You Are Here: Home » చిన్నారి » కథలు » కూట సాక్ష్యం

కూట సాక్ష్యం

Sunday-Kathaదుష్టుడికి దూరంగా ఉండాలని అంటారు పెద్దలు. అలాగని కుళ్ళిపోతున్న సమా జాన్ని కూకటివేళ్ళతో సహా పైకి లాగి బాగుచే యాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక్కరివల్ల అయ్యే పనీకాదు. దమననీతి సర్పత్రా లోకంలో రాజ్యమేలుతోంది. ఇంకా చెప్పాలం టే నలుగురితోటి నారాయణా, కులంతోటి గోవిందా అంటారు. ఇవి సామెతల్లా వినడానికి బాగుంటాయి. మంచికైతే ఒప్పుకోవచ్చ. కానీ కలియుగంలో ధర్మార్ధాలే విపరీతాలై, శబ్ద విప రాణామాలకు గురికాక తప్పులేదు. ‘పదుగు రు అడిన మాట పాడియై ధరజిల్లు’ అని సరి పెట్టుకుని అన్యాయం, అక్రమం, అవినీతి, అస త్యం లాంటి వాటితోనే కూటనీతి వియాన్ని సాధించడం, మానవత్వాన్ని మట్టు పెట్టడం. దీన్ని పురోగమనమనానలో తిరోగమనమనా లో విజ్ఞులే తేల్చి చెప్పాలి.

మంచి ఉద్దేశ్యంతోనే ఆ విద్యాసంస్థను స్థాపిం ప జేసి ఉండొచ్చు. కానీ ప్రయివేటు సంస్థ లంటే మేనేజ్‌మెంట్‌ పాకెట్‌లో కీలు బొమ్మ ల్లాంటివి. కొన్నింట్లో మంచికి మంచివి, చెడ్డకు చెడ్డవి లేకపోలేదు. అన్నింటినీ అకే త్రాసులో వేసి తూచలేం. ప్రభుత్వ విద్యాసంస్థలు కొన్ని ఉన్నత ప్రమాణాలతో జగతికే జ్ఞాన జ్యోతులై వెలిగే ఎన్నో సంస్థలున్నాయి. నలుగురున్న చోట మంచీ చెడ్డలుండడం ఎంత సహజమో పదుగురున్న చోట అంతే సహజం పెరుగుముంతలపాడులో ఓ సహకారి జూనియర్‌ కళాశాల భారతదేశానికి ముమ్మూర్తులా ప్రతిబింబిందని చెప్పొచ్చు. ప్రిన్సిపల్‌ బాల సాధుపుంగవుడు, మిగిలిన వాళ్లలో వృద్దనారీ ప్రతివ్రత అన్నట్లుగా పెద్దతరం లెక్చరర్లు ఏ కొద్దిమందో తప్ప కుర్రకారంతా చాలా యాక్టివ్‌గా ఉంటారనేది వేరే చెప్పనరసవరం లేదు.

చిత్తకార్తి చిదానందం ఉరఫ్‌ ‘చిచి’ ఇంగ్లీషు బోధకుడు. యోగిబాబు తెలుగు మాస్టారు దొరస్వామి హిస్టరీ లెక్చరర్‌ కుశాల్రావు పాలిటిక్స్‌, సంగమేశం కెమిస్ట్రీ, వైద్యనాధ్‌ ఫిజిక్స్‌, వెంకటాచలం మాథ్స్‌. ఇలా తలో సబ్జెక్టులో ఎక్స్‌పర్ట్‌‌స. నిజానికి చదువుకుంటు న్నప్పుడు వాళ్లు ఏ కాస్తా కూస్తో సరైన దారిలో నుడుచుకుని ఉంటారు. అదిగో పులి అంటే ఇదిలో తోక అనడం. కుర్రాళ్లలో గొడవలు సృష్టించి క్లాసులను బాయ్‌కాట్‌ చేయించడం, ప్రినిపాల్‌కి బీపీ తెప్పించడం లాంటివి చేస్తుంటారు. దానికితోడు కులమత వర్గాలు నిప్పుకు గాలి తోడైనట్లు అడపదడప వస్తున్నాయి. పదిమంది దుర్మార్గుల్లో మంచివాడు ఉండ లేదు. అలాగే పాపం కొత్తగా వచ్చిన యోగి తన పనేదో తను చూసుకుపోతుంటే ఆది కొం తమందికి కంటికింపుగా తయారైంది. పిల్లలు ఈ స్టాఫ్‌ దుష్టచతుష్ణయం అనే బిరుదుని చిచి కి, సంగమేశానికి కుశాల్రావుకి, దొరైకి తగిలిం చారు. ఏదో కంగా అందరిమీద బురదజల్లడం వారికి పరిపాటి. తేలు అపకారం చేయకపో యిన వచ్చేపోయే వాళ్ళని కుట్టినట్లుగా చేస్తుం టుంది వీళ్ళ బ్రతుకులు అంతే.

