You Are Here: Home » చిన్నారి » కథలు » కోడళ్ళు

కోడళ్ళు

SUNDAY-STOREరాఘవరావుగారు రిటైర్డు టీచరు. రోజు సాయంత్రం సమయంలో ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వాకింగ్‌ చేయ డం. ఆ వాకింగ్‌లోనే ఆలోచనలు, అనేక సమస్యలకి పరిష్కారం చేసుకోవడం రాఘవ రావుగారి దిన చర్యలో ఓ భాగం. ఆ రోజు ఎందుకనో అనుకున్న సమయం కంటే ముందుగానే వాకింగ్‌ వెళ్తున్న భర్తను చూసి ‘‘ఇంకా ఎండగా వుంది. కాసేపాగి వెళు దురు గాని, ఈ లోగా నిమ్మరసం తెస్తాను’’ అని వెళ్లింది విజయమ్మ కుంటుతూ నడుస్తూ. విజయమ్మ ఎడమకాలు విరిగి దాదాపు సంవత్సరం అయింది. బాతురూంలో పడిపోతే కాలు విరిగింది. విరిగిన చోటే రాడ్‌ వేశారు. విజయమ్మను గురించి ఆలోచిస్తుంటే ‘‘ఇదిగో నిమ్మసరం తాగి కొద్దిసేపు వుండి వెళ్ళండి’’ అంది. నిమ్మరసం ఒక్కగుటికే తాగుతుంటే విజయమ్మ ఆసుపత్రిలో వున్న రోజులు గుర్తుకువచ్చాయి.

ఇద్దరు కొడుకు ఉద్యోగాలలో వున్నారు. పెద్ద కొడుకు అనంతపురంలో బ్యాంకు మేనేజర్‌. చిన్నకొడుకు కపపలో ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రొఫెసర్‌. ముందుగా పెద్దాడికి ఫోన్‌ చేశాడు.
‘‘హలో’’ అంది అవతలి కంఠం.
‘‘నేను మీ మావయ్యను వరుణ్‌ లేడామ్మ’’ అన్నారు.
‘‘ఆయన బ్యాంకు పనిమీద వైజాగ్‌ వెళ్ళారు మావయ్య’’
‘‘ఎప్పుడొస్తాడు’’
‘‘మూడు రోజుల వరకు రారు’’ అమె ఇంకా ఏదో చెబుతోంది కాని కొడలి నోటి నుండి అత్తయ్య ఎలా వుంది అనే మాట రాలేదు. ఆమె నోటి నుంచి అత్తయ్య అనే మాట రాకపోయేసరికి తనే చెప్పాడు.
‘‘మీ అత్త బాతురూంలో కింద పడ్డారు! అసుపత్రిలో చేర్చాను కాలు విరిగింది’’.

‘‘అలాగా’’
‘‘రేపు ఆపరేషన్‌ చేస్తారు’’
‘‘ఏ ఆసుపత్రి’’
‘‘గౌరీగోపాల్‌’’
‘‘ఆయన రాగానే వీలు చూసుకుని వస్తాను’’ అని చెప్పింది.
‘‘సరేనమ్మ’’ అన్నాడు.
చిన్నకొడుకుకు ఫోన్‌ చేశాడు.
‘‘హలో కిరణ్‌ నేను మీ నాన్నను మాట్లాడుతున్నా’’
‘‘చెప్పు నాన్న’’ ఆరోగ్యం బావుందా! అమ్మ ఎలావుంది? అడిగాడు!
కొడలు మాట తీరుకి కొడుకు మాట
తీరుకు ఎంత తేడా అనుకున్నాడు! మనసులో.

‘‘హలో ఏం నాన్న విషయం’’
‘‘మీ అమ్మ బాతురూంలో కింద పడింది. కాలు విరిగింది రేపు ఆపరేషన్‌’’
‘‘అన్నయ్యకు ఫోన్‌ చేశావా!’’
‘‘చేశాను బ్యాంకు పని మీద వైజాగ్‌ వెళ్ళాడట’’
‘‘మరి అమ్మకు తోడుగా వదినెను రమ్మన్నావా!’’
‘‘ఆమె మీ అన్న వచ్చిన తరువాత వీలు చూసుకుని వస్తుందట’’
‘‘సమయానికి అరుణ కూడా లేదు పంపడానికి. వాళ్ళమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నారట వెళ్ళింది’’.

