ఒపెన్‌లను కైవసం చేసుకుంది. మనదేశంలో టాప్‌ స్క్వాష్‌ క్రీడాకారిణులలో ఆమె ఒకరు. ఆటలో భాగంగా కొన్ని సార్లు ఆమె గ్లామరస్‌ లుక్స్‌ వీక్షకులను అలరించాయి. దీంతో గ్లోబస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆమెకు మోడలింగ్‌లో అవకాశం ఇచ్చింది.

సైనా నెహ్వాల్
sainaఅంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టించిన భారతీయ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం ఆమె ర్యాంకు 5. అందాల బొమ్మగా కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. జూనియర్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌తో పాటు, ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఆమె కావడం విశేషం. 2009 జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ను గెలిచి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.యూత్‌ ఫాలోయింగ్‌ కల క్రీడాకారిణి.

షికా
షికా ఇండో- అమెరికన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌. 1983 ఎప్రిల్‌ 5న అమెరికాలో జన్మించిన షికా ఆరవ ఏటనుంచే టెన్నిస్‌ బ్యాట్‌తో రఫ్పాడించటం ప్రారంభించింది. 2004లో యూఎస్‌ ఒపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌ స్లామ్‌లో తొలిసారి పాల్గొంది. ఇప్పటి దాకా మూడు సార్లు ఐటిఎఫ్‌ మహిళ విభాగం టైటిల్స్‌ను గెలుచుకుంది.

నికోలెట్‌
Shikaదేశంలో గోల్ఫ్‌ క్రీడకు పాపులారిటీ తీసుకురావడంలో కృషి చేసిన వ్యక్తిలో నికోలెట్‌ పేరు ముందుగా చెప్పుకోవాలి. అందమై భామ గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకుని ఆడు తుంటే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎలా పెరగ కుండా ఉంటుందో చెప్పండి. గోల్ఫ్‌తో పాటు షోటో సెషన్స్‌ అంటే కూడా ఇష్టం కాబోలు ఎన్నో అందమైన ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 5 సంవత్స రాల వయస్సు నుంచే ఆమె గోల్ఫ్‌లో రాణిస్తున్నారు. ఆమె చిన్న తనంలో కొందరు రిటైర్‌ అయిన వ్యక్తులను గోల్ఫ్‌ ఆడటం చూసింది. గోల్ఫ్‌ ఆడేటప్పుడు వారు ఎంతగా ఎంజాయ్‌ చేస్తున్నారో గమనించిన నికోలెట్‌ వారిలానే తను కూడా ఆడాలని నిర్ణయించుకుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top