You Are Here: Home » ఇతర » కలర్‌ఫూల్‌… కార్నివాల్‌

కలర్‌ఫూల్‌… కార్నివాల్‌


చిరునవ్వుల పలకరింతలు..ఆత్మీయ కౌగిలింతలు..ఉత్సాహ పరిచే డ్యాన్స్‌లు.. కడుపుబ్బా నవ్వించే స్కిట్‌లతో హైదరాబాద్‌లోని లకోటియా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. సీనియర్‌ విద్యార్ధులకు ఫేర్‌వెల్‌ చెబుతూ నిర్వహించిన కార్నివాల్‌ హంగామా-2013 పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులకు మిస్టర్‌ అండ్‌ మిస్‌ పోటీలు నిర్వహించారు. సరికొత్త ట్రెండ్స్‌ను క్రియేట్‌ చేయడంలో తమ సృజనాత్మకతను కూడా వీరు ఈ పోటీల ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. దీంతోపాటు తమ ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ ప్రతిభను ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు, పాడిన పాటలు విద్యార్ధులను ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో లకోటియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ డైరెక్టర్లు అజర్‌, ఆయేషాలతోపాటు మేనేజర్‌ రూపేష్‌ గుప్తా పాల్గొన్నారు.

బుడతల నృత్యాలు భళా


– ఉత్సాహంగా సై్మల్స్‌ ప్రీస్కూల్‌ వార్షికోత్సవం


బుడిబుడి అడుగులతో చిన్నారులు డాన్స్‌లతో ఉర్రూతలూగించారు. రంగురంగుల దుస్తులు ధరించి వెస్ట్రన్‌ పాటలకు స్టెప్పులేసి ఔరా అనిపించారు. పిల్లల నృత్యాలను చూసి తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సై్మల్స్‌ ప్రిస్కూల్‌ నాల్గవ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో కన్నులపండువగా సాగాయి. ఎనిమిది సంవత్సరాలలోపు చిన్నారులు సుమారు 150 మంది వేదికపై పలు సాంసృ్కతిక ప్రదర్శనలతో అలరించారు. ప్రీస్కూల్‌ ప్రిన్సిపల్‌ సంగీత రాజేష్‌ మాట్లా డుతూ విద్యార్థులకు చదువు పట్ల ఇష్టం కలిగేలా తమ ప్రీస్కూల్‌లో విద్యాబోధన ఉంటుందని, అలాగే ఆటపాటల్లోనూ సమాన స్థానం కల్పిస్తున్నామ న్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన పదిమంది చిన్నారులకు ఇన్‌స్పిరేషనల్‌ కిడ్స్‌ అవార్డులను అందించారు.

– ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి, ట్చ్జ్ఛటజిజీటజ్చుఃఝ్చజీజూ.ఛిౌఝ
ఫొటోలు :
కె. సర్వేశ్వర్‌రెడ్డి,
ఎస్‌ శరత్‌బాబు,
ఎ. రమణాచారి

అదిరేటి స్టెప్పు మేమేస్తే
ఉల్లాసంగా జైన్‌ కేంబ్రిడ్స్‌ స్కూల్‌ వేడుకలు చిన్నారులు తమ నృత్యాలతో భళా అనిపించారు. ఫాస్ట్‌ బీటలకు సైతం ఆట అడించారు. హైదరాబాద్‌లోని జైన్‌ హెరిటేజ్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ నాలుగోవార్షికో త్సవ వేడుకలు ఉల్లాసంగా సాగాయి. తాడ్‌బండ్‌లోని జైన్‌ పబ్లిక్‌స్కూల్‌, శామీర్‌పేటలోని జైన్‌ హెరిటేజ్‌ కేంబ్రిడ్జి స్కూల్‌, జైన్‌ గ్రూప్‌ సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ వేడుకల్లో తమనునృత్యాలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ సత్యసాయి నిగమాగమంలో ఈ వేడుకలనునిర్వహించారు. ఈసంద ర్భంగా డ్యాన్స్‌ డ్రామాతో విద్యార్థులు పంచభూత రూపకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఓఓ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

‘హియా’జ్యుయలరీ ప్రదర్శన
Saloniపెళ్లి సమయంలో ధరించే ఆభరణాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈతరుణంలో వధూవరులకు అవసరమైన వెడ్డింగ్‌ జ్యుయలరీని ఒకేచోట అందించేందుకు హియా జ్యుయలరీ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌ సోమాజిగుడలోని నెస్ట్‌ ఆపార్ట్‌మెంట్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను సినీనటి సలోని ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని హియా జ్యుయలరీ డిజైనర్‌ శ్వేతారెడ్డి వెల్లడించారు. ఓల్డ్‌ యాంటిక్‌, డైమండ్స్‌ , కుందన్‌ జ్యుయలరీ, టెంపుల్‌ జ్యుయలరీతోపాటు తొలిసారిగా ఆకర్షణీయమైన రోజ్‌ కట్‌ డైమండ్‌ జ్యుయలరీని ఆభరణాల ప్రియులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా విభిన్నమైన జ్యుయలరీని అందిస్తున్నామని తెలిపారు.

