You Are Here: Home » ఇతర » కొనేద్దాం గురూ!

కొనేద్దాం గురూ!

06FEAభాగ్యనగరంలో ఫ్యాషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సెలబ్రిటీలు మెచ్చే సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా ఏ డిజెైన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టినా ఇక్కడ ప్రత్యక్షమవుతోంది. అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త డిజెైన్లను డిజెైనర్లు సెలబ్రిటీలకు పరిచయం చేస్తున్నారు. ఇక పెళ్లి సమయంలో ధరించే వస్త్రాలకు అనాదిగా ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులు మెచ్చే వివిధ డిజెైన్లలో డిజెైనర్లు వీటిని తీర్చిదిద్దితున్నారు. సెలబ్రిటీలు, ఫ్యాషన్‌ప్రియులు కోరుకునే సరికొత్త వెరెైటీలు అందుబాటులోకి వస్తున్నాయి. మహిళలతో పాటు కాలేజీకి వెళ్లే యూత్‌ విభిన్న వస్తధ్రారణ కోరుకుంటున్నారు. ఒకరికంటే ఒకరు భిన్నంగా కనిపించాలన్న కోరిక ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తులు రూపు దిద్దుకుంటున్నాయి.

కాలేజీకి వెళ్లే యువతుల కోసం డిజెైనర్లు ప్రత్యేక లుక్‌తో తీర్చిదిద్దుతున్నారు. నిత్యం ధరించే వస్త్రాలకు తగ్గ జ్యుయలరీ ధరించేం దుకు కూడా నేడు పోటీపడుతున్నారు. దీంతో సరికొత్త డిజెైనర్‌ ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు జ్యుయలరీ షోరూమ్‌ల నిర్వాహ కులు కూడా వీటిని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పేరుపొందిన కంపెనీల నుంచి చిన్నచిన్న జ్యుయలరీ షాపుల నిర్వాహకులు కూడా మగువలు మెచ్చే ఆభరణాలను అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ప్రదర్శనల్లో డిజెైనర్‌ వేర్‌ డ్రస్సులతో పాటు చీరలు, సల్వార్స్‌, కుర్తీస్‌, టనిక్స్‌, శారీ బార్డర్స్‌, కిడ్స్‌వేర్‌, ఫుట్‌వేర్‌, ఒరిజినల్‌ డెైమండ్‌ జ్యుయలరీ, ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీ, బ్యా గ్స్‌ వంటి పలు ఉత్పత్తులు ఏర్పాటు చేస్తున్నారు.

<వధూవరులకు ట్రెంజ్‌ కలెక్షన్స్‌
DSC_59060024హైదరాబాద్‌ శ్రీ నగర్‌ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన ట్రెంజ్‌ ఎగ్జిబిషన్‌లో వధూవరుల కోసం స్పెషల్‌ కలెక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కొత్త వెరెైటీలను జంటనగరాల ఫ్యాషన్‌ప్రియులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎంకోర్‌ ఈవెంట్స్‌ అధినేత శాంతి తెలిపారు. ఈ ప్రదర్శనలో డిజెైనర్‌ చీరలతోపాటు 916 ఆభరణాలు, 1 గ్రాము జ్యుయలరీ, కుర్తీస్‌, యువత ఇష్టపడే కుర్తీస్‌, నార్త్‌ ఇండియన్‌ ప్రత్యేక జార్జెట్‌ చీరలు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి ఎత్నిక్‌ వేర్‌ తదితర ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. మొత్తం 40కి పెైగా ఇందులో స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. కాటన్‌ డ్రస్‌ మెటీరియల్స్‌ తో పాటు ఫ్యాషన్‌ జ్యుయ లరీ కూడా ఇందులో ఏర్పా టు చేశామని, జూన్‌ 6 వ తేదీ వరకు ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటలవరకు ఈ ఎగ్జిబి షన్‌ అందుబాటులో ఉం టుందని శాంతి తెలిపారు.

<కళకళలాడుతున్న డిజెైర్‌ డిజెైన్లు
DSC_59220010డిజెైనర్‌ వస్త్రాలను కోరుకునే మగువల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న వెరెైటీ మోడల్స్‌ నేటి యువతులను ఆకట్టుకుంటున్నాయి. డిజెైనర్లు కూడా పోటీపడి ఎప్పటికప్పుడు కొత్త డిజెైన్లను తయారుచేసి అందించేందుకు పోటీపడుతున్నారు. ఈ ఉత్పత్తులకు నగరంలో ఏర్పాటు చేస్తున్న పలు ప్రదర్శనలు వేదికగా మారుతున్నాయి. మంగళవారం తాజ్‌కృష్ణలో ‘డిజెైర్‌’ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ‘కసమ్‌ సే కమస్‌’ చిత్ర నటీనటులు ప్రారంభించారు. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబాయి, అహ్మదాబాద్‌, బెంగుళూరు, బ్యాంకాక్‌, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఉత్పత్తులతో ఇందులో స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు డిజెైర్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ డెైరెక్టర్‌ అనితా అగర్వాల్‌ తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top