You Are Here: Home » చిన్నారి » కొన్ని ప్రామాణికాల్ని ‘ఫారడే’ అంటారెందుకు?

కొన్ని ప్రామాణికాల్ని ‘ఫారడే’ అంటారెందుకు?

18వ శతాబ్దపు మొదట్లో లండన్‌లో జరిగిన సంఘటన అది. ఓ పుస్తకాల షాపు యజమాని ఒక కుర్రాడిని పనిలో పెట్టుకున్నాడు. అతను ఒక బీద కమ్మరి కొడుకు. పెద్దగా చదువు లేదు. అయినా చదువంటే ఇష్టం.

ఒక రోజు ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ అనే పుస్తకాన్ని బైండ్ చేస్తుంటే విద్యుత్‌పై ఒక వ్యాసం కనిపించింది. అందులో ఉన్న విషయాలు ఆ కురవ్రాడిని అబ్బుర పరిచాయి. అందులో చదివిన విషయాల ఆధారంగా ఇనుప ముక్కలు, తీగలతో ప్రయోగాలు చేశాడు. తొమ్మిదేళ్ల ప్రయోగాల అనంతరం 1831లో ఒకసైన్స్ పత్రికలో ఒక రేఖా చిత్రం ప్రచురితమైంది.
అది అతను తయారు చేసిన పరికరం ‘ఎలక్ట్రోమెకానికల్ జనరేటర్’. అతడు విద్యుత్తు అయస్కాంతాల సహాయంతో కొన్ని చక్రాలను తిరిగేలా చేసి, వాటి ద్వారా కొన్ని పరికరాలతో పని చేయించాడు. ఆ తర్వాత ముప్పై ఏళ్లకు ఇతర ఇంధనాలను వాడి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జనరేటర్‌ను తయారు చేశారు. ఆయన చేసిన ప్రయోగాలు ఆధునిక విద్యుత్ శాస్ర్తానికి బాటలు వేశాయి. ఆయనే మైఖేల్ ఫారడే. ఆయన లండన్‌లో 1791, సెప్టెంబర్ 22న జన్మించాడు. విద్యుత్ విశ్లేషణ. విద్యుత్ అయస్కాంత ప్రేరణ వంటి అంశాలకు ఆయన సూత్రాలు ప్రతిపాదించాడు. అందుకే ఆయనకు గౌరవసూచకంగా విద్యుత్ శాస్త్రంలో కొన్ని ప్రామాణికాల్ని ‘ఫారడే’ అని పిలుస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top