You Are Here: Home » సఖి » అందం » కురుల సొగసుకు

కురుల సొగసుకు

కురుల సొగసుకు

 

  • Lonతల బాగా ఆరే వరకు ఆరబెట్టాలి.
  • ఒక కప్పు ముజ్జిగలో నాలుగు చెంచాల మెంతులు వేసి రాత్రంతా నానపెట్టి ఆ మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి తలకు పట్టించుకోవాలి. పై విధంగా వారానికి మూడు సార్లు చేస్తే శిరోజాలు బిరుసెక్కకుండా ఉంటాయి.
  • తలకు క్యాబేజీ ఆకుల రసం పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే శిరోజాలు బాగా పెరుగుతాయి.
  • సాంబ్రాణి పొగవేసుకుంటే శిరోజాలకు మంచి సువాసన కలుగుతుంది.
  • స్వచ్ఛమయిన కొబ్బరినూనె కుదుళ్ళకి అంటేలా రాసుకోవాలి.
  • ఒకరి దువ్వెన ఒకరు వాడకూడదు.
  • తలస్నానానికి ముందు కొద్దిగా ఉసిరికపొడి నీటిలో నానబెట్టి వుంచి స్నానం పూర్తయ్యాక ఉసిరిక పొడి నానపెట్టిన నీటిని చిలకరించి పైతేటను తలపై పోసుకుంటే శిరోజాలు ఎర్రబడకుండా నిగనిగలాడతాయి.
  • కోడి గుడ్డు తెల్లసొనలో మెంతి పొడి కలిసేలా బాగా కలిపి తలకు రాసుకుని అరగంట తర్వాత తలంటుకుంటే చుండ్రు, దురదలు ఉండవు.
  • నిమ్మకాయ రసంలో తులసి, కర్వేపాకు కలిపి నూరి తలకు రాస్తే చుండ్రు, పేలు నశిస్తాయి.
  • శిరోజాలు పరిశుభ్రంగా ఉంచుకొని, వారానికి రెండుసార్లయినా అభ్యంగన స్నానం చేయాలి.
  • తలస్నానానికి షాంపులు కంటే కుంకుడు కాయ శ్రేష్టమయినది.
  • గోరువెచ్చని నీళ్ళతోనే తల స్నానం ఉత్తమం.
  • కొబ్బరినూనె వేడి చేసి అందులో నిమ్మరసం కలిపి దాన్ని తలకి పట్టించుకుంటే 5, 6 గంటలు ఆగి ఆ తరువాత శీకాయతో తలస్నానం చేస్తే వెంట్రుకల చివరలు చిట్లిపోకుండా ఉంటాయి.
  • శిరోజాలను సంరక్షించుకోవటంలో శ్రద్ధ వహించిన మీరు మరింత ఆకర్శణగా కనబడగలరు. శిరోజాలే స్ర్తీలకు అందం.
  • చిక్కు దువ్వెనతో ముందు చిక్కు తీసుకొని, తర్వాత మామూలు దువ్వెనతో దువ్వుకోవటం ద్వారా వెంట్రుకలు రాలటాన్ని అరికట్టుకోవచ్చును.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top