‘నీరూస్‌’వెడ్డింగ్‌ కలెక్షన్‌
azxవధూవరుల కోసం సరికొత్త ఉత్పత్తులు తయారవుతున్నాయి. పెళ్లి సమయంలో ధరించే వస్త్రాకు కూడా ఆదరణ పెరుగుతున్న తరుణంలో డిజైనర్లు తమ సృజన జోడించి వెరైటీ లుక్‌తో వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ తరుణంలో ఫ్యాషన్‌ప్రియులకు అవసరమైన ఉత్పత్తులను అందించడంలో పేరుపొందిన నీరూస్‌ బెంగుళూరులో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో సరికొత్త వెడ్డింగ్‌ కలెక్షన్‌నుప్రదర్శిం చింది. నీరూస్‌ ఎంపోరియా రూపొందించిన వెడ్డింగ్‌ లెహంగాలతోపాటు అనార్కలీ, గౌన్స్‌, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ దుస్తులను నటి శ్రద్ధాదాస్‌ షో స్టాపర్‌గా ర్యాంప్‌పై ప్రదర్శించారు. వాటితోపాటు చీరలు, సిల్క్‌, సల్కార్‌ సూట్స్‌, డ్రస్‌ మెటీరియల్‌, టునిక్స్‌, మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌, కిడ్స్‌ వేర్‌, యాక్ససరీస్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని నీరూస్‌లో జరిగిన కార్యక్రమంలో మోడల్స్‌ ఈ కలెక్షన్‌ను ప్రదర్శించారు.

‘పరిణయ’వెడ్డింగ్‌ ఫెయిర్‌
06FEAzxఫ్యాషన్‌ ఉత్పత్తులు రోజు రోజుకు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. లేటెస్ట్‌ ట్రెండీ వేర్‌ అందుబాటులోి వస్తోంది. ఈ తరుణంలో ఫ్యాషన్‌ప్రియుల కోసం భాగ్యనగరంలో మరో వెడ్డింగ్‌ ఫెయిర్‌ ఏర్పాటు కానుంది. పరిణయ ఈవెంట్స్‌ అండ్‌ ఎగ్జిబిషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌ శ్రీ నగర్‌కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో పరిణయ వెడ్డింగ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌ నిర్వాహకులు రావు మాట్లాడుతూ దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు 80 మంది మాస్టర్‌ వీవర్స్‌ వారి ఉత్పత్తులను ఇక్కడ షోకేస్‌ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాదీలకు ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా అన్ని రకాల వెడ్డింగ్‌ యాక్ససరీస్‌ను ఇక్కడ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

పోచంపల్లి ఇఖత్‌ ఆర్ట్‌ మేళా
Ikat-(1)చేనేత ఉత్పత్తులను కోరుకునే భాగ్యనగర వాసుల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. పోచంపల్లి హ్యాండ్‌లూమ్‌ పార్క్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సోమాజిగుడలోని అమృతమాల్‌లో పోచంపల్లి ఇఖత్‌ ఆర్ట్‌ మేళా ఏర్పాటైంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 11వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ మేళాలో సాంప్రదాయ పద్ధతుల్లో వీవర్స్‌ రూపొందించిన హ్యాండ్‌లూమ్‌ ఉత్పత్తులు ఏర్పాటయ్యాయి. సిల్క్‌ అండ్‌ కాటన్‌ చీరలతోపాటు బెడ్‌షీట్లు, టేబుల్‌ లెనిన్‌, కుషన్‌ కవర్లు, స్టోల్స్‌, డ్రస్‌ మెటీరియల్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇఖత్‌ ఆర్ట్‌తో టెక్స్‌టైల్‌ డిజైనర్లు డిజైన్‌ చేసిన ఈ ఉత్పత్తులు గ్రామీణ చేనేత కళాకారులు రూపొందించారు. చేనేత కళాకారులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు.

