You Are Here: Home » ఇతర » కాలుష్యానికి కళ్ళెం ఎలా?

కాలుష్యానికి కళ్ళెం ఎలా?

మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతావరణం, వివిధ రకాల మెుక్కలు , రకరకాల జంతువులు వీటన్నింటినీ కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతారుు. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఒకొ్కక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. మెుక్కలు సూర్యుని శక్తి వలన కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసు కుంటారుు. భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నారుు .

అన్ని జీవరాశులకు ప్రధానంగా ఆహారం మెుక్కల నుండి అందుతోంది. జీవుల మధ్య ఉండే పర్యావరణ సంబంధాల్లో ఇటీవలి కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నారుు. మన దేశంలో హరిత విప్లవం తర్వాత వ్యవసాయం రంగంలో పంట దిగుబడి పెంచేందుకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం చాలా ఎక్కువైంది. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది కానీ గాలి, నీరు, నేల కలుషితమైపోయారుు. ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు.

కాలుష్యం అంటే…
పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రిములకు అస్థిరత, అసమానత. హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్య టాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం అనేది రసాయనిక పదార్థా లు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాల లో ఉండవచ్చు. కలుషితాలు, కాలుష్య కారక పదార్థాలు బహ్య పదార్థాలు లేదా శక్తులు లేదా సహజ సిద్ధమైనవి,

జనాభానే సమస్యా?
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఒక ప్రధా న సమస్యగా తయారెైంది. సౌకర్యాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాధమిక సౌకర్యాలు అందరికీ అందడం లేదు. అపరిశు భ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజు రోజు కు దారిద్య్రం పెరిగిపోతోంది. ప్రతి పనికి శక్తి (ఇంధన) వన రులు అవసరం. వంట పనుల కోసం, యంత్రాలు, వాహ నాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గృహాలలో విద్యుత్‌ అవసరాల కోసం ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం.

ఇంథన వినియోగం
P57ఆధునీకీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ పెరుగు తున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు (పెట్రో లియం సహజ వనరులు) థర్మల్‌ విద్యుత్‌, జల విద్యుత్‌ తగి నంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల ఇం ధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్‌ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడు తోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతెైనా ఉంది. శిలాజ ఇంధనాలు అం తం అయిపోకముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నా య ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడ మే గాక వృధాను అరికట్టాలి.

ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు
ఇటీవల ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వాడకం ఎక్కువయ్యింది.ఇవి పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముం దు ఏ విధంగా సరుకులు తెచ్చుకునే వారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి.

నీరు ముఖ్యమే
పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమి మీద మూడు వం తులు నీరు, ఒక వంతు భూ భాగం ఉన్న సంగతి తెలిసిందే. మూడు వంతులు నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే. ఒకే ఒక్క భాగం నేలలో మనం మూడు వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం.

గాలి కాలుష్యం
P65గ్రామీణ ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల కాలుష్యం ఎదురవుతుంటే పట్ట ణాలు, నగరా ల్లో ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుగోలు చేయడం ఫ్యాషన్‌ గా మారింది. కార్లు, స్కూటర్లు, రోడ్ల మీదకు కాలుష్యాన్ని మోసుకొస్తు న్నాయి. అలాగే విమానాలకు వాడే ఇంధనం అధిక కాలుష్యాన్ని పుట్టిస్తోంది. వాహనాలు, ఫ్యాక్టరీలు నుండి వెలువడే పొగ, చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాదకర మైన రసాయనాలు చేరుతున్నాయి. నేలపెైన, నీటిలో ఉన్న జీవరాశులు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి.

వృక్షో రక్షతి రక్షిత…
చెట్లను పెంచడం వల్ల ఈ వాయు కాలుష్య సమస్యను కొంత వరకూ నివారించవచ్చు. అలాగే పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంపెై అవగాహన కల్పించాలి.

నియంత్రణ ఎలా?
కాలుష్య దుష్ర్పప్రభావం నుండి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వివిధ చట్టాలను అమలు చేశాయి. ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నాలు అధి కంగా చేస్తున్నా అవేవీ అంతగా సత్పలితాలను ఇవ్వలేకపోతు న్నాయి. ప్రజలను ఇందులో భాగస్వాములుగా చేయకపోవ డం ఇందుకు ప్రధాన కారణం. గ్రీన్‌హౌస్‌ వాయువులు, భూతాపం కార్బన్డైయాఆక్సైడ్‌ కిరణజన్య సంయోగక్రియకి అవసరమైనప్ప టికీ కొన్నిసార్లు కాలుష్యంగా వ్యవహరితమవు తోంది. వాతావరణంలో పెరుగుత్ను ఈ వాయువు స్థాయిలు భూమి వాతావరణ పరిస్థితులపెై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

పరిశ్రమల్లో..
నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలెైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదులు తున్నాయి. ప్రతి పరిశ్రమ ముండి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటున్నవి. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువలతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికినీరుగా, కొన్ని ఘనరూపం లోనే విషరసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియ బెట్టినప్పుడు విషవాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ము కుంటున్నాయి. కాగా పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి.

శబ్దకాలుష్యం
P547ఆధునిక కాలంలో శబ్ద కాలుష్యం ప్రమాదకరంగా మారింది. వినికిడి పరిమితికి మించి వచ్చే ఏ శబ్దమైనా శబ్ధ కాలుష్యం క్రిందకే వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని త్రెైషోల్డ్‌ లిమిట్‌తో కొలు స్తారు. కొన్ని శబ్ధాలు త్రెైషోల్డ్‌ పరిధిలో ఉన్నప్పటికీ భరించరా నివిగా ఉంటాయి. అవి మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ శబ్దం పెరుగు తోంది. వాహనాల హారన్‌ల మోతతో మనిషి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. శబ్ద కాలుష్యం మన శరీరంపెై, మెదడుపెై ఎంతో ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన జపాన్‌లోని టోక్యో నగరంలో శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు మాస్క్‌లు ధరించి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top