‘‘సరేలే కాని నీవు నీ భార్యను ఏమీ తొందర పెట్టవద్దు’’
‘‘రేపు అరుణను పంపుతాను అన్నాడు!’’
‘‘సరే’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

‘‘ఆపరేషన్‌ సక్సెస్‌’’ అన్నారు డాక్టర్‌. సంతోషించాడు రాఘవరావు.
అపరేషన్‌ అయిన తర్వాత రోజు. ఆశ్చర్యం, అబ్బురం పెద్దకోడలు వనజ నేరుగా అసుపత్రి కి వచ్చింది. ఆమె వచ్చిన అరగంటకే చిన్న కో డలు దిగింది. ఇద్దరు కోడళ్ళు ఒకేసారి రావ డంతో ఆయనకు ఆనందం పట్టలేకున్నది.
‘‘ప్రయాణం బాగా జరిగిందా’’ కుశల ప్రశ్నలు వేశాడు. అత్తగారు దీనం గా వారి వంక చూసింది. ఆ చూపులో బాగున్నారా! అనే సంకేతం కనబడు తోంది. ఇద్దరు కోడళ్ళు ఎడమ, కుడి వైపున నిలుచున్నారు. ‘‘టిఫిన్‌ తెస్తానమ్మ’’ అంటూ వెళ్ళాడు రాఘవరావు. అత్తగారు ‘మంచినీళ్ళు’ అని అడిగినప్పడు ఇద్దరి సెల్‌ఫోన్లు ఒకేసారి మోగాయి. అంతే అత్తగారికి మంచినీళ్ళు ఇవ్వాలనే ధ్యాస మరచిపోయి రూం నుంచి బైటకు వెళ్ళారు. ఒకరు ఎడమ వైపుకు, మరొకరు కుడివైపుకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మామగారు టిఫిన్‌ తెస్తూ వాళ్ళిద్దరిని చూశాడు. వారి మాటలలో కాస్త నవ్వు. మావగారు టిఫిన్‌ తెచ్చిన విషయం కూడా వాళ్ళు గమనించలేదు. రాఘవరావు లోపలికి వెళ్ళగానే…
‘‘నీళ్ళు’’ అంది విజయమ్మ. చాలా సేపు అవుతోంది.

వాళ్ళను అడిగితే ఫోను మాట్లాడకుంటున్నారు’’ చెప్పింది విజయమ్మ. టైం చూసుకున్నాడు రాఘవరావు. తను వచ్చికూడా పది నిమిషాలవుతోంది. తనే అమెను మెల్లగా లేవనెత్తి మంచినీళ్ళు అందించాడు. సరిగ్గా అప్పుడే వచ్చారిద్దరూ.
‘‘మావయ్య మేము ఉన్నాంగా’’ అంటూ ఇద్దరు అత్తభుజాలు పట్టుకున్నారు ఎక్కడ లేని ప్రేమతో
‘‘మీరు టిఫిన్‌ చేయండమ్మ ఈలోగా డాక్టర్‌గారూ రౌండ్స్‌కి వస్తారు’’ అన్నాడు.

టిఫిన్‌ పాకెట్స్‌ వాళ్ళకి అందిస్తూ…మళ్లీ ఫోన్‌
‘‘హలో నేను వనజను’’
‘‘బావున్నావా’’
‘‘ఆ బావున్నా’’
‘‘ఏ ఆసుపత్రి’’
‘‘గౌరీగోపాల్‌. రూం నెంబర్‌ నాలుగు’’
‘‘ఓ పదినిమిషాలలో వస్తా’’
ప్రియాంక వనజ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరు భర్తలు బ్యాంకులోనే పని చేస్తుండటంతో ఇద్దరికీ చనువు ఎక్కువ మళ్ళీ ఫోన్‌. ఈసారి అరుణది
‘‘హలో నేను అరుణను’’

‘‘హలో నేను మీ ఆయన స్నేహితుడినమ్మా మా భార్య మీతో మాట్లాడుతుందట. ఒకసారి పెళ్ళిలో మీరు కలిశారు గుర్తుందా’’
‘‘ఓ సువర్చలానా’’
‘‘అవును మాట్లాడండి’’
‘‘హలో’’ అంది అరుణ
‘‘అత్తగారు ఏ ఆసుపత్రిలో వున్నారు’’
‘‘గౌరీ గోపాల్‌ రూం నెంబరు నాలుగు’’
‘‘కాసేపటిలో అక్కడుంటాను బై’’ అంది.

