You Are Here: Home » దైవత్వం » కృష్ణ తత్వ దర్శనమిది!

కృష్ణ తత్వ దర్శనమిది!

ఓషోను నిర్వచించడమంటే ఇంద్రధనస్సును పట్టి బంధించడమే.. ఆకాశంలో మబ్బును పట్టుకోవడమే. ఆయనను నిర్వచించడం అంత తేలికైన విషయం కాదు. చేతిలో ఇసుకలా ఆయన వేళ్ళ మధ్య నుంచి జారిపోతుంటాడు. నిర్వచనమనే సూర్య కిరణంతో మెరిసే మంచు కరిగినట్టుగా ఆయన మేజిక్‌ మాయమౌ తుంది. తన జీవితకాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆచార్య రజనీష్‌ ఆధ్యాత్మిక మార్గమూ అంతే సంచలనం.

imgaప్రధానంగా చెైతన్యం, దయ, సృజనాత్మకత అనే అంశాల ఆధారంగా ఉండే ఆయన తాత్వికతను ఆ లక్షణాలు కలిగిన పట్టుకోవడం తేలిక. ఈ లక్షణాలు గల వారు లోతులను చూడగలడంటాడు ఓషో. ఆత్మ చేతన, మేధో స్థాయి, విశ్వాసం, పరిపూర్ణతావాదం అనేవి సృజనాత్మక జీవితానికి వ్యక్తిని దూరం చేస్తాయం టాడు. తాను అనేక అంశాలను సృజిస్తానని, అనేక మార్గాలను, పద్ధతులను వివరిస్తానని అయితే తమ మనసును తాకిన మారా ్గన్నే ఎంచుకోమంటూ ఎంపిక అవకాశాన్ని శిష్యులకే వదిలిపెట్టిన ఓషో కృష్ణుడి దగ్గర నుంచి బుద్ధుడి వరకు, జీసస్‌, మహమ్మద్‌ , మహావీర తత్వాలపెై వ్యాఖ్యానం చెప్పారు. మంత్ర, తంత్ర, ప్రేమ వంటివన్నీ ఆయన ఉపన్యాసాలలో ప్రధాన వస్తువుగా కనిపిస్తాయి.

ఎక్కడ బుద్ధుడు అంతమ వుతాడో అక్కడ కృష్ణుడు మొదలవుతాడంటూ కృష్ణ తత్వంపెై ఆయన ఇచ్చిన ఉపన్యాసాల సంకలనాన్ని ఇందిర, గోపాలప్ప సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ఎంతో రమ్యంగా అనువదించారు. ఫ్రాయిడ్‌ ఆవిష్కరణల వెలుగులో వచ్చిన అవగాహనకు, కొత్త చెైతన్యానికి కృష్ణుడికి ఒక్కడికే సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన మానవ చరిత్రలో కృష్ణుడు మాత్రమే అణచి వేతలకు, దమనానికి వ్యతిరేకి అంటాడు ఓషో. అందుకే ఈ పుస్తకానికి సరిగ్గానే భవిష్యత్తు కృష్ణుడిదే అని పేరు పెట్టారు. సహజ ప్రవృత్తులను, భావావేశాలను అణచివేయడం ద్వారా మనిషి ఆత్మహత్యా సదృశ్యుడెై తనను తానే చంపుకు న్నాడు అని ఆవేదన వ్యక్తం చేస్తాడు.

కృష్ణుడు గురించి మనం చెప్పగలిగినదంతా అతను ప్రేమపూరితడని మాత్ర మే. అతనే ప్రేమ. అందువల్ల నీవతని వద్దకు వెళ్ళినప్పుడు అతని ప్రేమ సులువుగా లభిస్తుంది. నిన్ను అతను ప్రేమిస్తున్నాడని, అతను నీతో అనుబంధంలో ఉన్నట్టు అనిపిం చవచ్చు. కానీ ఇది నిజం కాదు. అతను ప్రేమగా ఉంటాడు. నీవు అతని సమక్షంలో ఉన్నప్పుడు అతని ప్రేమ నీపెై వర్షిస్తుంది. అందుకే నీవు నీ వెైపు నుంచి కృష్ణుడితో ప్రేమలో ఉండవచ్చు, కానీ తన వెైపు నుంచి కృష్ణుడు నీతో ప్రేమలో ఉం డడు. కృష్ణుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు అనుకోవచ్చుగాక.

