You Are Here: Home » ఇతర » కింగ్‌ ఎన్విస్‌ కేశజాలం వేలం

కింగ్‌ ఎన్విస్‌ కేశజాలం వేలం

1fillerమనం వాడేసినవి పాతసామాన్లవాడికి అమ్మేసి, పావలాయో, రూపాయో వస్తే హమ్మయ్య అనుకుంటాం. అలాకూడా పనికిదారు అనిపిస్తే చెత్తకుండీలో పారేసి చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. కానీ ప్రముఖుల విషయంలో వాడిపారేసిన సామాన్లకి చాలా గిరాకీ ఉంది. పాతసామాను కొనేవాడు తట్టుకోలేడు. కోటీశ్వరులే ఈ విషయంలో పాతసామాను కొనేవాళ్ళుగా మారతారు. ‘వేలం’ వెర్రి అనే తెలుగు పదానికి సరిగ్గా సరిపోయే ఇంగ్లిష్‌ వర్‌‌డ క్రేజ్‌. కాని పాశ్చాత్య ప్రపంచంలో వేలంపాటలు కూడా వేలంవెర్రిగా జరుగుతాయి. సెలబ్రిటిస్‌ శరీరాల నఖశిఖ పర్యంతం, వాళ్లు ధరించే అండర్‌ గార్మెంట్స్‌ సైతం బిలియన్స్‌ డాలర్స్‌కి అమ్ముడెైపోతుంటాయి. ఇటీవల కింగ్‌ ఎల్విస్‌ కేశజాలం వేలం వేసి, ఒక ఆక్షన్‌ హౌస్‌ 15000 డాలర్స్‌ ఆక్షన్‌ ఫీజు 3000 డాలర్స్‌ కలుపుకుని వెరసి 18,000 డాలర్స్‌ సొమ్ముచేసుకుంది. చివరికి ఎల్విస్‌ కాఫిన్‌ మీజ చల్లిన గులాబీల ఎండురేకులు కూడా వేలం పాటలో, 1708 డాలర్స్‌ సంపాదించి పెట్టాయిట!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top