ఇద్దరు స్నేహితురాళ్ళ ఠంచనుగా వచ్చారు ఆసుపత్రికి
ప్రియాంక రూంలోకి రాగానే ‘‘హలో ప్రియాం
క’’ అంటూ గట్టిగా వాటేసుకుంది వనజ.
‘‘అబ్బా ఎన్నాళ్ళకు కలుసుకున్నాం’’ అంది వనజ. ఆనందానికి అవధిలేదు. ఏదో ఎవరెస్టును ఎక్కినంత ఆనందంగా వుందామె.
మరికొద్ది సేపటికి ‘‘హలో అరుణ’’ అంటూ వచ్చింది సువర్చల.
సువర్చలను చూడగానే వెయ్యి ఓల్ట్‌ల బల్బ్‌లా విప్పారింది అరుణ మోము.

‘‘హలో అంటూ గట్టిగా వాటేసుకుంది. ఇద్దరూ స్నేహితురాళ్ళతోనే గడిపారు. రాఘవరావు గారు వారిద్దరినీ చూ సి ‘‘మీరిద్దరూ… అంటుండగానే
‘‘నేను కృష్ణానగర్‌లో బ్యూటీక్లినిక్‌ నడుపు తున్నా అంకుల్‌ మీ అబ్బాయికి మా వారు మంచి ఫ్రెండు’’ అంది.
మీరు అన్నట్లు సువర్చల వైపు చూశాడు.
‘‘నేను కూడా హెర్బల్‌ బ్యూటీ క్లినిక్‌ నడుపు తున్నా. వెంకటరమణ కాలనీలో ఓ పెళ్ళిలో మా ఆయన మీ అబ్బాయి కలిశారు. అక్కడే మా స్నేహం కూడా’’ అంది బాబ్డ్‌హెయిర్‌తో ముంగురులు సవరిస్తూ. ఇద్దరు స్నేహితా రాళ్ళు తను కోడళ్ళకంటే మించిన వారిలా వున్నారు అనుకున్నాడు రాఘవరావు.
ఇంతలో ప్రియాంక సెల్‌ మోగింది.

కాసేపటికి సువర్చల సెల్‌ మోగింది. వెను వెంటనే అరుణ వనజల సెల్లులు కూడా మో గాయి. ఆ గది ఓ సంగీత హాలుగా వుంది. సెల్లులు మోగగానే నల్గురూ సెల్లులో సంభా షిస్తూ బైటకు నడిచారు. రాఘవరావుగారు నిట్టూర్చారు.
‘‘ఏం’’ స్నేహం ఇది. ఒక్కరు కూడా ఎలా వున్నారు’’ అనడగలేదు. కాలం కలికాలం మరి’’ ఇంతలో తన సెల్లు మోగింది. వారిలా సంగీత ధ్వని కాదు. ఓ దైవ కీర్తన

డాక్టర్‌గారు రౌండ్స్‌కు వచ్చారు. రూం నెంబ ర్‌ నాలుగులోకి వెళ్ళి పేషంట్‌ను పరీక్షించా రు. ‘‘బాగుంది రాఘవరావుగారు ఇక పది రోజులలో డిశ్చార్జు కావచ్చు. ఈ లోగా చిన్న గా అడుగులు వేయడం ప్రారంభిస్తాం. ఫిజి యోథెరిపిస్ట్‌ వచ్చి చూపిస్తారు’’ అన్నాడు డాక్ట రు. ఆ రోజు సెలైన్‌ బాటిల్స్‌, మందులు రాశా డు. నర్సు ఆ చీటిని రాఘవరావు గారికి ఇచ్చి ‘‘ఈ మందులు తీసుకురండి’’ అంది.
రాఘవరావుగారు మందుల కోసం రూం బయటకు వచ్చాడు.
ఇద్దరు స్నేహితురాళ్ళు ఫోన్‌లో సంభాషిస్తుంటే వారి ముంగురులు, మెడలోని చైన్‌లు సవరిస్తూ వున్నారు తన కోడళ్ళు. వాళ్ళకు స్నేహితులే ఆనందమయ్యారు.

