You Are Here: Home » భవిత » విద్య » కర్రను తుపాకీగా భావించి వస్తువులను కాల్చే దశ?

కర్రను తుపాకీగా భావించి వస్తువులను కాల్చే దశ?

పేపర్- 1, 2: సైకాలజీ

అభ్యాసకుని వికాసం

1. రవి హైస్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో రవి వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్‌‌గ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు?
1) ఉన్నత సంప్రదాయ
2) ఉత్తర సంప్రదాయ
3) పూర్వ సంప్రదాయ 4) సంప్రదాయ

2. బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజె సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
1) సంవేదన చాలక 2) పూర్వ ప్రచాలక
3) మూర్త ప్రచాలక 4) నియత ప్రచాలక

3. తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరితుడైన పిల్లవాడు కోల్బర్‌‌గ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు?
1) ఉన్నత సంప్రదాయ
2) ఉత్తర సంప్రదాయ
3) పూర్వ సంప్రదాయ 4) సంప్రదాయ

4. రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం – దూరం – బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో రీటా ఏ దశకు చెందుతుంది?
1) నియత చాలక 2) పూర్వ ప్రచాలక
3) మూర్త ప్రచాలక 4) అమూర్త ప్రచాలక

5. కింది ప్రవచనాల్లో సరికానిది?
1) వ్యక్తి వికాసం ఏకీకృత మొత్తం
2) వికాసం రెండు నిర్దేశ పోకడల్లో ఉండొచ్చు
3) సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు
4) విభిన్న కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది

6. విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతంలో విక్రమ్ ఏ దశకు చెందుతాడు?
1) సంవేదన చాలక 2) పూర్వ ప్రచాలక
3) అమూర్త ప్రచాలక 4) మూర్త ప్రచాలక

7. విద్యార్థిలో కచ్చితంగా కొలవగలిగేది?
1) నైతికత 2) ఉద్వేగాలు
3) పెరుగుదల 4) జ్ఞానం

8. పియాజె పేర్కొన్న ఇంద్రియచాలక దశలో కనిపించని తల్లి కోసం బాలుడు వెతికితే అతడు ఏ భావనను పొందినట్లు?
1) స్థల 2) సమయన
3) పదిలపరుచుకొనే 4) వస్తు స్థిరత్వ

9. అధ్యహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది?
1) ఉద్వేగ 2) శారీరక
3) సాంఘిక 4) నైతిక

10. కింది వైఖరి మాపనుల్లో సరికాని ప్రవచనం?
1) లైకర్‌‌ట – 5 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి
2) బోగార్డస్ – సోషల్ డిస్టెన్‌‌స స్కేల్
3) థర్‌స్టన్- తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి
4) గట్‌మన్ – 11 ఐచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి

11. రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు, ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థ పూరిత ఆలోచనలు కలిగి ఉంటే పియాజె ప్రకారం రాహుల్ వయసు ఎన్నేళ్లు?
1) 0-2 2) 2-7
3) 7-11 4) 12-16

12. వికాసం అనే భావనకు సంబంధించి సరికాని ప్రవచనం?
1) కొంతకాలం తర్వాత కూడా కొనసాగుతుంది
2) అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
3) ఏకీకృత మొత్తం
4) కచ్చితంగా మాపనం చేయలేం

13. ఉపాధ్యాయుడు ముందు లేఖనం తర్వాత పఠనం తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం?
1) వికాసం క్రమానుగతమైంది
2) వికాసం సాధారణ అంశాల నుంచి, నిర్దిష్ట అంశాలకు దారి తీస్తుంది
3) వికాసం సంచితమైంది
4) వికాసం ఏకీకృత మొత్తం

14. ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునపటి స్థితికంటే సాగదీసిన మట్టిముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదు?
1) స్కీమాస్ 2) కన్సర్వేషన్
3) స్వాయత్తీకరణం 4) అనుగుణ్యం

15. హాపీ ఇండియన్ పిల్లలు పాకే వయసులో తల్లి వీపు, ఊయల మీద గడిపేవారు. 12 నెలల వయసు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితం?
1) వికాసం 2) అభ్యసనం
3) పరిపక్వత 4) అభ్యాసం

16. రాము పరీక్షలో రాసినదాన్ని శ్యాము చూపించమని అడిగాడు. ఐతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడని భయపడి రాము శ్యాముకు చూపించడు. రాము కోల్బర్‌‌గ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు?
1) పూర్వ సంప్రదాయ 2) సంప్రదాయ
3) ఉత్తర సంప్రదాయ
4) ఉన్నత సంప్రదాయ

17. రాము బొమ్మకు స్నానం చేయిస్తాడు. ఆ బొమ్మకు సీసాతో పాలు తాగిస్తాడు. జోలపాడి నిద్రపుచ్చుతాడు. పియాజె సంజ్ఞానాత్మక వికాసంలో రాము ఏ దశలో ఉంటాడు?
1) జ్ఞానేంద్రియచాలక 2) పూర్వ ప్రచాలక
3) మూర్త ప్రచాలక 4) అమూర్త ప్రచాలక

