You Are Here: Home » చిన్నారి » కుక్కల్లో ఎన్ని జాతులున్నాయి?

కుక్కల్లో ఎన్ని జాతులున్నాయి?

మనం చాలా ఇళ్లల్లో పెంపుడు కుక్కల్ని చూస్తుంటాం. అవి చిన్న సైజు నుంచి పొడవుగా, పొట్టిగా, బుజ్జిబుజ్జిగా, ఎత్తుగా అనేక సైజుల్లో భిన్నంగా కనిపిస్తుంటాయి. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.కుక్కల్లో సుమారుగా 200 జాతుల దాకా ఉన్నాయి. అయితే ఇవన్నీ సహజంగా వచ్చినవి మాత్రం కావు.

విశ్వాంసం ఉన్న జంతువు కేవలం కుక్కలు మాత్రమేనని మనకు తెలిసిందే. అందుకే మనిషి పూర్వ కాలం నుంచి వాటిని మచ్చిక చేసుకుని పెంచసాగాడు. మనిషి అభిరుచి మేరకు నిరంతరం కొత్త వాటి కోసం అన్వేషించాడు. తొలిదశలో సంచారజీవిగా ఉన్న మానవుడు కుక్కలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కుక్కలతో సంపర్కం వలన కొత్తరకాల ఉత్పత్తి జరిగేది. ఆ విధంగా వేర్వేరు జాతులు ఉనికిలోకి వచ్చాయి. అంతేకాకుండా వీటిల్లో కొత్తకొత్త రకాలను కూడా మానవుడు సృష్టిస్తున్నాడు. ఈ తరువాత కాలంలో మానవుడు ఎప్పటికప్పుడు కొత్త జాతుల్ని రూపొందించటం మొదలుపెట్టాడు. ఈ రకంగా వేటకుక్కలు, ఆట కుక్కలు, కాపలా కుక్కలు, అల్సేషియస్ కుక్కలు ఇంకా అనేక పేర్లతో అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top