నాలుగు నెలలయ్యేటప్పటికీ యావత్‌ ట్రబుల్‌ వచ్చి యోగి యూరినల్స్‌ వెళ్ళి ఎక్కువసేపు ఉం డడం వాళ్లకళ్లలో పడింది. ఇంకేం గొరంతల్ని కొండంతల్ని చేశారు. రెండో రోజుకల్లా యోగి కి ఎయిడ్స్‌ ఉందని అతడు మద్రాసులో సీక్రెట్‌ గా వైద్యం చేయించుకొస్తున్నాడని అందరూ వెళ్లే దాన్లోకి వెళ్ళనివ్వకుండా అతనికి ప్రత్యే కంగా యూరినల్స్‌ ఏర్పాటు చేయించుకుని ప్రిన్సిపల్‌ గారికి, పాలక వర్గానికి అర్జీ పెట్టు కున్నారు. యోగికి ఆ వార్త తెలిసి బాధపడ్డారు. ఆ టాక్‌ చేసింది ఎవరికి పుట్టిందో తెలియని చిచి ఎక్కడినుండి వచ్చాడో, ఏ ప్రాంతం వాడో తెలియని కుశాల్రావు, దొరై, సంగమేశ వాళ్ల దగ్గరికెళ్ళి మీకు నేనేం అన్యాయం చేశానంటూ వాపోయాడు. పగలపడి నవ్వలేదు కానీ ‘‘అబ్బే మాకే పాపం తెలీదు’’ అంటూ తప్పించుకు తిరిగారు. ‘‘మాకేం పనిలేదా’’ అంటూ బుకా యించారు.

ఉద్యోగం వదిలేసి పోదామనిపించింది. ఈ విషయమే బంధువులకు చెబితే ‘‘ఆ వెధవ నకు దడిసి వెళ్ళిపోతావా? రోజులు నిండ నియ్యి వాళ్ల పాపాన వాళ్లే పోతారు’’ అంటూ ధైర్యం చెప్పారు. రెండు వారాలు సెలవు పెట్టి అస్పత్రిలో జాయినై ఆపరేషన్‌ చేయించుకుని అదే సర్టిఫికెట్‌ ప్రిన్సిపల్‌కి ఇచ్చాడు. దానిని బట్టి ఇది కేవలం దుష్టచతుష్టయం పుట్టించిన ‘గాసిప్‌’ అని విజ్ఞాలకు, విద్యాధికులకు తెలిసి పోయింది. చిత్తశుద్ధిలేని చిదానందం ఒకసారి సాని కొంపకెళ్లి తిరిగి సైకిల్‌ మీదొస్తుంటే ఓ కొంటే కుర్రాడు కావాలనే టక్కర్‌ కొట్టాడు. వాణ్ణి చూసిన అతగాడు. అనవాలు పట్టినా నోరు మూసుకుని తల వంచుకుని ఇంటికి వచ్చాడు. మార్నాడు అయ్యాగారి లీలలు క్లాసులో బోర్డుల మీదకెక్కాయి. యోగిబాబు వీడికీశిక్ష సరిపోతుందని అకున్నాడు.

ఒక రోజు యోగి క్లాసులో ఉండగా, తన కులం ఇంకా చెప్పాలంటే తెచ్చిపెట్టుకున్న మతం వాళ్ళతో గలాబా చేయించి అతగాణ్ణి అన్‌ పాపులర్‌ చేయించాలని చిత్తకార్తె చిదానందం ప్రయత్నించాడు. దాని పర్య వసానంగా ఇంట్లో దొంగతనం జరిగి కట్టు బట్టలతో మిగిలాడు. కుశాల్రావునే దరదరద చేసిన పాపాలెక్కువై పెళ్ళానికి కీళ్లవాతం వచ్చి కైలాసానికి వెళ్లింది. వీళ్లిద్దరూ జరిగిందానికి సిగ్గుపడకుండా శాడిస్టులై ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు సైతానుల్లా కనిపిఊ్త దుర్మార్గాలు దొరకని అన్యాయాలు చేస్తూ అనందించడం మొదలు పెట్టారు. ఆ శుంఠ ద్వయానికి తోడు చోటా దరదరద దొరై సంగమేశాలు బయల్దేరాడు. ఏకు మేకైనట్టుగా నోటికి అదుపూ ఆజ్ఞలు లేకుండా అందర్నీ కామెంట్‌ చెయ్యడం మొదలు పెట్టారు. వాళ్ళకి కులం సపోర్టు ఉందనే ధైర్యం ఎక్కువ.