‘‘అబ్బా ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా వుంది’’ అంది వనజ సోఫాలో కూలబడుతూ.
‘‘కాంతమ్మ ఫ్రిజ్‌లోంచి జ్యూస్‌ తీసుకురా’’ ఆజ్ఞాపించింది ప్రియాంక. కాంతమ్మ ఇద్దరికీ జ్యూస్‌ అందించింది. ‘‘హమ్మయ్య ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా వుంది’’ జ్యూస్‌ తాగుతూ అంది వనజ. ‘‘చాలా రోజులకు కలిశాం ఎక్కడికైనా ఎకాంతంగా వెళ్దాం’’ అంది ప్రియాంక. ‘‘ఇక్కడ కొండారెడ్డి బురుజు ప్రాముఖ్యమైనది కదా! అక్కడికి వెళ్దాం’’ అంది మరి అసుపత్రికి అంది ప్రశ్నార్ధకంగా.
‘‘కాంతమ్మను పంపుదాంలే’’ అంది ప్రియాంక. కాంతమ్మకు అసుపత్రి అడ్రసు చెప్పి ఆటోకు డబ్బిచ్చి, ఇద్దరూ కొండారెడ్డి బురుజుకు వెళ్ళడానికి సిద్దమైనారు.

సాయంత్రం ఐదు గంటల సమయం. కొండారెడ్డి బురుజు ఎక్కారు. నగరమంతా కనిపిస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కొన్ని జంటలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పిల్లలతో కలిసి వచ్చి ఆనందిస్తున్నారు.
‘‘అది సాయిబాబా గుడి అక్కడే తుంగభద్ర నది’’ చేయి చూపి చెబుతోంది ప్రియాంక. చుట్టు పరికిస్తోంది వనజ. ఇంతలో ప్రియాంక సెల్‌ మోగితే.
‘‘మీరు ఇప్పుడు ఏడు, ఏడున్నరకు రండి. తొమ్మిది గంటలకు కదా! పెళ్ళి కూతుర్ని చేసేది’’ అంది. ‘‘అవును వనజ నువ్వుకూడా ఒకటి కోర్సు నేర్చుకోకూడదు. నీకు కొన్ని ట్రిక్స్‌, టిప్స్‌ చెబుతాను. అని నేర్చుకో నీకూ టైం పాస్‌ అవుతుంది. మీ అత్తగారు డిశ్చార్జు అయ్యేదానికి పదిరోజుల సమయం ఉంది. ఈ పదిరోజులలో నీకు కొన్ని టిప్స్‌ చెబుతాను’’ అంది.

‘‘మరి ఆసుపత్రిలో ఎలా?’’
‘‘నీ తరపున కాంతమ్మను పెడదాం. వాళ్ళమ్మయికి ఇప్పుడు సెలవులే. మనకు సహయకారిగా ఉంటుంది. ఈ పది రోజులలో అపుడపుడు మనం వెళ్ళి చూసొస్తూ వుంటాం. ఏమంటావు’’ అంది. ‘‘నీ ఆలోచన బావుంది. సరే’’ అంది వనజ బ్యూటీ టిప్స్‌ నేర్చుకోవాలనే కుతూహలంతో…
***
‘‘అబ్బా ఆసుపత్రి నుంచి మీ ఇంటికి ఓ ఊరు వచ్చినట్లువుంది’’ అంది అరుణ సోఫాలో కూలబడుతూ.
‘‘రంగమ్మ ఫ్రిజ్‌లోంచి ఐస్‌క్రీం తీసుకురా’’ అంది సువర్చల. రంగమ్మ ఐస్‌క్రీం వారికి అందించింది.
‘‘ఇల్లు చాలా బాగుంది సుమర్చలా నీ టెస్టా మీ ఆయనదా’’ అంది.
‘‘ఆయన కేం తెలుసు. అంతా నా ప్లానే’’ అంది.

(మిగతా వచ్చేవారం)
– కనుమ ఎల్లారెడ్డి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top