You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » కోమలి పాత్రలో …

కోమలి పాత్రలో …

కోమలి పాత్రలో …

 

ఆయన క్రీగంటి చూపులు, నిల్చునే తీరు, చిరునవ్వు పెదవి విరుపులు, సిగ్గులు, హొయలు ఒక్కటేమిటి ఎవరైనా చూస్తే నిజంగా స్ర్తీమూర్తే్త అనుకొంటారు. కానీ ఆ విగ్రహం చూసి బుర్రా సుబ్రహ్మణ్యశాస్ర్తి అని ఎవరూ అనుకోరు. అలా స్ర్తీ పాత్రలకు పెట్టింది పేరు బుర్రా. ఆయనలోని సాత్వికాభినయం, ఆంగికాభినయం వాచికం లాంటివన్నీ ఆయన్ను చింతామణిగా, మధురవాణిగా రంగస్థలంపైన నిలబెట్టారుు. ఆనాటి సత్యభామ దర్పం చూడాలన్న, నాటి ప్రకాశంగారి తల్లిగా ఛాందస భావాలు తెలుసుకోవాలన్నా, మనం చరిత్ర పుటలు తిరిగేయాల్సిన అవసరం లేదు ేకవలం బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తి గారి నాటకం చూస్తే చాలు.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో 1937 సంవత్సరంలో జన్మించిన బుర్రా చిన్నప్పటి నుంచే సుశ్రావ్యంగా పద్యాలు, పాటలూ పాడుతుంటే విన్న మేనమామ కోటేశ్వరరావు ప్రోత్సహించి, వానపాముల సత్యనారాయణ గారి వద్ద పద్యాలూ, పాటలూ నేర్పించారు. అలాగే బుర్రా చిత్రకళలో కూడా నైపుణ్యం సంపాదించారు. వీరు నాట్యం కూడా నేర్చుకున్నారు. వీరికి బి.వి. నరసింహరావు నాట్యంలో శిక్షణ ఇచ్చారు.
2s1953లో యాదృచ్ఛికంగా జరిగిన నాటకరంగ ప్రవేశంతో బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తి జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. సుబ్రహ్మణ్యం కేవలం నటుడే కాదు. మంచి నాట్యకళాకారుడు కూడా అవడంతో ఆ నాట్యం ఆయనకు నటనలో ఎంతోఉపయోగపడింది. ప్రారంభంలో స్థానం నరసింహరావు స్ర్తీ పాత్రల పోషణలో ప్రసిద్ధి పొందారు. సత్యభామ పాత్ర అంటే స్థానం అనే ముద్ర బలంగా పడిపోయిన నాటక రంగంలో తరవాతి స్థానం బుర్రా తిరిగి సత్యభామ పాత్ర పోషించి స్థానం నరసింహరావు తరువాత స్ర్తీ పాత్రల్ని పోషించడంలో వన్నెకెక్కారు. 1953లో ఖిల్జీ రాజ్యపతనంతో దేవళ అనే స్ర్తీపాత్రలకు శ్రీకారం చుట్టారు. బుర్రా అన్నగారు వేయవలసిన పాత్ర ఆయన అనారోగ్య కారణంగా బుర్రా సుబ్రహ్మణ్యం వేయవలసి వచ్చింది. ఖాళీగా ఉన్నాడని బుర్రా సుబ్రహ్మణ్యాన్ని వేయమని ఆ రోజు ఆయన అన్నగారు చెప్పడం యాదృచ్ఛికం అయినా అది తన జీవన మార్గాన్ని నిర్దేశించిందంటారు బుర్రా. పురుషులు స్ర్తీ పాత్రలను పోషించి రంజింప చేయడం కష్టం.

కానీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తిలో నేత్రాభినయం, సాత్వికం ఆయనకి స్ర్తీ పాత్రల్లో రాణించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. బుర్రా దివి తాలూకాలో హరిశ్చంద్ర నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు హరి శ్చంద్రుడుగా పసుమర్తి సుబ్రహ్మణ్యం, చింతా కృష్ణమూర్తి చంద్రమతిగా, మహంకాళి సత్యనారాయణ గారు విశ్వమిత్రుడుగా చేసినప్పుడు విశ్వామిత్రుడు స్వర్గలోకం నుంచి దిగిరావడం ఆంగికాభినయంతో రక్తికట్టించి నాటి కాలంలో అందుబాటులో లేని సాంకేతిక అభివృద్ధి లోటును కనిపించనిచ్చేవారు కాదు. యోగివేమనలో మాధురిగా, సతీ సక్కుబాయిగా, శశిరేఖగా, మధురవాణిగా, సత్యభామగా ఇలా ఎన్నో స్ర్తీ పాత్రల్లో రాణించి తెలుగు నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదిం చుకున్నారు.

విశ్వదాభిరామ, హరిజనాభ్యుదయం, వివేకానంద, ప్రణవ క్షేత్రం, షిరిడి సాయిబాబా, అష్టవిధ నాయకులు మొదలైన రచనలు చేసిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి.
వీరి ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ నటుడుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందించారు. ఇవేకాక, కవిసా మ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ నాట్యాచార్య బిరు దునీ, కొండవీటి వెంకటకవి నాట్య మయూరి వంటి బిరుదులతో అభినందించడం మరుపురాని మధుర స్మృతి అంటారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తి. .

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top