You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » కర్ణాటక సంగీతంలో కలికితురాయి ముత్తుస్వామి దీక్షితార్‌

కర్ణాటక సంగీతంలో కలికితురాయి ముత్తుస్వామి దీక్షితార్‌

కర్ణాటక సంగీతంలో కలికితురాయి ముత్తుస్వామి దీక్షితార్‌

 

ముత్తుస్వామి దీక్షితర్‌ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు. ‘వాతాపి గణపతి ం భజే’ అన్న కీర్తన విననివారుం డరంటే అది అతి శయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామస్వామిదీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఆయన ప్రదర్శించారు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్ర్తీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించారు. సంగీతంపై వెలువడిన వెంకటాముఖి సుప్రసిద్ధ గ్రంధం చతుర్‌దండి ప్రకాశిెకైను అధ్యయనం చేశారు. ముత్తుస్వామి దీక్షితార్‌ ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం…
muttuచిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ఇతడిని ఉపాసనామార్గంలో ప్రవేశపెట్టారాయన. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నారు. శ్రీనాధాధి గరుగుహోజయతి అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ముత్తుస్వామి రచించి రాగం కూర్చారు. తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను ఆయన పారవశ్యంతో రచించారు. ఆధ్యాత్మిక వెలుగులో ఈయన సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకున్న వారికి తన కృతులను ఆలాపించడం ఎలాగో బోధించారు.

తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మధురై మీనాక్షి అమ్మన్‌ ఆలయాన్ని దర్శించారు. అక్కడే అతడు మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ధ్యాన యోగం, జ్యోతిష్య శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితార్‌ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పై ఆయన రాసిన నవవర్ణ కీర్తనలు నవ గ్రహాలపైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ముత్తుస్వామి ఎన్నో కీర్తనలను రచించారు. శివ పాహి ఓం శివే అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించారు ముత్తుస్వామి దీక్షితులు.

అటువంటి అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష్య, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నాయి. హిందూస్థానీ సంగీతంనుండి కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్న దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులుజేసారు. ఆయన రచించిన కృతులలో కమలాంబా నవవర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి.

వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మరుూం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.

ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. ఆయన హంసధ్వని రాగమునుకనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమేగాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడేటప్పుడు వీణను కూడ వాయించేవారు. వీణతో కలిపిపాడటంచేత వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో ఉపయోగించేవారు. చివర…మధ్యమ కాలాలు సామాన్యముగా ఆయన కీర్తనలలో కనబడటం విశేషం. ముత్తుస్వామి దాదాపు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపారు. అందుకని ఆయనకు హిందూస్తానీ సంగీతంతో బాగా పరిచయం ఉండేది.

హిందూస్తానీ రాగాలను తనకీర్తనలలో ఎక్కువగా వాడేవారు.(జంఝూటి, జయజయవంతి, యమన్‌,సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు). ముత్తుస్వామి తన తండ్రిగారితో నాటి మదరాసు సమీపమున ఉన్న మణలిలో కొన్ని సంవత్సరములపాటు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్‌. ఆయన దుబాసి, సెయింట్‌ జార్జ్‌ కోటలో పని చేసేవారు. కాగా అప్పుడప్పుడు ముత్తుస్వామిని, ఆయన తమ్ముడైన బాలాస్వామినికోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్‌ మేళాన్ని వినేవారు. సి మేజర్కు సరిపోయే శంకరాభరణములో నోటు స్వరములను వ్రాసేవారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top