You Are Here: Home » సినిమా » పాటలు » కలిమిలేములు (1962)- గాలిలో… గాలిలో…

కలిమిలేములు (1962)- గాలిలో… గాలిలో…

పల్లవి :
గాలిలో… గాలిలో…
తేలే పూలడోలలో… డోలలో…
పన్నీరు జల్లే వెన్నెల తీవ
కన్నుల కలకల ఏమో
చిననాటి ఆనందసీమలో…
అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో…

చరణం : 1
గాలిలో… గాలిలో…
అలారుగ… అలారుగ…
గాలిలో అలలు అలలుగ అలారుగ
గానమేలే కనకవీణ
నగుమోమున తళతళ ఏమో
చిననాటి ఆనందసీమలో…

చరణం : 2
అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
చిననాటి ఆనందసీమలో…

చరణం : 3
గగనాన వెలిగే రేరాజు
చెంగల్వకు కలకాలము చేరువె
ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై
కన్నెవలపు మాయని
పున్నమి వెలుగాయే
చిననాటి ఆనందసీమలో…

చిత్రం : కలిమిలేములు (1962)
రచన : మల్లాది రామకృష్ణశాస్ర్తి
సంగీతం : అశ్వత్థామ
గానం : ఘంటసాల, ఎస్.జానకి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top