You Are Here: Home » చిన్నారి » కవితలు » క్రికెట్‌

క్రికెట్‌

సూర్యుని జట్టుకు చంద్రుని జట్టుకు మధ్య జరిగే
డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కోసం
ముస్తాబైనట్టుంది ఆకాశం
అదిగో బౌలర్లు వేసిన బంతి గుర్తులు
తారకలై వెలుగుతున్నాయి
బ్యాట్స్‌మెన్‌ల వ్యాగన్‌ల వీల్లన్నీ
పాలపుంతలై పొంగుతున్నాయి
ఫిఫ్టీ- ఫిఫ్టీ, ఈ- ట్వంటీ, టెస్ట్‌ మ్యాచ్‌- ఏదైనా కావచ్చు
ఆట మర్మం తెలిశాక బ్యాట్‌ మంత్రదండమవుతుంది

‘శత్రువు’ కబంధ హస్తాలనుంచి జారిన బంతి
ఫోరై వెక్కిరిస్తుంది
సింగల్‌ తీయలేని టేలెండర్‌ సిక్సర్లు కొట్టి
ఆల్‌ రౌండరవుతాడు
బ్యాట్‌ పంజా విప్పి గర్జిస్తుంది
తన రికార్డును తానే బద్దలు కొట్టిన సచిన్‌ వందో శతకాన్ని
సప్త సముద్రాల హోరు అభినందిస్తుంది
పురుషుల జట్టు డకౌట్‌ అయిన చోట
మహిళల జట్టు కప్పు గెలిచి జెండా ఎగరవేస్తుంది!

బౌలింగ్‌ అంటే ఉక్కు చేతుల విన్యాసం
అయిదు వేళ్ళ మధ్యనుంచి
దూసుకు వచ్చే బంతి అగ్నిగోళమవుతుంది.
యార్కర్‌ షార్క్‌ కోర విసిరినప్పుడు
స్టంపులకు బెయిల్‌ దొరకదు
రేసును మరిపించే సేస్‌
వెన్ను విరిచే స్పిన్‌, కళ్ళు చెదిరే క్యాచ్‌
స్థాణువుల్ని చేసే స్టంపవుట్‌
తృటిలో రనౌట్‌
మునివేళ్ళమీద నిలబెట్టే
మూడో అంపైర్‌!

venu-gopalఒక్కోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ భూతం
డ్రాయింగ్‌ రూంలోకి సొరంగం తవ్వుతుంది
ఆత్మ మైదానంలో ఓటమిని
గెలుచుకున్న ఆటగాడు
మొండెంతో పెవిలియన్‌ చేరుకుంటాడు
వేలంపాట వెక్కిరింతల నడుమ
క్రీడాకారులను పందెపు కోళ్ళను
చేసిన తర్వాత
క్రికెట్‌ భాషకు అందని విన్యాసంతో
కార్పొరేట్‌ కరెన్సీ క్రికెట్‌ను
క్లీన్‌ బౌల్డ్‌ చేసిగ్రి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top