You Are Here: Home » భవిత » విద్య » కేస్‌స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి?

కేస్‌స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి?

పేపర్- 1, 2: సైకాలజీ

మనోవిజ్ఞాన శాస్త్రం-
స్వభావం, పద్ధతులు

1. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి చేసే పరిశోధనలో స్వతంత్ర చరం?
1) వయసు 2) ప్రజ్ఞ
3) సాంఘిక ఆర్థిక స్థితి 4) విద్య

2. వీటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం?
1) స్తబ్దమైంది 2) స్థిరమైంది
3) గతి శీలమైంది 4) అచేతనమైంది

3. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల ను మూడు సమూహాలుగా విభజించాడు. వీటిలో మొదటి సమూహానికి హోంవర్క్ చేస్తే బహుమతి ఇస్తానని తెలిపాడు. రెండో సమూహానికి హోంవర్క్ ఇచ్చాడు. కానీ దండన/ బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహానికి ఇంటి పని చేయక పోతే దండిస్తానని చెప్పాడు. ఇందులో నియం త్రిత సమూహం?
1) ఒకటోది 2) రెండోది
3) మూడోది
4) ఒకటి, మూడు సమూహాలు

4. నవజాత శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి?
1) పరిశీలన 2) అంతః పరీక్షణ
3) వ్యక్తి అధ్యయన 4) ప్రయోగాత్మక

5. ‘నిన్నటికంటే ఈ రోజు పాఠం బాగా అర్థమైందని’ టీచర్‌తో విద్యార్థి చెప్పిన ప్పుడు ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి?
1) పరిశీలన 2) అంతః పరీక్షణ
3) వ్యక్తి అధ్యయన 4) ప్రయోగాత్మక

6. వ్యక్తి అధ్యయనంలో అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయో గించాల్సిన పరిశీలన పద్ధతి?
1) సంచరిత 2) అసంచరిత
3) నియంత్రిత 4) అంతఃపరిశీలన

7. విద్యామనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకందించిన విషయం?
1) ఆశయాలు ఎందుకు నిర్ణయించుకోవాలి
2) ఏ ఆశయాలు నిర్ణయించుకోవాలి
3) ఎలా లక్ష్యాలు సాధించాలి
4) ఏ పాఠ్యాంశాలు బోధించాలి

8. ‘పని చేయని, పని చేసే తల్లులు-వారి పిల్లల సాధన’ అనే అంశాల గురించి ప్రయోగ పూర్వకంగా ఫలితాలు తెలుసుకో వాలనుకున్న పరిశీలకుడు పరీక్షించాల్సిన స్వతంత్ర చరం?
1) పని చేయని తల్లులు
2) పనిచేసే తల్లులు 3) 1, 2
4) పనిచేసే తల్లుల పిల్లల విద్యాసాధన

9. కేస్‌స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి?
1) ప్రయోగ
2) అసంచరిత పరిశీలన
3) సమాంతర అధ్యయన (Cross Sectional)
4) కాలక్రమ (Longitudinal)

10. ప్రయోగ పద్ధతిలో వేర్వేరు వయసున్న శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతి?
1) సంచరిత పరిశీలన
2) అసంచరిత పరిశీలన
3) సమాంతర అధ్యయన (Cross Sectional)
4) కాలక్రమ (Longitudinal)

11. ప్రజ్ఞ ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం?
1) ప్రజ్ఞ 2) సృజనాత్మకత
3) ప్రేరణ 4) ప్రజ్ఞ, సృజనాత్మకత

12. సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం?
1) విద్యార్థుల సాంఘిక ఆర్థిక స్థితి
2) విద్యార్థుల వైఖరి 3) విద్యార్థుల సాధన
4) విద్యార్థుల అభిరుచి

13. బోధనానుభవం ప్రభావం బోధనా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాల నుకునే ప్రయోగంలో బోధనాభిరుచి ఏ చరం?
1) స్వతంత్ర 2) పరతంత్ర
3) మధ్యస్థ 4) అస్థిర

14. ‘నేను ఆందోళనలో ఉన్నానని’ పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి?
1) పరిశీలన 2) అంతఃపరీక్షణ
3) ప్రయోగ 4) వ్యక్తి అధ్యయన

15. ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం ఏ పరిశీలన?
1) నియంత్రిత 2) సంచరిత
3) ప్రయోగ 4) అసంచరిత

16. శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి?
1) ప్రయోగ 2) వ్యక్తి అధ్యయన
3) అంతఃపరీక్షణ 4) పరిశీలన

17. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది?
1) ప్రతిభావంతుడు
2) అభ్యసన వైకల్యత ఉన్నవాడు
3) సగటు ప్రజ్ఞ ఉన్న విద్యార్థి
4) చదువులో వెనకబడిన విద్యార్థి

18. గ్రామీణ/పట్టణ ప్రాంతాల ప్రభావం విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది?
1) వ్యక్తీకరణ నైపుణ్యాలు 2) అభిరుచి
3) కుటుంబం 4) విద్యార్హతలు

19. విల్ హెల్మ్ ఊంట్‌కు సంబంధించి సరికాని ప్రవచనం?
1) సంరచనాత్మక వాదానికి మూలపురుషుడు
2) సంసర్గవాదానికి మూలపురుషుడు
3) మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు
4) ప్రయోగాత్మక మనో విజ్ఞానశాస్త్ర పితామహుడు

20. హెర్బర్‌‌ట సోపానాల్లో సరైన వరుస క్రమం?
1) సన్నాహం, సంసర్గం, ప్రదర్శన, అన్వయం, సాధారణీకరణం, సింహా వలోకనం
2) సన్నాహం, ప్రదర్శన, అన్వయం, సంసర్గం, సాధారణీకరణం, సింహావ లోకనం
3) సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, సింహావలోకనం, అన్వయం
4) సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహా వలోకనం.

21. జీన్ పియాజె తన ముగ్గురి పిల్లల సంజ్ఞానా త్మక వికాసాన్ని అనేక ఏళ్ల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధనా పద్ధతి?
1) అంతఃపరిశీలన
2) సమాంతర (Cross sectional)
3) కాలక్రమ (Longitudinal)
4) వ్యక్తి అధ్యయన పద్ధతి

22. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థు లను రెండు సమూహాలుగా విభజించి, ఒక సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశ పెట్టాడు. రెండో సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగం అనంతరం ఫలితాలు విశ్లేషించాడు. ఇది ఏ రకమైన సమూహ నమూనా?
1) ఏక 2) నియంత్రిత
3) పరిభ్రమణ 4) ద్వి

23. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తూ విద్యార్థుల ఇంగితాలను గమనించడం ఏ పరిశీలన?
1) అసంచరిత 2) ప్రయోగ
3) సంచరిత 4) స్వయం

24. ప్రస్తుత నార్కోఅనాలిసిస్ పద్ధతికి మూలమైన వాదం?
1) గెస్టాల్ట్ 2) మనో విశ్లేషణ
3) ప్రవర్తన 4) సంరచనాత్మక

25. ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థచరం కానిది?
1) ఉద్యోగి వైఖరి 2) ఉద్యోగి సంతృప్తి
3) ఉద్యోగి అభిరుచి 4) ఉద్యోగి ప్రేరణ

సమాధానాలు
1) 3 2) 3 3) 2 4) 2 5) 2
6) 1 7) 3 8) 3 9) 4 10) 3
11) 3 12) 3 13) 3 14) 2 15) 4
16) 3 17) 3 18) 1 19) 2 20) 4
21) 3 22) 2 23) 3 24) 3 25) 2

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top