You Are Here: Home » ఇతర » కాళ్ళ కళకళలు

కాళ్ళ కళకళలు

హటాత్తుగా చూస్తే కాలికి లేసులు కుట్టుకున్నారా లేకపోతే ఇదో కొత్తరకం షూయా అనుకుంటాం. కానీ ఇది కేవలం ఆర్టే. ఏ కంప్యూటర్‌ సహాయం వినియోగించుకోకుండా, పెయింట్స్‌తో డిజిటల్‌ ఎఫెక్ట్‌ వచ్చేలా ఎంతో కళాత్మకంగా కాలి మీద ఈ ఆర్ట్‌ వేసింది ఛూ సాన్‌ షున్స్‌ అనే ఓ మహిళా కళాకారిణి.

29fillaఅందర్నీ ఆకట్టుకున్న ఈ డిజైన్‌ గురించి చెప్తూ, ‘నేను కేవలం ఆక్రిలిక్‌ పెయింట్స్‌నే వాడతాను. ఈ ఆర్ట్‌కోసం కంప్యూటర్‌నిగానీ, మరే ఇతర పరికరాలుగాని వినియోగిం చను. నేను అనుకున్న దానిలో మార్పు చేయడం కూడా ఉండదు. కానీ, రియల్‌గా కనిపిం చేలా ఎలా వేస్తే ఆ ఎఫెక్ట్‌ వస్తుందో ఆలోచిస్తాను. దానికి అమలుచేస్తాను. అంతే.’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇంత ఊహాత్మకంగా ఉండటం ఒక ఎతె్తైతే, దానిని మరింత అద్భుతంగా మలచడం మరో ఎత్తు. సృజ నాత్మకతని జోడించి వేసిన ఈ పాదాలని అందరూ ముద్దుపెట్టుకునేటంత సంబరంగా చూస్తు న్నారు. ఇంతకీ ఈమె ఒక యూనివర్శిటీలో ఎడ్మిషన్‌ కోసం వచ్చి తీరిక సమయంలో టైం వృధాచేయ కుండా తన పాదం మీద ఈ రకంగా ఆర్ట్‌ వేస్తూ కూర్చుందిట. మరి ఈ కళాత్మకత చూసి వెంటనే సీటిచ్చే ఉంటారు ఆ యూనివర్శిటీవారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top