అతనే ప్రేమ. అతని ప్రేమ అడిగిన వారందరికీ అందుబాటులో ఉంటుంది అంటూ ఆయన ప్రేమ తత్వ రహస్యపు ముడిని విప్పుతాడు ఓషో. అందుకే పురాణాలలో చెప్పే గోపికలు, అష్ట భార్యలు, 16వేల మంది ఇతర భార్యలు అంత ఆనందంగా ఉండగలిగారేమో! ఒక్క రాధ మాత్రమే ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది. కృష్ణుడే ప్రేమంటూ అతడి ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించిన ఓషో కృష్ణుడికి, బుద్ధుడికి, మహావీరుడికి మధ్య ఉన్న భేదాలను కూడా వివరిస్తారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత నీవు సాధించిందేమిటి అని ఎవరో ప్రశ్నించినప్పుడు, ఆయన నాకు కొత్తగా తారసపడింది ఏమీ లేదు. అది అక్కడ ఎప్పుడూ ఉంది. అణుమాత్రం తక్కువగానీ, ఎక్కువగానీ లేదని సమాధానం చెప్పాడుట. ఏదెైతే బుద్ధుడు చివర్లో చెప్పాడో కృష్ణుడు దానిని ఆరంభంలోనే చెప్పాడంటాడు ఓషో.

అందుకే కృష్ణుడు ఇలా అంటాడుట- ఎక్కడికయినా వెళ్ళడంలో అర్థమేముందు? నీవు ఎక్కడికి వెళ్ళదల చుకున్నావో అక్కడ నీవిప్పటికీ ఉన్నావు. నీవు నీ ప్రయాణంలో దేనిని మజిలీ అని అనుకుంటున్నావో, వాస్తవానికి నీ గమ్యం అదే- ఏ దిశలోనయినా పరుగెత్తవలసిన పని ఏమిటి? నీవిప్పటికే చేరుకున్నావు- అంటాడు. బుద్ధుడు, మహావీరుడు అరవీర శ్రమతో సాధించిన దానిని ఎలాంటి ప్రయత్నమూలేకుండా అప్పటికే కృష్ణుడు కలిగి ఉన్నాడు. అతడు సర్వకాలాల్లోనూ జ్ఞానిగా ఉన్నాడు. అలాంటప్పుడు సాధన ఎందుకు? కృష్ణుడికి ఇతరులకు మధ్య ఉన్న ప్రాథమికమైన తేడా ఇదే అంటాడు. కనుకే కృష్ణుడి దార్శనికతలో ఏ మాత్రం అహం ఉండే అవకాశం లేదంటూ ఆయన నిరహంకారి అనే విషయాన్ని తేల్చేశాడు.

జీసస్‌, ‘బలహీనులు ఆశీర్వదింపబడతారు, ఎందుకంటే వారు భూమికి వారసులు’ అన్నాడు. ఇది అతి వెైరుధ్యమైన మాట. ఎవరెైతే అణకువగా ఉంటారో వారు భూమిని సొంతం చేసుకుంటారు. అయితే ఇది సత్యం. కృష్ణుడు గెలవాలనే ఆరాటం లేనందువల్లే గెలుస్తాడు. నిజానికి పసివాడికి గెలవడం గురించి పట్టిం పు లేదు, అతనికి ఆటను ఆడడంలో మాత్రమే ఆసక్తి. గెలవాలనే ఆశ, విజయకాంక్ష మనిషి జీవితంలో తర్వాత వచ్చిన మార్పు. అతడి చిత్తం వ్యాధిగ్రస్థమయిన తర్వాత వచ్చింది అంటూ గెలుపును ఆశించనివాడే గెలుస్తాడు అంటూ ఓషో వివరిస్తాడు. అందుకే గెలవాలి అనే మీ ఆశే మీ ఓటమిగా మారుతోంది అంటాడు. అత్యంత ఆసక్తిదాయకంగా సాగిన కృష్ణ తత్వ విశ్లేషణను అనువదించిడంలో ఎటువంటి దోషాలూ లేనప్పటికీ ముద్రారాక్షసాలు పంటికింద రాళ్ళలా తగలడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. భవిష్యత్తు
కృష్ణుడిదే రెండవ భాగం ఇది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top