You Are Here: Home » చిన్నారి » క్యూవియర్ సూత్రం అంటే ఏమిటి?

క్యూవియర్ సూత్రం అంటే ఏమిటి?

జార్జెస్ క్యూవియర్ 1769వ సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీన జన్మించాడు. జీవశాస్తమ్రన్నా, దాని అధ్యయనమన్నా బాల్యం నుంచే ఆయన ఎంతో ఆసక్తి కనబర్చేవాడు.

1795లో చదువు పూర్తి చేసి మరో గొప్ప శాస్తవ్రేత్త జెఫరీ హివేర్ ఆహ్వానంపై పారిస్ వెళ్లాడు. అక్కడ ఆయనకు అసిస్టెంట్‌గా ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీర శాస్తమ్రంటే ఇష్టం ఉండటం వలన ఆ శాస్త్రంలో క్యూవియర్ చాలా కృషి చేశాడు. ఆయన జంతు శరీర శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశాడు. నెపోలియన్ చక్రవర్తి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఒక జంతువులో అవయవాలు అన్నీ వేర్వేరుగా ఉన్నా అన్నింటికీ ఏదో ఒకరకమైన సంబంధం ఉందని ఈయన అభిప్రాయం.

తన శాస్ర్తీయ పరిజ్ఞానంతో క్యూవియర్ జంతుజాలాన్ని వర్గీకరించాడు. శిలాజ శాస్త్రంలో ఎనలేని ప్రతిభ చూపించారు. ఎంతో శ్రమపడి, కేవలం శిలాజాల సాయంతోనే ఆఫ్రికా, భారత దేశాల్లో కనిపించే ఏనుగులు వేర్వేరు జాతులకు చెందినవని నిరూపించాడు. ప్రకృతిలో అప్పుడప్పుడు వైపరీత్యాలు సంభవించి జంతువులు చనిపోతాయని సూత్రీకరించాడు. అలాంటి వైపరీత్యాల తర్వాత మళ్లీ కొత్త జీవులు పుడతాయని వాదించేవాడు. పరిణామ శాస్త్రంలో క్యూవియర్ సూత్రం ముఖ్యస్థానాన్ని పొందింది. క్యూవియర్‌కి ఆపూర్వ జ్ఞాపక శక్తి ఉండేది. గొప్ప శిలాజ శాస్తవ్రేత్త అయిన క్యూవియర్ 1832లో మరణించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top