You Are Here: Home » సఖి » రుచి » కూరలో ఉప్పు ఎక్కువైతే…

కూరలో ఉప్పు ఎక్కువైతే…

Tips

  • కూరలో ఉప్పు ఎక్కువెైతే కంగారు పడకుండా ఉండు చెంచాల పొలమీగడ కలిపితే చాలు. ఉప్పు తగ్గడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది
  • కుటుబంలో చాలా మంది ఉన్నప్పుడు గ్యాస్‌ మీద నీళ్లు కాచుకో వడం కన్నా, హీటర్‌ పెట్టించుకుంటే గ్యాస్‌ ఆదా అవుతుంది.
  • నిమ్మకాయను ముక్కలు కట్‌ చేసి రసం తీసే ముందు కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో వేసి పెట్టిండి ఇలా చేస్తే నిమ్మకాయ నుంచి రసం పిండటం సులువవుతుంది. ఎక్కువ రసం వస్తుంది కూడా.
  • చపాతీ పిండి బాడగా కొంచిఎం మిగిలిపోతే నిల్వ చేసే ముందు దానిపెై కొంచెం నెయ్యికానీ నూనెగానీ రాస్తే త్వరగా ఎండిపోదు.
  • అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు స్నేహితులు కలిసి హోల్‌సేల్‌ దుకాణాల్లో నెలవారీ సరుకులు భారీగా కొనుక్కుని తరువాత కావలసినంత విభజించుకుంటే ఖరీదు తగ్గుతుంది.
  • పెరుగు గిన్నెలో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచితే పెరుగు పులవదు మజ్జిగ చాలకపోతే గోరువెచ్చని పాలలో కొంచెం ఉప్పువేసి నిమ్మరసం పిండితే అది మజ్జిగలా తయారవుతుంది.
  • వాడిపోయిన, పసుపు రంగులోకి వచ్చిన కూరల ను కొనకూడదు. ఎందుకంటే వాటిలో, వాటికి సహజంగా వుండే సువాసన వుండదు. ఎక్కువగా నీటితో తడిపి బరువెక్కిన కట్టలూ తీసుకోకూ డదు. నీరెక్కువగా వుండటం చేత,అవి త్వరగా పాడెైపోతాయి. ఇంటికి తెచ్చాక వెర్లు,వాటి మధ్య లో వుండే గడ్డీ, వగెైరా తీసేశాక, కాయితంలో చుట్టి నిలువ చేసుకోవాలి
  • స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాలముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసు పు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
  • విటమిన్‌ ‘ఈ’ నూనెతో చర్మంపెై మసాజ్‌ చేయండి. ఇలా చేశాక 20 నిముషాల తరువాత స్నానం చేస్తే చర్మం పగలకుండా ఉంటుంది. చర్మం కాంతివంతవం అవుతుంది.
  • రాత్రి నిద్రపోయే 30 నిముషాలకు ముందుగా పాదాలకు కొంచెం కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసి 15 నిముషాల తరువాత గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు, షాంపు వేసి 20 నిముషాల పాటు పాదాలు తడిసేలా ఉంచి తరువాత శుబ్రం చేసుకోవాలి.
  • జిడ్డుగా ఉండే పాత్రలు శుభ్రం చేసే ముందు ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో పాత్రపెై రబ్‌ చేయాలి. తర్వాత పేపర్‌తో పాత్రను తుడవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు పోతుంది. చాలా సులభంగా పాత్ర శుభ్రం అవుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top