You Are Here: Home » ఇతర » కొరియన్‌ ‘పార్క్‌’లో విరిసిన వెన్నెల

కొరియన్‌ ‘పార్క్‌’లో విరిసిన వెన్నెల

మహిళా నాయకత్వాన్ని నేడు ప్రపంచదేశాలన్నీ స్వాగతిస్తున్నారుు. ప్రంపంచదేశాల్లో అత్యంత సంపన్నదేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ప్రసిడెంట్‌ ఒబామా కూడా కీలక స్థానాల్లో మహిళలేక ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అటువంటి స్థానాల్లో మన భారతీయ మహిళలకి పెద్దపీట వేయడం గమనార్హం. చాలా దేశాల్లో ప్రభుత్వ శాఖలు, ఉపశాఖల నుంచి మెుదలు పెడితే అధ్యక్ష పీఠం వరకూ మహిళలు తమ శక్తిసామర్ధ్యాల్ని నిరూపించుకుం టున్నారు. అందుకు మరో తార్కాణం దక్షిణ కొరియాలో తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్‌ జియున్‌ హైని మెున్న జరిగిన 11వ అధ్యక్ష పదవీ ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ఎన్నుకుని పట్టంకట్టారు.

kodhiఇంతకు ముందు ఈమె 2004 నుండి 2006 వరకూ తిరిగి 2011-2012లోను సంప్రదాయవాద సిద్దాంతాల్ని అనుసరిస్తున్న ‘గ్రాండ్‌ నేషనల్‌ పార్టీ’ అధ్యక్షురాలిగా కొనసాగింది. ఈ జిఎన్‌పి పార్టీ 2012లో నీనురీ పార్టీగా పేరుమారింది. పార్క్‌ కొరియన్‌ నేషనల్‌ పార్టీ సభ్యురాలిగా కూడా 1998 నుండి 2012వరకూ నాలుగు పర్యాయాలు ఏకగ్రీవంగా కొనసాగింది. 2012 జూన్‌లో ఐదవ పర్యాయం ఈమె సమాన ప్రాతినిధ్యాని వహించింది. ఈమె తండ్రి పార్క్‌ చుంగ్‌ హీ, 1963 నుంచి 1979 వరకూ దక్షిణ కొరియా అధ్యక్షుడుగా పనిచేయడం వల్ల ఈమెకు ఆ దేశంలో రాజకీయ పరపతి ఉండటం సహజమే అయినా ఈమె చేసిన అనన్య సేవలు మాత్రం ఆదేశ ప్రజ మరచిపోలేనివి.

పార్క్‌ విశేషాలు
dheeraపార్క్‌ 1952 ఫిబ్రవరి 2న డేగూలోని జంగ్‌-గూలో సమ్డియోక్‌ డాంగ్‌లో పుట్టింది. 1963 నుండి 79 వరకూ 3వ అధ్యక్షుడుగా ఉన్న పార్క్‌ చుంగ్‌ హీ తొలి సంతానం ఈమె. ఈమె తల్లి యాక్‌ యంగ్‌ సూ. ఈమెకు ఒక సోదరుడు, ఒక సోదరీ కూడా ఉన్నారు. పార్క్‌ జియూన్‌ హై ఇప్పటికీ పెళ్ళిచేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉంటోంది. ఈమె కుటుంబం 1953లో సియోల్‌కి మకాం మార్చింది. పార్క్‌ సియోల్‌లోనే జంగ్‌చుంగ్‌ ఎలిమెంటరీ స్కూల్లో విద్యాభ్యాసం మొదలు పెట్టి, 1970లో సంగ్‌షిమ్‌ హైస్కూల్లో ఉన్నత విద్యనభ్యసించింది. 1974లో సోగాంగ్‌ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యింది. ఆతరువాత గ్రీనోబుల్‌ విశ్వవిద్యాలయంలో మరికొంతకాలం చదువు కొనసాగించినా, ఈమె తల్లి మరణం కారణంగా ఫ్రాన్స్‌కు వెళ్ళిపోయింది. 1987లో ఈమె తైవాన్‌లోని చైనీస్‌ కల్చర్‌ విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకుంది. అదేవిధంగా 2008లో పుక్యాంగ్‌ నేషనల్‌ యూనివ ర్సిటీ నుండీ, 2010లో సోగాంగ్‌ యూనివర్సిటీ నుండి కూడా గౌరవ డాక్టరేట్‌ పొందింది.

