You Are Here: Home » చిన్నారి » కవితలు » కొత్తరూపు కోసం…

కొత్తరూపు కోసం…

కాబట్టి ముందు చెప్పిందే
ప్రాణసమాన అసమాన సమాధాన మనుకుంటాం
కాని

నాచు మొలిచిన నీటి కొలనులో
మునిగీ మునిగీ
తెచ్చుకున్న చర్మపు దురద పోవాలంటే
కాలువ నీళ్లలో కడుక్కోవాల్సిందే
మూసిన గదిలోని గాలిని పీల్చీ పీల్చీ
తెచ్చుకున్న ఊపిరాడనితనపు
రాకాసి నుండి రక్షణ కావాలంటే
కొత్త గాలుల్ని కోరుకోవాల్సిందే
ఎంత కాలమీ అనంత నితాంత జడత్వమీ
రవంతైనా నవత్వం లేనితనం
ఈ వైవిధ్య రాహిత్యం
వందల వేల సార్ల తర్వాత కూడా
వస్తు రూపాల సాక్షాత్కారం అదే అయితే
విస్తుపోవటం విసిగిపోవటం తప్ప
ఏముంటుంది వేరే

పాతదాని పట్ల పాతుకు పోయిన మోజు
తాజా దనాన్ని తన్ని పారేస్తుంది
మొహం మొత్తితే తప్ప
మోహం పోదు పాతదాని మీద
ఇట్లా కాదు
ఈ ఆకారం ఇక తృప్తిని తేదు
కుబుసం విడిచాక
కొత్తచర్మంతో నిగనిగలాడినట్టు
తలపులన్నీ
తళ తళ లాడాలి వినూత్న విన్యాసంతో
నలుగు పిండితో రుద్దుకునీ రుద్దుకునీ
కడిగేసుకున్నట్టు
నవ మోహన రూపంతో
వ్యక్తం కావాలి నలుగురికీ

భూమి పొరల్లోంచి
కొత్త నీరు పైకి ఎగజిమ్మినట్టు
తాజాదనంలో తడుస్తూ
రోజూ తన్మయత్వంలో మునగాలి

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top