You Are Here: Home » సఖి » అందం » కురుల సంరక్షణ

కురుల సంరక్షణ

కురుల సంరక్షణ

 

Hair

  • కుంకుడు, సీకాయ లాంటి ప్రకృతి సహజ పదార్థాలు తలస్నా నానికి మంచిది.
  • క్రమం తపప్పక తలస్నానం చేయాలి.
  • 100 గ్రా గోరింటాకు, 25 గ్రా ఉసిరిక పొడిల మిశ్రమం కాఫీగానీ, టీ గానీ డికాషన్‌లో కలిపి ముద్దగా చేసి 12 గంటలసేపు ఇనప పాత్రలో వుంచి దానికి ఆవనూనె కలిపి శిరోజాల పాయలకు పట్టించి 3 గంటల సేపు వుంచి ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
  • తలస్నానం అయ్యాక టవల్‌తో నెమ్మదిగా తుడుచుకోవాలి.
  • పూర్తిగా తల ఆరకుండా తల దువ్వుకోకూడదు.
  • వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెన ముందుగా ఉపయో గించి తర్వాతనే మామూలు దువ్వెన వాడాలి.
  • తలస్నాన సమయంలో నెమ్మదిగా వేళ్ళను రుద్దాలి. అరచేతిలో బలవంత ప్రయోగించి రుద్ద కూడదు.
  • చుండ్రు ఉన్నవారి దువ్వెన ఉపయెగించకూడదు.
  • చుండ్రుతో బాధపడుతున్నవారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి.
  • శిరోజాల పోషణకు సమతుల్యమయిన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఐరన్‌,జింక్‌,మెగ్నిషి యం, పొటాషియం, బి కాంప్లెక్స్‌, విటమిన్‌లు ఉంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటికోసం తాజా ఆకుకూరలు, దోసకాయలు, రొట్టె, గుడ్లు, చేపలు ఆహారంలో ఉండాలి మరి.
  • వెనిగర్‌, నీరు సమపాళ్ళలో కలిపి మాడకి పట్టించి తలస్నానం చేయటం వల్ల చుండ్రు తగ్గుతుంది.
  • గోరింటాకు మెత్తగా రుబ్బి, తలకి పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు త్వరగా రాదు.
  • వెంట్రుకలు బాగా లాగి సట్టి ఉంచే హెయిర్‌ స్టైయిల్‌ మంచివికావు.
  • పదును ఎక్కువగా ఉన్న దువ్వెన వాడకూడదు.
  • చుండ్రు ఎక్కువగా ఉన్న వారు దువ్వెనలు, బ్రష్‌లు, వేడినీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.
  • కోడిగుడ్డులోని పదార్థము శిరోజాల మొదట్లో బాగా మర్ధనా చేసి ఆ పైకి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. 
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top