You Are Here: Home » చిన్నారి » కవితలు » కొన్ని అసంకల్పితాలు…

కొన్ని అసంకల్పితాలు…

కొన్ని క్షణాల్ని ఒడిసి పట్టుకొని
జేబు కింది గుండెలో పొట్లం కట్టా
చేతిలో ఇన్ని గులక రాళ్ళని
తీసుకొని చెరువు గట్టుపై నడుస్తూ
గాలి కోతకు ఊగుతూ రాలుతున్న
ఆకులను ఏరుకుంటూ ప్రేమగా తాకుతూ
మబ్బు కుండ ఖాళీ అవుతూ

ఆఖరి చినుకు కనురెప్పపై పడుతూ
రెక్క తెగిన తూనీగ ఒరిగిపోతూ
దోసిలి నిండా నెత్తుటి మరక
చిత్రంపై ఒలికిన రంగు కాన్వాసు
మీదుగా మొఖం పైకి పాకుతూ
విరిగిన వేణువు నుండి నిషిద్ధ
రాగమేదో గొంతులోకి ఒలుకుతూ

పాదాలను తాకుతున్న గడ్డి పరకల
తడి గుండెలోకి జారుతూ
పదిలంగా దాచుకున్న నెమలీకలు
వదిలిన బియ్యపు గింజలు మెరుస్తూ…

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top