నరుడికి నాలుగు కాలాలంటారు. పాపం దొరై తమిళుడైనా తెలుగు వాడిలా చెలామణి అయి పోవడానికి కారణం ఏ ఎండకాగొడుకు పట్ట డం. ఉన్నవీ లేనివీ ప్రిన్సిపల్‌ దగ్గరకి చేరేస్తూ ఆయన ప్రాపకం కోసం తంటాలు పడుతుం టాడు. అటువంటి అతని కుమారుడు సరదా గా ఫ్రెండ్స్‌తో సముద్రస్నానానికి వెళ్ళి నీట్లో మునిగి మాయమయ్యాడు. కుళ్లి కుళ్లి ఏడ్చా డు. సంగమేశానికి అమ్మ కొడుకనే పేరుంది. వాడి తండ్రి డెబె్భైఏళ్ల ముసిలాడు. వీడు పుట్టే నాటికే చనిపోయాడు. సంగమేశం తల్లి తిరు గుబోతు వీడు మంచి జూదగాడు. ప్రతిదానికీ పందాలు కట్టి ఉన్నదంతా ఊడ్చి తగలేసే బడుద్ధాయ్‌.

సంగమేశం విజృంభించాడు. వీడికి తోడు చిత్తకార్తె చిదానందం కూడా తన శాడీజాన్ని పెంచేసుకున్నాడు. ఇద్దరూ రిక్షాలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. చిత్తకార్తె చిదానందానికి రెండు కాళ్లూ విరిడి అస్పత్రి పాలయ్యాడు. తలకు బలమైన గాయం అయ్యింది. సంగమేశానికి ముందు పళ్లు పూర్తి గా రాలిపోయాయి. యోగి వాళ్ళకు భగవంతు డు తగిన జాస్తి చేశాడని ఆ దుష్టులపై సింపతీ చూపించాడు. కానీ వాళ్లు జరిగిన పరాభవాని కి ఏ మాత్రం జంకలేదు. భయపడలేదు చిత్తకార్తె మాత్రం దూకుడు తగ్గించాడు.నాలుగేళ్లయ్యేతప్పటికీ వాళ్ల దుర్మార్గాలు పబ్లిక్‌కీ, విద్యార్థులకీ, మేనేజ్‌మెంటుకీ తెలిసి పోయాయి. తీసి పారేయడానికి పాత రోజులు కావే. బోలెడన్ని యూనియన్లు ఉన్నాయి. అవ న్నీ విరుచుకు పడతాయని ఎవరి పాపానికి వాళ్లని వదిలేశారు. చిత్తకార్తె చిదానందం చేసి న పాపాలకి, తిరిగిన తిరుగుళ్ళకీ లెప్రసీ సో కింది. ఎంత వైద్యం చేయించినా ఏదో జబ్బు వాణ్ణి కృంగదీస్తోంది. అయినా బుద్ధి రాలేదు.

దుష్ట చతుష్టయం గతంలో ఎంతో మంది కూటిలో కూటసాక్ష్యం చెప్పి కొలీగ్స్‌ని, పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టాడు. ఎన్నో పరాభవాలు పొందా రు. ఒకసారి ఒక రౌడీ మీ నలుగుర్నీ నరికి కాకులకీ, గద్గలకీ వేస్తానంటూ ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. దాంతో కాస్త జాగ్రత్త పడి ఎవరి గడపలో వారుండిపోయారు. చిత్తకార్తె చిదానందంబాబు తాగి తాగి వాగి వాగి కొలీగ్స్‌ చేత వీడో పెంటరా బాబూ! వీటి నోట్లో నోరు పెడితే ఆశుద్ధం మీద రాయి వేసినట్లే అని అం తా అతనికి దూరంగా వుండేవారు. అయినా అహం చావక లేకి గొప్పలు చెప్పుకుంటూ విర్రవీగడం మానలేదు మిస్టర్‌ చిచి. గోదావరి పుష్కరాలు వచ్చాయి. నలుగురూ ఒక కారేసుకుని చేసిన పాపాల్ని ప్రక్షాళణ చేసుకోవాలని, పుష్కరుణ్ణి అపవిత్రం చేద్దామని రాజమండ్రీ బయల్దేరారు. తెలిసి తెలిసి పుష్క రుడు మాత్రం ఈ దుష్టుల్నీ, దౌష్ట్యాల్నీ తనలో ఇముడ్చుకుంటాడా? ఆ ఏడాది అధిక వర్షాల కారణంగా వరద దూకుడు ఎక్కువగా వచ్చిం ది. ఎన్నాళ్ళకీ తగ్గుముఖం పట్టలేదు. అధికా రులు అప్రమత్తంగా ఉన్నా ఒకళ్లో ఇద్దరో అం దులో కొట్టుకుపోవడం జరుగుతూనే ఉంది. మిత్రులు వేమగిరి బ్రిడ్జి దిగి ధవళేశ్వరం వైపు తిరుగుతుండగా విశాఖ వైపు నుండి వస్తున్న లారీ టాక్సీని గుద్దుకుంది. డ్రైవర్‌ దిగి పారి పోయాడు. నలుగురూ పాపం పచ్చడి పచ్చడై పోయారు. చుట్టూ జనం మూగారు. తెల్లవారే సరికి వీరి ఫోటోలు పేపర్లలో పడ్డాయి.

– డా మంతెన సూర్యనారాయణరాజు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top