18. పరిణతికి సంబంధించి సరికాని భావన?
1) అభ్యాసం, శిక్షణతో వేగవంతమవుతుంది
2) జైవిక స్వభావం కలది 3) ఆర్జితమైంది
4) పరిణతిపై పరిమితి ఉంటుంది

19. శిశువు జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అవగాహన చేసుకోవడం ఏ వికాస నియమం?
1) క్రమానుగతమైంది
2) సాధారణత నుంచి ప్రత్యేకతకు దారి తీస్తుంది
3) సంచితమైంది
4) రెండు నిర్దేశ పోకడల్లో ఉండొచ్చు

20. రవి, సురేష్ అన్నదమ్ములు. ఒక రోజు రవి తల్లిదండ్రులకు చెప్పకుండా స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. ఆ విషయాన్ని దాస్తే తల్లిదండ్రులు తనని కొడతారని సురేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. కోల్బర్‌‌గ నైతిక వికాసంలో సురేష్ ఏ స్థాయిలో ఉంటాడు?
1) పూర్వ సంప్రదాయ 2) సంప్రదాయ
3) ఉత్తర సంప్రదాయ
4) ఉన్నత సంప్రదాయ

21. గోపి కర్రను తుపాకిగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తూ కాల్చడం ఏ దశ?
1) సంవేదన చాలక 2) పూర్వ ప్రచాలక
3) మూర్త ప్రచాలక 4) అమూర్త ప్రచాలక

22. పాఠ్య ప్రణాళికలోని ప్రవేశిక చర్యలో పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం. పూర్వజ్ఞానానికి నూతన జ్ఞానం అనుసంధానం చేయడం ఏ వికాస నియమం ప్రకారం జరుగుతుంది?
1) క్రమానుగతమైంది
2) ఏకీకృతమైంది 3) సంచితమైంది
4) వ్యక్తిగత భేదాలుంటాయి

23. ప్రతిభావంతులకు సగటు ప్రజ్ఞ ఉన్నవారు జన్మించడం మెండల్ ప్రకారం ఏ సూత్రం?
1) సారూప్య 2) వైవిధ్య
3) ప్రతిగమన 4) పరిసర

24. మేనరిక వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్రం?
1) సారూప్య 2) వైవిధ్య
3) ప్రతిగమన 4) పరిసర

25. భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వజ్ఞానం?
1) వికాసం రెండు నిర్దేశ పోకడల్లో ఉండొచ్చు
2) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
3) వికాసం సంచిత ప్రక్రియ
4) వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది.

26. వీటిలో వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం?
1) జీవితాంతం సాగే నిరంతర ప్రక్రియ
2) గణనాత్మకం 3) సమగ్ర భావన
4) కేవలం అంచనా వేయగలం

27. ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తం నేర్పిస్తే అతడు ఏ వికాస నియమాన్ని పాటించాడు?
1) సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
2) క్రమానుగతమైంది
3) సంచితమైంది
4) నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది

28. వికాసం క్రమానుగతమైంది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు?
1) పఠనం, భాషణం, శ్రవణం, లేఖనం
2) లేఖనం, భాషణం, పఠనం, శ్రవణం
3) శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం
4) శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం

29. వాట్సన్ ప్రయోగంలో ఆల్‌బర్‌‌ట అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు, తెల్లబొచ్చుతో కూడిన బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం?
1) సంచితమైంది 2) క్రమానుగతమైంది
3) సాధారణ నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
4) క్రమానుగతమే ఐనప్పటికి వ్యక్తిగత భే దాలుంటాయి

30. ఉపాధ్యాయుడు మూర్తభావనల తర్వాత అమూర్తభావనలు నేర్పితే ఏ వికాస సూత్రాన్ని అనుసరించినట్లు?
1) సంచితమైంది
2) క్రమానుగతమైంది
3) నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది
4) వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది

31. వీరిలో అనువంశిక వాది కానివారు?
1) గోడార్‌‌డ 2) గోర్డన్
3) గాల్టన్ 4) డగ్‌డేల్

32. పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్న వారు?
1) బాగ్లే 2) ఫ్రీమన్
3) వాట్సన్ 4) గాల్టన్

33. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస నియమం?
1) సంచితమైంది
2) క్రమానుగతమైంది
3) నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది
4) అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది

34. సమీప దూరస్థ వికాసం (Proximo Di-stal) అంటే ఏ వికాస నియమం?
1) పాదాల నుంచి ఆరంభమై తలకు విస్తరిస్తుంది
2) తల నుంచి ఆరంభమై పాదాల వరకు విస్తరిస్తుంది
3) దేహ మధ్యస్థ భాగంలో ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది
4) మొదటి భాగంలోనే ఉంటుంది