జీవిత గమనం
eraపార్క్‌ 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గ్రాండ్‌ నేషనల్‌ పార్టీ ద్వారా పోటీచేసి చట్టసభా మహిళగా అడుగుపెట్టింది. అదే విధంగా ఆ తరువాత 1998, 2008 మధ్య జరిగిన జిల్లా ఎన్నికల్లో మూడు-నాలుగు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టేసింది. అదే స్థాయిలో ఏప్రిల్‌ 2012వరకూ తిరుగులేని మహిళగా కొనసాగింది. ఆ తరువాత డల్సియాంగ్‌ 19వ ఎన్నికల్లో ఈమె ఏ నియోజకవర్గానికీ ప్రాతినిధ్యం వహించకుండా సీనురీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంది. దానితో ఈమె ప్రపోర్షనల్‌ రిప్రజంటేటివ్‌గా ఏప్రిల్‌ 2012లో ఎన్నికయ్యింది. గ్రాండ్‌ నేషనల్‌ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రోహ్‌ మూ-హున్‌ 2002 ప్రసిడెంట్‌ ఎన్నికల్లో లంచానికి పాల్పడ్డాడన్న నేరారో పణ కారణంగా పార్టీ పరువు మంటగలి సింది. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అపజయాన్ని చవిచూసింది.

దానితో ఆ పార్టీ అధ్యక్ష పీఠం పార్క్‌ని వరించింది. అక్కడి నుండి ఈమె పార్టీ స్థాయిని మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నంలో విశేషంగా కృషిచేసింది. ఈ ఎన్నికల్లో జిఎన్‌పి మెజారిటీని కోల్పోయినా, 121 సీట్లు సాధించింది. పార్టీ విమర్శలు ఎదుర్కుంటున్న తరుణంలో ఇది అనూహ్యమైన పరిణామం. పార్క్‌ , అధ్యక్షురా లిగా జిఎన్‌పి పార్టీని ఎంతో ఎత్తుకి తీసువచ్చి ప్రాంతీయ ఎన్నికల్లో విజయాలు సాధించింది. అలాగే 2006లో పూర్తి మెజారిటీని సాధించింది. ఈ విధంగా అనేక సమస్యల్ని, ప్రతిఘటనల్ని ఎదుర్కుంటూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఆ పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు నడిపించిన ఘనత పార్క్‌కే చెందుతుంది.

అందుకున్న పార్టీ పగ్గాలు
zxc2012లో కొరియా పరిశోధక బృందంవారు నిర్వహించిన సర్వేలో 12 మంది రాజకీయ ధృక్పధం ఉన్న అధ్యక్షుల జాబితాలో పార్క్‌ని అత్యంత సంప్రదాయక విలువలు ఇచ్చే రాజకీయవేత్తగా పేర్కొంది. పార్టీ పరంగానే కాకుండా తను నమ్మిన సిద్దాంత పరంగా కూడా ఈమె విధానాలు, కట్టుదిట్టమైన న్యాయ వ్యవస్థ, పన్నుల రద్దు, నియంత్రణ తగ్గింపు వంటి లక్ష్యాలు 2008 అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో ప్రతిఫలించాయి. అదేవిధంగా దక్షిణ కొరియా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు, సంక్షేమ సేవలు అందించడం మీద దృష్టిసారించింది. ఈమె చేసిన రాజకీయ వాగ్దానాలు నిలబెట్టుకుని, ప్రజలకి వాటిని చేరువ చేయడంలో చాలా కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ముద్ర వేయించుకున్న ధీర వనిత. అలాగే తను ప్రజల పక్షాన నిలబడి సాధించిన ఘనకార్యాలు ఈరోజు పార్క్‌ను దేశాధ్యక్ష పీఠానిి తీసుకువచ్చాయని నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. 26 ఫిబ్రవరి 2013న రాజకీయ పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న తొలి కొరియన్‌ మహిళగా, తొలి కొరియన్‌ అధ్యక్షురాలిగా కొరియన్‌ దేశ ప్రజలు ఈమెకు ఘనమైన ఉత్సవాలతో స్వాగతం పలికారు

వేడుకల్లో…
ghjkఈమె అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అనేక మంది కళాకారులు ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. అందులో అందరినీ ఆకర్షించిన జాతీయ గీతం, ఈ మధ్య కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గంగ్‌నమ్‌ నృత్య రీతిలో కళాకారులు ప్రదర్శించడం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top