You Are Here: Home » ఇతర » కృషి ఫలితానికి జిరాక్స్‌ అన్నె ఎం. ముల్కాయ్‌

కృషి ఫలితానికి జిరాక్స్‌ అన్నె ఎం. ముల్కాయ్‌

ఏదేశస్తురాలైనా, ఏమతమైనా ఉన్నతాశయాలు కలవారికి ఇవి ప్రధానం కావు. వారు ముందుతరాలకి ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. అందులోను మేధస్సుతో శక్తివంతంగా పనిచేసి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించే మహిళలు ఈనాడు ప్రపంచ ప్రజల దృష్టిలో ఆశ్చర్యాన్ని నింపుతున్నారు. వారు పనిచేసే కార్యాలయాన్నైనా, కర్మాగారాన్నైనా, సేవాసంఘాలనైనా తమ తెలివితేటలతో అత్యున్నత స్థారుుకి చేరుస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్‌ రంగంలో అలా ఉండటం అంత తేలిెకైన విషయం కాదు. మహామహా మేథావులే తల్లకిందులవున్న ఈ సమాజంలో మహిళలు వారి ప్రతాపాన్ని చూపించి ఒక చాలెంజ్‌గా నిలుస్తున్నారు. అటువంటి వారిలో అన్నె ఎం ముల్కాయ్‌ ఒకరు.

ప్రొఫైల్

పేరు 		: అన్నె ఎం. డొలన్‌
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 21, 1952
పుట్టిన చోటు : యునైటెడ్‌ స్టేట్స్‌
విద్యార్హతలు : బి.ఎ. (ఇంగ్లీష్‌, జర్నలిజం)
మేరీ మౌంట్‌ కాలేజ్‌
పనిచేసే కంపెనీ : జిరాక్స్‌ కార్పరేషన్‌
పదవులు : చైర్‌వుమెన్‌, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌,
బోర్డ్‌ మెంబర్‌ ఆఫ్‌ కాటలిస్ట్‌, సిటీగ్రూప్‌,
ఫ్యూజీ జిరాక్స్‌,
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌,
టార్గెట్‌ కార్పొరేషన్‌

Uawన్యూయార్క్‌లోని మేరీ మౌంట్‌ కాలేజీలో జర్నలిజంలో డిగ్రీ పొందిన ఈమె 1976లో ఫీల్డ్‌ సేల్స్‌ రిప్రజంటే టివ్‌గా జిరాక్స్‌ సంస్థలో చేరింది. అప్పటికే ఈ కంపెనీకి పోటీగా ఉన్న కెనన్‌, హెచ్‌పి సంస్థలను అధిగ మించేందుకు జిరాక్స్‌ కంపెనీ రీసెర్చ్‌ బడ్జెట్‌ని 1.5 బిలియన్‌ డాలర్లకి పెంచడానికి ఎంతో కృషిచేసింది. 1997లో ఛీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గాను, 1998లో సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్‌గాను పదవీ బాధ్యతలు చేపట్టింది. వైస్‌ ప్రసిడెంట్‌గా ఉన్నా కూడా వినియోగదారుల అభివృద్ది కార్యకలాపాలపై కూడా తన దృష్టిని సారించి, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, చైనా వంటి దేశాల్లో కూడా అమ్మకాల శాతాన్ని పదింతలు చేయగలిగింది. దానితో 2001లోనే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా ఆహ్వానింప బడింది. అయితే ఈమె పదవీ కాలంలో 30% శ్రామిక బలాన్ని, బలగాన్నీ తగ్గించి డెస్క్‌టాప్‌ భారాన్ని మరింత తగ్గించింది. 2001, ఆగస్ట్‌ 1న ‘సిఇవో ఆఫ్‌ జిరాక్స్‌’గా పేరు గడించింది.