35. రాజు ఒక సగటు విద్యార్థి. తాను పాఠశాలలో బంగారు పతకం సాధించుకున్నట్లు ఊహించుకుంటే రాజు ఉన్న దశ?
1) శైవశ 2) బాల్య
3) కౌమార 4) వయోజన

36. అబద్దమాడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి నేర్చుకొన్న విద్యార్థి కోల్‌బర్‌‌గ ప్రకారం ఏ నైతిక స్థాయికి చెందుతాడు?
1) సంప్రదాయ 2) ఉన్నత సంప్రదాయ
3) ఉత్తర సంప్రదాయ
4) పూర్వ సంప్రదాయ

37. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు ఏ రంగాల నుంచి లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు?
1) జ్ఞానాత్మక 2) జ్ఞానాత్మక, భావావేశ
3) జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక
4) జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానం, అవగాహన, వినియోగం నుంచి మాత్రమే

38. ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర బోధించాడు. అతడు అనుసరించిన వికాస నియమం?
1) సంచితమైంది 2) క్రమానుగతమైంది
3) రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది.
4) సాధారణత నుంచి నిర్దిష్టతకు దారి తీస్తుంది

39. కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్‌బర్‌‌గ ఏ నైతిక స్థాయికి చెందుతాడు?
1) ఉన్నత సంప్రదాయ
2) ఉత్తర సంప్రదాయ
3) పూర్వ సంప్రదాయ 4) సంప్రదాయ

40. వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం?
1) శైశవ దశ – నైతిక సర్దుబాటు
2) బాల్యదశ – ప్రశ్నించే వయసు
3) కౌమార దశ – నాయక ఆరాధన
4) వయోజన దశ- void

41. ఉపాధ్యాయుడు లేఖనం తర్వాత పఠనం, పఠనం తర్వాత భాషణం, భాషణం తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలు పాటించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం?
1) సంచితమైంది 2) ఏకీకృతమైంది
3) క్రమానుగతమైంది
4) రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది

42. శిరోపాదాభిముఖ వికాసం ఏ నియమాన్ని సమర్థిస్తుంది?
1) సంచితమైంది 2) ఏకీకృతమైంది
3) క్రమానుగతమైంది
4) రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది

44. తరగతిలోని విద్యార్థుల ప్రజ్ఞ విషయంలో మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు, సగటు కంటే తక్కువ, సగటు, ప్రజ్ఞ ఉన్న విద్యార్థులున్నారు. ఇక్కడ మనం గమనించే నియమం?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
2) వికాసం సంచితమైంది
3) వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది
4) పైవేవీ కావు

45. ఉపాధ్యాయుడు ప్రజ్ఞా వికాసం, నైతిక వికాసానికి పరస్పర సంబంధాలను గుర్తించాడు. ఇక్కడ మనం గమనించే వికాస నియమం?
1) క్రమానుగతమైంది
2) సంచితమైంది 3) ఏకీకృతమైంది
4) సులభత నుంచి క్లిష్టతకు దారి తీస్తుంది

46. మైక్రో టీచింగ్‌లో ఉపాధ్యాయుడు వివరణ అనే నైపుణ్యం ఉపయోగించినప్పుడు పాటించాల్సిన వికాస నియమం?
1) ఏకీకృతమైంది
2) రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది
3) సాధారణ అంశాల నుంచి నిర్దేశిత అంశాలకు దారి తీస్తుంది
4) వ్యక్తిగత భేదాలుంటాయి

47. విద్యార్థి వృత్తం ఆధారంగా చతురస్రం నేర్చుకోవడం ఏ వికాస నియమం?
1) క్రమానుగతమైంది
2) ఏకీకృతమైంది 3) సంచితమైంది
4) రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది

48. మహాత్మా గాంధీ పేర్కొన్న విద్యలో సర్వతోముఖాభివృద్ధి అనే భావన సాధించడానికి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన వికాస నియమం?
1) క్రమానుగతమైంది
2) సంచితమైంది 3) ఏకీకృతమైంది
4) సాధారణ నుంచి నిర్దిష్టతకు దారి తీస్తుంది

సమాధానాలు
1) 3 2) 4 3) 3 4) 2 5) 3
6) 3 7) 3 8) 4 9) 4 10) 4
11) 2 12) 2 13) 1 14) 2 15) 3
16) 1 17) 2 18) 3 19) 3 20) 1
21) 2 22) 3 23) 2 24) 3 25) 3
26) 2 27) 2 28) 4 29) 3 30) 2
31) 2 32) 3 33) 1 34) 3 35) 3 36) 4 37) 3 38) 2 39) 4 40) 1 41) 3 42) 3 43) 3 44) 4 45) 3
46) 3 47) 3 48) 3

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top