బుడతలకోసం బలేబోమ్మలు
Kidloo-(2)ఆటబొమ్మలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. చిన్నవయసులో వాటితో ఆడుకోని వారు ఎవరూ ఉండరు. భారత నెంబర్‌ వన్‌ టాయ్‌ స్టోర్‌ ‘కిడ్లూ’ రిటైల్‌ విధానంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్‌లో తొలి ‘ఎక్స్‌పీరియన్స్‌’ టాయ్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆధునాతన స్టోర్‌లో బొమ్మలను చూసి అక్కడే వాటిని పరీక్షించి ఆడుకుని నచ్చితే కొనుక్కునే సౌలభ్యం ఉన్నట్లు కిడ్లూ సిఈఓ ప్రశాంత్‌ గౌరిరాజు చెప్పారు. డిమాండ్‌ ఉన్న అత్యాధునిక బొమ్మలను సీజన్‌కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడమే కిడ్లూ ప్రత్యేకత అన్నారు.

రూబీస్‌ డిజైనర్‌ వేర్‌ కలెక్షన్‌
06FEAaపెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వధూవరుల కోసం సరికొత్త డిజైనర్‌ వేర్‌ ఉత్పత్తులు అందబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న రూబీస్‌ డిజైనర్‌ వేర్‌ సరికొత్త వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ను అందిస్తోంది. డిజైనర్‌ ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రూబీస్‌ ప్రత్యేకంగా ఫ్యాబులస్‌, ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్‌తోపాటు డిజైనర్‌ గాగ్రాలు, చీరలను పలు రేంజ్‌లలో అందిస్తోంది. ఉప్పాడ, పట్టు, ధర్మవరం సిల్క్‌ బనారస్‌ వంటి ఉత్పత్తులను కూడా ఫ్యాషన్‌ప్రియులకు అందిస్తున్నట్లు చెప్పారు.

‘అయినా’దియేటం పోటీలు
Dramaఅయ్‌నా వార్షిక థియేటర్‌ పోటీ సరికొత్త ప్రతిభకు అద్దం పట్టింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నిఫ్ట్‌ ఆడిటోరి యంలో జరిగిన ఈ నాటక ప్రదర్శనల్లో పలు కళాసంస్థలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. అభస్యభాస్‌(హిందీ), గుడ్‌బై(ఇంగ్లీష్‌), గుడ్‌డాక్టర్‌(ఇంగ్లీష్‌), ఫ్రెండ్స్‌ (హిందీ) నాటకాలను ఇక్కడ ప్రదర్శించారు. సుప్రసిద్ద థియేటర్‌ నటులు రోహిణీ హట్టంగండి, రాకేష్‌బేడీల, దేవేందర్‌ రాజ్‌ అంకుర్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బద్రి విశాల్‌ పిట్టి ట్రస్ట్‌ థియేటర్‌ రంగంలో ఔత్సాహిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇవి నిర్వహిస్తోంది.

బాగ్యనగరంలో ఫ్యాషన్‌ యాత్ర;
sఫ్యాషన్‌ అంటే కొత్త కలెక్షన్ల సేకరణ. స్టైలిష్‌ జీవితం అని అనుకునే వారి కళ్లు తెరిపించేలా ఫ్యాషన్‌కు అసలైన అర్ధాలను నిర్వచిస్తూ కామిని షరాఫ్‌ ఫ్యాషన్‌ యాత్ర హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఫిబ్రవరి 15న ఏర్పాటు కానుంది. తిబారుమల్‌ జ్యుయల్స్‌ నుంచి నీరూస్‌ ఎంపోరియో ది వెడ్డింగ్‌ గ్యాలరియా వరకు విస్తృత స్థాయిలో కలెక్షన్‌ను ఈ ఫ్యాషన్‌యాత్ర అందించనుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సరిహద్దు అంతరాలను ఈ ఫ్యాషన్‌యాత్ర తొలగిస్తోంది. హుమా నాసన్‌ తన జెబాయిష్‌ ఎస్‌ బ్రాహ్‌తి కలెక్షన్‌ను అందిస్తున్నారు. భారత్‌ నుంచి మైహో, రోజ్‌ట్రీ, బాన్‌బీబీ, లాచెసిస్‌, ట్రప్‌సెల్‌, లోటస్‌ సూత్రా, ప్రియా చబ్రియా, అమ్రిచ్‌, కామాక్షి, మ్యాజిక్‌, మోక్ష్‌, త్రెడ్స్‌, అమ్రీషా జున్‌జున్‌వాలా, రెడ్‌ ఆరంజ్‌, మహి, బ్రిజ్‌, సౌల్‌ సిస్టర్స్‌, అహారిస్‌, ఛేంజ్‌, మేఘన చెరుకూరి, మలిహా, అసావరి, ప్రిషాస్‌ వంటివి ఇందులో ఉన్నాయి. యువతరం కోసం లిటిల్‌ ప్రిన్సెస్‌ను శృతిరెడ్డి అందించారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top