You Are Here: Home » చిన్నారి » కవితలు » కోహం కోహం కోకిలమ్‌

కోహం కోహం కోకిలమ్‌

నందన నామ సంవత్సర
వార్తా పత్రికలో
ఒక పతాక ప్రకటన
కదిలిపోతూ చెరిగిపోతూ తిరిగొస్తోంది
కోకిల పోస్టు ఖాళీ అని
ఉద్యోగ దరఖాస్తులకై ఆహ్వాన ప్రకటన

అడవులు అదృశ్యమయ్యాక
ఆకుపచ్చదనాన్ని
ఏడు రంగుల జాబితా నుంచి
తొలగించాక

ఆఖరి మామిడి సారం వేలాది ఏళ్ల క్రితమే
రసాయన మాత్రంగా నిక్షిప్తమయ్యాక

అయ్యా! ఇది నందన నామ ఉగాది
ఆంగ్ల కాలమానం ప్రకారం క్రీ.శ. 5012
కోకిల పోస్టు ఖాళీ-

కొన్ని వందలేళ్లు గా
ప్రకటనలొస్తూనే ఉన్నయి

కోకిల ఎలా ఉంటుందో
తెల్సుకోవడం కోసం
చిత్ర పటాలని వెదికారు…
క్రీ.శ. 2000 లో
ఇది చివరి సారి కన్పించింది

అలానే అసలు ఉగాది ఏమిటో
ఆరు రుచుల ఆ అపురూప సమ్మేళనమేమిటో
కోకిల అనే ఆ అభూత కల్పన ఏమిటో

అంతా ఇక్కడి బూడిదె రంగు రోదసిలో తెలిసేదొక్కటే…

భూమి శూన్యంలో
అతి అరుదుగా విన్పించే ఒక పిక స్వరం

rama-thirdaభూమే బూడిదయిన కోకిలల ఆత్మ సాక్షిగా
అంతర్ధానమై పోయిన
మానవ వసంతం కోసం
ఒక దిగులు రాగమాలపిస్తున్న సడి-
నల్లని ఆ లోకాన ఒక వేదనాలాపన
కోకిల
ఎలా ఉంటుందో తెల్సినవారు
కోకిల ఉద్యోగానికై దరఖాస్తు చేసుకోవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top