You Are Here: Home » చిన్నారి » కీటకాలను తింటారా?

కీటకాలను తింటారా?

కొన్నిదేశాల్లో రకరకాల కీటకాలను ఆహారంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు చైనాలో కొన్నిచోట్ల పట్టు పురుగులతో చేసిన ఆమ్లెట్‌లను, తేనెటీగల వేపుడును ఇష్టంగా తింటారు. ఒక్కోసారి కొంతమంది… వారు పురుగులను తింటున్నామని తెలియకుండానే వాటితో చేసిన ఆహార పదార్థాలను తినేస్తుంటారు. మెక్సికో ప్రాంతంలో కనిపించే ‘కోచినీల్’ అనే కీటకంతో ఎరుపురంగులో ఉండే కారమైన్ అనే ఫుడ్ కలర్‌ను తయారుచేస్తారు. కోచినీల్ శాస్త్రీయనామం డాక్టిలోపియస్ కాకస్.

ఇది కాక్టస్ మొక్కల మీద ఆధారపడి వాటిలో ఉండే తేమను, పోషకపదార్థాలను తింటూ బతుకుతుంది. ఈ కోచినీల్ కీటకాలను ఎండబెట్టి పొడిచేసి కారమైన్ అనే రంగు పదార్థాన్ని తయారుచేస్తారు. ఈ రంగును కోచినీల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనిని ఆహార పదార్థాలలో రంగుగానే కాకుండా సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top