You Are Here: Home » ఇతర » కామితఫలదాయిని కన్యకా పరమేశ్వరి

కామితఫలదాయిని కన్యకా పరమేశ్వరి

దక్షిణ భారత దేశంలో మైసూ రు, విజయవాడ, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ప్రొద్దుటూరులోనే వెలసియున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎంతో వైభవంగా పూజలు నిర్వ హించడం జరుగుతుంది. అయితే ప్రొద్దుటూ రు పట్టణం వ్యాపార రిత్యా రెండవ ముంబా యిగా స్థానాన్ని దక్కించుకోవడమే కాక దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మైసూరు అమ్మవారి తర్వాత ప్రొద్దుటూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయం రెండవ స్థానంలో ప్రాధాన్యత సంత రించుకొంది. పట్టణంలో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కింది.

kanyaka1ప్రొద్దుటూరులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 120 సంల క్రితం కామిశెట్టి చిన్న కొండయ్య నిర్మించారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయం రూపుదిద్దుకొని పట్టణానికే తలమానికంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం అమ్మవారికి పంచామృ తం, గోక్షీరం, గంధం, మంగళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, సహస్ర కుంకుమార్చనలు, రథోత్సవం, నిత్యహోమం వంటి పూజలు నిర్దే శిత రోజుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తుం టారు. అమ్మవారు రంగురంగుల పూల అలం కరణలో బంగారు చీరతో భక్తులకు దర్శనమి స్తుంటారు. అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన వారితో బంగారు రథం, వెంటి ఊయల, బంగారు సింహాసనం, వజ్రపు చీరె, బంగారం, వజ్రపు కెంపులు, రత్నాలు, ముత్యాలతో రూ పొందించిన వెల కట్టలేని ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజు నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.

kanyaka2ప్రభుత్వ దేవాలయాల పరిధిలో లేనప్ప టికీ కేవలం ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం సభ్యుల సహాయ సహకారాలతో కన్య కా పరమేశ్వరి ఆలయాన్ని దినదినాభివృద్ధిగా, తేజోప్య మానంగా వెలుగొందుతూ ఉండేలా చేస్తున్నారు.ప్రతి ఆదివారం, గురువా రం వాసవీ కన్యకా పరమే శ్వరి అమ్మవారిని అలంకరించి బంగారు రథంలో సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తుంటారు. వాసవీ మాతకు ప్రొద్దుటూరులో తప్ప మరెక్కడా బంగారు రథం లేదని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు.అమ్మవారికి పవిత్రమైన రోజైన విజయ దశ మి పర్వదినాన్ని పురష్కరించుకొని అలంకరిం చిన అమ్మవారిని పంచలోహ రథంలో ఊరేగి స్తారు. దీనినే తొట్టి మెరవని అని కూడా అం టారు. ఈ మెరవనిని చూసేందుకు భక్తులు లక్షలాదిమంది ఇక్కడికి తరలి వస్తారు. ఈ రథంలో ఉండే శ్రీ చక్రం అత్యంత శక్తివంత మైనదని, ఆరథం తిరిగిన చోటల్లా అరిష్టాలు తొలగి ఆ ప్రదేశమంతా సస్యశ్యామలమై ప్రజలు శుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం.కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఊంజల్‌ సేవ నిర్వహించేం దుకు భక్తులిచ్చిన విరాళాలతో వెండి ఊయలను రూపొం దించారు. ప్రతి బుధవారం సాయంత్రం అమ్మ వారికి వెండి ఊయలలో సేవలు నిర్వహిస్తారు.

వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉన్న పవిత్రమైన వాహనాలలో అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకున్న గజవాహనం ఉంది. ఈ గజవాహనం అత్యంత సుందరంగా రూపొందించి న ఏనుగు వాహనంపై అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఊరేగిస్తారు. ప్రతి సోమవారం సాయంత్రం అమ్మవారి కి ఈ గజవాహన సేవ ఉంటుంది.ప్రతి మంగళవారం అమ్మవారికి అష్టాదళ పాదపద్మార వదన సేవను వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మద్య నిర్వహిస్తారు. అమ్మవారిని 108 బంగారు, 108 వెండి పూలతో అర్చిస్తారు.శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బంగారు చీరెను తయారు చేయించి ఆ బంగా రుతో రూపొందించిన చీరెను ప్రతి శుక్రవా రం, పర్వదినాలలో అమ్మవారికి అలంకరించడం ఇక్కడ ఆనవాయితి.
– మేజర్‌ న్యూస్‌, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top