అదే గమనంలో ముల్కాయ్‌, మానవ వనరుల శాఖ ఉపాధ్యక్షురాలిగా, ఛీ్‌ఫ్‌ స్టాఫ్‌ ఆఫీసరుగా, సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్‌గా ఎదుగుతూ అతి స్వల్పకాలంలోనే అంటే 2002 జనవరి 1న చైర్మన్‌గా ఆ కంపెనీ పగ్గాలు తన చేతిలోకి తీసుకుంది. అప్పటివరకూ 8.25 శాతంగా ఉన్న అమ్మకాల్ని 10.05 శాతానికి పెంచింది. ఈమె సిఇవోగా పదవీ విరమణచేస్తున్న సమయానికి 6.82% వృద్ది రేటు మాత్రమే ఉండేది. అంతేకాకుండా ఈమె అదనంగా ‘కేటలిస్ట్‌, సిటీగ్రూప్‌ ఐఎన్‌సి, ఫ్యూజీ జిరాక్స్‌ కంపెనీ లిమిటెడ్‌, టార్గెట్‌ కార్పొరేషన్‌’ కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో మెంబర్‌గా కూడా కొనసాగుతోంది. ఒక సమయంలో జిరాక్స్‌ సంస్థలన్నీ కుప్పకూలుతున్న పరిస్థితుల్లో వీటన్నిటినీ కేవలం తన ప్రజ్ఞాపాటవాలతోనే నిలబెట్టింది. 2008లో ‘సిఇఓ ఆఫ్‌ ది ఇయర్‌’గా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మేగజైన్‌కి ఎంపికయ్యింది.

ముల్కాయ్‌ కేవలం సంస్థ అభివృద్ధినే కాకుండా, మానవ వనరుల అభివృద్ధి శాఖలో కూడా వైస్‌ ప్రసిడెంట్‌ గా, నష్టపరిహారాలు, ప్రయోజనాలు, మానవ వనరుల అభివృద్దికి వ్యూహ రచన, కార్మిక సంబంధాలు, యాజమాన్యాభివృద్ది, ఉద్యోగులకు శిక్షణ విషయాల్లో సమతౌల్యంగా ఎంతో ప్రగతిని సాధించింది. ఇన్ని మహోన్నత శిఖరాలు అధిరోహించిన ముల్కాయ్‌, 1952లో న్యూయార్క్‌నగరంలో ఉన్న రాక్‌వెల్లి సెంటర్‌లో జన్మించింది. మేరీ మౌంట్‌ కాలేజీలో చదువుతూ, ఇంగ్లీష్‌ లిటరేచర్‌లోను, జర్నలిజంలోను బి.ఎ డిగ్రీ చేసింది.

పత్రికల అభిప్రాయాలు
Anne5‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక 2005లో అత్యంత శక్తి వంతమైన 50మంది మహిళల జాబితాలో ఈమెని చేర్చింది. అలాగే ఫోర్బ్‌‌స మాగజైన్‌ కూడా 2005లోనే, అత్యంత శక్తివంతమైన అమెరికన్‌ మహిళల జాబి తాలో ముల్కాయ్‌ని ఆరవస్థానంలో నిలబెట్టింది. ఇదే ఫోర్బ్‌‌స పత్రిక 2008లో ఈమెకు 15వ స్థానం ఇచ్చింది. ఇక యూ.ఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌లో అమెరికా బెస్ట్‌ లీడర్స్‌లో ఒకరిగా నమోదు చేసింది. ఇన్ని ఘనతలు సాధించిన అన్నె ఎం. ముల్కాయ్‌ నేటి కార్పొరేట్‌ ఉద్యోగినులకే కాకుండా చదువు కుంటున్న యువతకి కూడా ఆదర్శప్రాయురాలు అనే చెప్పవచ్చు. ఏదేశం వారికైనా కష్టించి పనిచేయగలి గితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నది నిజం.కేవలం కలలు కంటూ కూర్చుంటే, విజయాలు అరచేతిలోకి రావు. అందుకు తగిన పరిశ్రమ ఎవ్వరైనా చేసి తీరవలసిందే…

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top